All India Council of Technical Education
-
డిగ్రీ మార్కులతోనే ఎంబీఏ ప్రవేశాలు
న్యూఢిల్లీ: కోవిడ్–19 కారణంగా మేనేజ్మెంట్ కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశాలు కనిపించకపోవడంతో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎంబీఏ, పీజీడీఎం కోర్సులకు ఆన్లైన్ ద్వారా ఎంట్రన్స్‌లో పాల్గొన్న వారికి డిగ్రీ పరీక్షల్లో మార్కులే ప్రాతిపదికగా ప్రవేశాలు చేపట్టేందుకు కళాశాలలకు అనుమతినిచ్చింది. ఈ వెసులుబాటు 2020–21 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని కూడా స్పష్టం చేసింది. ఎంబీఏ, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్(పీజీడీఎం)లకు అఖిల భారత స్థాయిలో క్యాట్, సీమ్యాట్, మ్యాట్, జీమ్యాట్, ఎక్స్‌మ్యాట్, ఏటీఎంఏతోపాటు రాష్ట్రాలు వేరుగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలు చేపడతాయి. కరోనా కారణంగా ఈ ప్రవేశ పరీక్షల్లో చాలా మటుకు జరగలేదు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో పీజీడీఎం, ఎంబీఏ విద్యాసంస్థలు ఎంపిక పరీక్షల్లో మార్కుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు అనుమతిస్తున్నాం. అయితే, ఏవైనా ప్రవేశ పరీక్షల్లో క్వాలిఫై అయిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. వీరు డిగ్రీ లో కనీసం మార్కులు సాధించినా సరిపోతుంది’ అని అని ఏఐసీటీఈ సభ్య కార్యదర్శి రాజీవ్‌కుమార్ తెలిపారు. సీట్లు ఖాళీగా ఉన్నట్లయితే డిగ్రీ పరీక్షల్లో మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. ఎంబీఏ ప్రవేశాల కోసం ఆన్లైన్లోనే మ్యాట్, ఏటీఎంఏ, జీమ్యాట్ పూర్తయ్యాయి. -
రద్దు కానున్న యూజీసీ, ఏఐసీటీఈ!
న్యూఢిల్లీ: విద్యా రంగంలో నియంత్రణ సంస్థలైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ), ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ)లు త్వరలో రద్దు కానున్నాయి. వీటి స్థానంలో ఉన్నత విద్యకు సంబంధించి ఏకైక నియంత్రణ సంస్థను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ రెగ్యులేషన్ ఏజెన్సీ(హెచ్ఈఈఆర్ఏ–హీరా) పేరిట నూతన వ్యవస్థను ప్రతిపాదించింది. వేర్వేరు నియంత్రణ సంస్థల అధికార పరిధిపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడంతో పాటు, అనవసర నియంత్రణ నిబంధనలను తగ్గించడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు. సాంకేతిక, సాంకేతికేతర విద్యా సంస్థలను ఒకే గొడుగు కిందికి తీసుకురావడానికి మానవ వనరుల శాఖ, నీతి ఆయోగ్‌తో కలిసి పనిచేస్తోంది. ప్రతిపాదిత నియంత్రణ సంస్థ, దాని బిల్లుకు సంబంధించిన నమూనాపై కసరత్తు జరుగుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
జీఎంఆర్పీకి గ్రీన్‌సిగ్నల్ లేనట్లే!
నూనెపల్లె, న్యూస్‌లైన్: ఎస్సీ విద్యార్థులకు ఉచితంగా సాంకేతిక విద్య అందించాలనే లక్ష్యం నెరవేరే పరిస్థితి లేకుండా పోతోంది. నంద్యాలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతంలో జీఎంఆర్‌పీ (గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్) కళాశాల ఏర్పాటు చేసేందుకు పంపిన ప్రతిపాదనలు అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కళాశాల ఏర్పాటుపై ఇంత వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జిల్లాలో ఆరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. ఇందులో ఎస్టీలకు, ముస్లింలతో పాటు ఇతర కులాల వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రత్యేక కాలేజీలున్నాయి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో భాగంగా నంద్యాలలో ఎస్సీలకు మాత్రమే మోడల్ స్థాయిలో కళాశాల ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు కోరారు. రాష్ట్ర కమిషనర్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ద్వారా న్యూ ఢిల్లీలోని ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్)కి ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలు పంపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తే ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కళాశాలకు అనుమతులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. విద్యార్థులకుండే బెనిఫిట్స్ ఇవే: జీఎంఆర్‌పీ కళాశాలకు గ్రీన్‌సిగ్నల్ వచ్చి కాలేజీలో విద్యార్థులకు సీటు వస్తే మూడేళ్ల పాటు పాలిటెక్నిక్ విద్య ఉచితంగా అందుతుంది. ప్రత్యేక హాస్టల్ వసతి, రుచికరమైన భోజనం, పుస్తకాలు, దుస్తులతో పాటు కాస్మొటిక్ చార్జీలు, ప్రత్యేక మెనూ ఇలా ఎన్నో సౌకర్యాలు, సదుపాయాలుంటాయి. కళాశాలలో వివిధ బ్రాంచ్‌ల్లో 120మందికి చేరేందుకు అవకాశం ఉంటుంది.