all india badminton
-
క్వార్టర్స్‌లో రాహుల్, సిరిల్ వర్మ
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులు చిట్టబోయిన రాహుల్ యాదవ్, సిరిల్ వర్మ ముందంజ వేశారు. కేరళలోని కోజికోడ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ పురుషుల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మూడో సీడ్ రాహుల్ యాదవ్ 21–14, 21–9తో మునావర్ మొహమ్మద్ (కేరళ)పై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో పదమూడో సీడ్ సిరిల్ వర్మ (తెలంగాణ) 21–13, 21–15తో కార్తికేయ గుల్షన్ కుమార్ (ఢిల్లీ)పై నెగ్గాడు. ఏపీ ప్లేయర్ జశ్వంత్ 23–21, 13–21, 9–21తో మిథున్ (ఎయిరిండియా) చేతిలో ఓడిపోయి ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించాడు. మహిళల సింగిల్స్‌లో ఏపీ క్రీడాకారిణి నిషిత వర్మ, తెలంగాణ ప్లేయర్ కేయూర మోపాటి ప్రిక్వార్టర్స్‌లో ఓడిపోయారు. నిషిత వర్మ 16–21, 12–21తో నమిత పథానియా (ఢిల్లీ) చేతిలో, కేయూర (తెలంగాణ) 21–19, 14–21, 10–21తో ఎనిమిదో సీడ్ ఐరా శర్మ (హరియాణా) ఓడింది. పురుషుల డబుల్స్‌లో శ్రీకృష్ణ సాయి కుమార్ జంట క్వార్టర్స్‌కు చేరుకోగా... కృష్ణ ప్రసాద్ జోడీ రెండో రౌండ్లో అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో శ్రీకృష్ణ సాయికుమార్ (తెలంగాణ)–గౌస్ షేక్ (ఏపీ) జంట 21–8, 21–13తో మధుసూదన్ (కర్ణాటక)–సంజీత్ (రైల్వేస్) జోడీపై గెలుపొందింది. రెండోసీడ్ కృష్ణ ప్రసాద్ (ఏపీ)–ధ్రువ్ కపిల (ఎయిరిండియా) ద్వయం 21–16, 21–11తో అక్షయ్–అనిరుద్ధ మయేకర్ (మహారాష్ట్ర) జోడీపై గెలుపొందింది. మిక్స్డ్ డబుల్స్‌లో శ్రీకృష్ణ–కనిక కన్వల్ జోడీ, హేమనాగేంద్ర బాబు–శ్రీవిద్య గురజాడ జంటలు క్వార్టర్స్‌లో అడుగుపెట్టాయి. ప్రిక్వార్టర్స్‌లో శ్రీకృష్ణ సాయికుమార్ (తెలంగాణ)–కనిక కన్వల్ (రైల్వేస్) జంట 21–17, 22–24, 21–17తో టాప్ సీడ్ గౌస్ షేక్ (ఏపీ)–మనీషా (ఆర్బీఐ) జోడీకి షాకిచ్చింది. మరో మ్యాచ్‌లో హేమనాగేంద్ర బాబు (రైల్వేస్)–శ్రీవిద్య గురజాడ (తెలంగాణ) జంట 16–21, 21–6, 21–19తో ప్రతీక్ రనడే–అక్షయ వరంగ్ (మహారాష్ట్ర) జోడీపై నెగ్గింది. -
సామియాతో గాయత్రి అమీతుమీ
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జూనియర్ అండర్–19 ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో బాలికల సింగిల్స్ విభాగంలో టైటిల్ తెలంగాణ ఖాతాలోనే చేరనుంది. జైపూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్లు పుల్లెల గాయత్రి, సామియా ఇమాద్ ఫరూఖీ ఫైనల్‌కు చేరుకున్నారు. నేడు జరిగే టైటిల్ పోరులో వీరిద్దరూ తలపడనున్నారు. సోమవారం జరిగిన బాలికల సింగిల్స్ సెమీస్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ గాయత్రి (తెలంగాణ) 21–13, 21–10తో నాలుగో సీడ్ కవిప్రియ (పాండిచ్చేరి)పై గెలుపొందగా... ఏడో సీడ్ సామియా (తెలంగాణ) 21–13, 18–21, 23–21తో ఆరో సీడ్ మాన్సి సింగ్‌ను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించారు. అంతకుముందు జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో గాయత్రి 21–15, 23–21తో స్మిత్ తోష్నివాల్ (మహారాష్ట్ర)పై, సామియా ఇమాద్ ఫరూఖీ 19–21, 21–10, 21–17తో రెండో సీడ్ ఉన్నతి బిష్త్ (ఉత్తరాఖండ్)పై విజయం సాధించారు. బాలుర సింగిల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారుల పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. బాలుర సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో తొమ్మిదో సీడ్ తరుణ్ 16–21, 21–16, 13–21తో ఎనిమిదో సీడ్ సాయి చరణ్ (ఆంధ్రప్రదేశ్) చేతిలో ఓడిపోయాడు. సెమీస్‌లో సాయి చరణ్ 17–21, 21–10, 19–21తో నాలుగో సీడ్ ఆకాశ్ యాదవ్ (ఢిల్లీ) చేతిలో పరాజ యం చవిచూశాడు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ జోడీ నవనీత్– సాహితి టైటిల్‌పోరుకు సిద్ధమైంది. సెమీస్‌లో నవనీత్–సాహితి ద్వయం 21–15, 21–15తో బల్కేశ్వరీ యాదవ్ (ఉత్తరప్రదేశ్)–శవీ భట్నాగర్ (మధ్యప్రదేశ్) జంటపై గెలుపొందింది. బాలికల డబుల్స్ విభాగంలో సాహితి జంట సెమీస్‌లోనే ఓటమి పాలైంది. రెండో సీడ్ కవిగుప్తా–ఖుషీ గుప్తా (ఢిల్లీ) జంట 21–12, 21–17తో నాలుగో సీడ్ సాహితి–నఫీసా సారా సిరాజ్ జోడీపై నెగ్గి ఫైనల్‌కు చేరుకుంది. -
క్వార్టర్స్‌లో గాయత్రి, సామియా
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ ప్లేయర్లు పుల్లెల గాయత్రి, సామియా ఇమాద్ ఫరూఖీ, తరుణ్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు. జైపూర్‌లో ఆదివారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్ గాయత్రి 21–19, 21–12తో తనీషా సింగ్ (ఉత్తరప్రదేశ్)పై గెలుపొందగా... ఏడో సీడ్ సామియా ఇమాద్ ఫరూఖీ 21–16, 21–12తో ఆషి రావత్ (ఢిల్లీ)ని ఓడించింది. బాలుర సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో తొమ్మిదో సీడ్ తరుణ్ 21–19, 21–16తో రెండోసీడ్ మైస్నమ్ మేరాబ (మణిపూర్)కు షాకిచ్చి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ఇతర ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ సాయిచరణ్ కోయ (ఆంధ్రప్రదేశ్) 17–21, 21–19, 21–19తో శంకర్ ముత్తుస్వామిపై గెలుపొందగా.... ప్రణవ్ రావు గంధం (తెలంగాణ) 21–17, 22–24, 10–21తో సతీశ్ కుమార్ (తమిళనాడు) చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ రెండోరౌండ్లో రెండోసీడ్ నవనీత్–సాహితి (తెలంగాణ) ద్వయం 27–25, 21–17తో రవికృష్ణ (కేరళ)– వర్షిణి (తమిళనాడు) జంటపై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకుంది. బాలుర డబుల్స్ విభాగంలోనూ నవనీత్ జంట క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో టాప్‌సీడ్ నవనీత్– విష్ణువర్ధన్ (తెలంగాణ) జంట 21–10, 21–14తో మొహమ్మద్ అమన్– ఖవర్ జమాల్ ఖాన్ (రాజస్తాన్) జోడీపై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో ఖదీర్ మొయినుద్దీన్ (తెలంగాణ)–అరవింద్ (కేరళ) జంట 21–19, 21–13తో సూరజ్–అన్షుమన్ గొగోయ్ (అస్సాం) జంటపై, నితిన్ (కర్ణాటక)– వరప్రసాద్ (ఆంధ్రప్రదేశ్) జంట 21–11, 17–21, 21–14తో అరుణేశ్–గోకుల్ (తమిళనాడు) జోడీపై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. శరత్ (ఆంధ్రప్రదేశ్)–అచ్యుతాదిత్య రావు (తెలంగాణ) ద్వయం 14–21, 18–21తో ఇషాన్ భట్నాగర్ (ఛత్తీస్‌గఢ్)–ఎడ్విన్ జాయ్ (కేరళ) జంట చేతిలో ఓడిపోయి రెండోరౌండ్లోనే ఇంటిదారి పట్టింది. బాలికల డబుల్స్ ప్రిక్వా ర్టర్స్‌లో సాహితి–నఫీసా జంటకు వాకోవర్ లభించింది. మరో మ్యాచ్‌లో శ్రీవిద్య గురజాడ–సాయి శ్రీయ (తెలంగాణ) ద్వయం 21–11, 21–13తో ఆర్య–లివియా ఫెర్నాండేజ్ (మహారాష్ట్ర) జంటపై నెగ్గి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. -
సిరిల్ వర్మకు సింగిల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ కుర్రాడు సిరిల్ వర్మ సత్తా చాటాడు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో అతను పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఫైనల్లో ఎ. సిరిల్ వర్మ (తెలంగాణ) 18–21, 21–16, 21–8తో సౌరభ్ వర్మపై విజయం సాధించాడు. తొలి గేమ్‌లో వెనుకబడిన సిరిల్ తర్వాతి రెండు గేముల్లో పుంజుకుని మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. మహిళల విభాగంలో తెలుగు అమ్మాయి సాయి ఉత్తేజిత రావు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్లో పదహారో సీడ్ అష్మితా చలిహా (అస్సాం) 21–16, 14–21, 21–15తో మూడో సీడ్ ఉత్తేజిత (ఆంధ్రప్రదేశ్)కు షాకిచ్చింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో కృష్ణ ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)– ధ్రువ్ కపిల (ఎయిరిండియా) ద్వయం 24–22, 21–13తో అరుణ్ జార్జి (కేరళ)–సన్యం శుక్లా (ఎయిరిండియా) జోడీపై నెగ్గి టైటిల్‌ను గెలుచుకుంది. మిక్స్డ్ డబుల్స్‌లో కె. నందగోపాల్ (కాగ్)–సంజన (ఎయిరిండియా) జంట 21–16, 13–21, 21–17తో ధ్రువ్ కపిల–మేఘన జక్కంపూడి (ఆర్బీఐ) జోడీపై విజయం సాధించింది. మహిళల డబుల్స్ విభాగంలో అపర్ణ బాలన్ జంట చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో మూడో సీడ్ అపర్ణ బాలన్– శ్రుతి జోడీ 19–21, 21–19, 21–18తో సంయోగిత (ఎయిరిండియా)–ప్రజక్తా సావంత్ జంటను ఓడించింది. పోటీల అనంతరం జరిగిన బహు మతి ప్రదాన కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి అజయ్ సింఘానియా, ఒమర్ రషీద్, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. -
అనికేత్, యశ్వంత్‌ల శుభారంభం
సాక్షి, గుంటూరు: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాళ్లు అనికేత్ రెడ్డి, యశ్వంత్ రామ్ శుభారంభం చేశారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో అనికేత్ రెడ్డి 15–10, 15–8తో అర్జున్ కృష్ణన్ (తమిళనాడు)పై గెలుపొందగా, యశ్వంత్ 15–11, 15–11తో ఉమంగ్ కౌశిక్ (ఉత్తరాఖండ్)పై నెగ్గాడు. మిగతా మ్యాచ్‌ల్లో వెంకట హర్షవర్ధన్ (ఏపీ) 4–15, 15–13, 15–10తో కవియరాసన్ (తమిళనాడు)పై, అనురాగ్ (ఏపీ) 15–1, 15–4తో హేమంత్ సింగ్ (కర్ణాటక)పై, పవన్ కుమార్ (ఏపీ) 16–14, 9–2తో సోహం నవందర్ (మహారాష్ట్ర)పై, దత్తాత్రేయ రెడ్డి (ఏపీ) 15–11, 15–7తో తుషార్ మక్కర్ (హరియాణా)పై, సాయి నాగ కోటేశ్వర్ (ఏపీ) 15–8, 15–6తో ఉమాకాంత్ సర్గే (మహారాష్ట్ర)పై, శరత్ (ఏపీ) 15–5, 15–3తో నితిన్ కుమార్ (హరియాణా)పై, సుమంత్ (ఏపీ) 15–4, 18–20, 15–10తో ఆశిష్ (తమిళనాడు)పై విజయం సాధించారు. రోహన్ (మహారాష్ట్ర) 15–3, 15–4తో మురళీధర్ (ఏపీ)పై, వెళవన్ (తమిళనాడు) 15–5, 15–9తో ధీరజ్ (ఏపీ)పై గెలుపొందగా, యద్దనపూడి అమ్మన్న గౌడ్ (తెలంగాణ) వాకోవర్‌తో ముందంజ వేశాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రజ్ఞ (ఏపీ) 12–15, 15–12, 15–11తో అంతర దాస్ (తెలంగాణ)పై విజయం సాధించగా, శ్రేయ రెడ్డి (తెలంగాణ) 0–15, 3–15తో విభూతి శర్మ (ఢిల్లీ) చేతిలో, వన్షిక కపిల (తెలంగాణ) 15–11, 12–15, 13–15తో షాలిని శుక్లా (ఉత్తర ప్రదేశ్) చేతిలో, ప్రవళిక 3–15, 5–15తో ఆరుషి శర్మ (తమిళనాడు) చేతిలో పరాజయం చవిచూశారు. మిక్స్డ్ డబుల్స్‌లో గోపాలకృష్ణ–ప్రీతి (తెలంగాణ) జోడి 15–4, 15–9తో వినోద్–అశ్రిత (తమిళనాడు) జంటపై గెలిచింది. అంతకుముందు జరిగిన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. -
గాయత్రి డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి పుల్లెల గాయత్రి సత్తా చాటింది. తమిళనాడులో జరిగిన ఈ టోర్నీలో అండర్–17 సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో ఏడో సీడ్ గాయత్రి 21–19, 15–21, 21–18తో టాప్ సీడ్ ఆకర్షి కశ్యప్‌కు షాకిచ్చింది. డబుల్స్ విభాగంలో నగరానికే చెందిన సామియా ఇమాద్ ఫరూఖితో జతకట్టిన గాయత్రి ఫైనల్లో 21–19, 17–21, 21–12తో కేయూర మోపాటి–కవిప్రియ (హైదరాబాద్) జంటపై గెలుపొందింది. మరోవైపు బాలుర సింగిల్స్ విభాగంలో ధ్రువ్ రావత్ 21–17, 21–19తో అమిత్ రాథోడ్‌పై నెగ్గి విజేతగా నిలిచాడు. డబుల్స్ ఫైనల్లో ఖదీర్ మొయినొద్దీన్ మొహమ్మద్–విష్ణువర్ధన్ గౌడ్ ద్వయం 21–15, 20–22, 21–19తో యశ్ రైక్వార్–ధ్రువ్ రావత్ జంటను ఓడించింది. అండర్–19 సింగిల్స్ విభాగంలో మాల్విక బన్సోడ్, అరింథాప్ దాస్ గుప్తా టైటిళ్లను సాధించారు. బాలికల ఫైనల్లో మాల్విక 12–21, 21–19, 21–13తో అస్మితాపై, బాలుర ఫైనల్లో అరింథాప్ 21–19, 21–16తో సంజయ్ ఠాకూర్‌పై గెలుపొందారు. బాలికల డబుల్స్ విభాగంలో రుతుపర్ణా పాండ–మిథులా ద్వయం 21–11, 21–15తో సిమ్రన్ సింఘి–రితికా ఠాకూర్ జంటను ఓడించి విజేతగా నిలిచింది. మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో ధ్రువ్–మిథులా జోడీ 21–18, 21–19తో శ్రీకృష్ణ సాయి కుమార్–రుతుపర్ణా పాండ జంటపై నెగ్గింది. -
నందగోపాల్, మేఘన ‘డబుల్’
రెండేసి టైటిల్స్ నెగ్గిన హైదరాబాద్ ప్లేయర్స్ ∙ సింగిల్స్ చాంప్ రోహిత్ యాదవ్ సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు క్రీడాకారులు సత్తా చాటారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ముగిసిన ఈ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన కిడాంబి నందగోపాల్, మేఘన జక్కంపూడి చెరో రెండు టైటిళ్లను కైవసం చేసుకోగా.... రోహిత్ యాదవ్ పురుషుల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో జోడీగా టైటిల్‌ను గెలిచిన నందగోపాల్– మేఘనలు... మహిళల, పురుషుల డబుల్స్ విభాగాల్లో తమ భాగస్వాములతో కలిసి విజేతలుగా నిలిచారు. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో కె. నందగోపాల్ (సీఏజీ)– మేఘన జక్కంపూడి (ఏఐ) ద్వయం 21–16, 21–11తో సాన్యమ్ శుక్లా–సంయోగిత (ఏఐ) జంటను చిత్తుగా ఓడించి తొలి టైటిల్‌ను గెలుచుకుంది. పురుషుల డబుల్స్ విభాగంలో నందగోపాల్–సాన్యమ్ శుక్లా జంట 21–16, 14–21, 21–11తో అరుణ్ జార్జి (కేరళ)–శివమ్ శర్మ (యూపీ) జోడీపై.... మహిళల డబుల్స్ విభాగంలో మేఘన–పూర్వీషా (కర్ణాటక) జంట 21–12, 21–17తో కుహూ గార్గ్–నింగ్షి బ్లాక్ హజారికా జోడీపై గెలుపొందడంతో ఇద్దరి ఖాతాలో మరో టైటిల్ చేరింది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో రోహిత్ యాదవ్ (ఏఏఐ) 21–17, 21–16తో హర్షిత్ అగర్వాల్ (ఏఐ)ను ఓడించి విజేతగా నిలిచాడు. మహిళల సింగిల్స్ విభాగంలో అరుంధతి (మహారాష్ట్ర) 21–14, 14–21, 21–16తో శ్రీయాన్షి పరదేశి (మధ్యప్రదేశ్)పై గెలుపొందింది. -
రన్నరప్ శ్రీకృష్ణప్రియ
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి కె. శ్రీకృష్ణప్రియ రన్నరప్‌గా నిలిచింది. కేరళలోని త్రిసూర్‌లో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో శ్రీకృష్ణప్రియ 16-21, 8-21తో తన్వీ లాడ్ (పీఎస్‌పీబీ) చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణి జక్కంపూడి మేఘన తన భాగస్వామి సాన్యమ్ శుక్లాతో కలిసి టైటిల్ సాధించింది. ఫైనల్లో మేఘన-శుక్లా ద్వయం 21-7, 21-8తో శివమ్ శర్మ-హారిక జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో కిడాంబి నందగోపాల్-సాన్యమ్ శుక్లా జంట 19-21, 14-21తో రూపేశ్ కుమార్-సనావే థామస్ ద్వయం చేతిలో ఓడిపోయింది.