All India Police Duty Meet
-
ఓవరాల్ చాంపియన్ తెలంగాణ పోలీస్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పోలీసులు జాతీయస్థాయిలో సత్తా చాటారు. లక్నోలో నిర్వహించిన ఆల్ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో వివిధ పోటీల్లో కలిపి మొత్తం ఐదు బంగారు పతకాలు, ఏడు వెండి పతకాలు తెలంగాణ పోలీస్‌శాఖకు దక్కాయి. ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించి, ప్రతిష్టాత్మకమైన చార్మినార్ ట్రోఫీ దక్కించుకున్నారు.12 ఏళ్ల తర్వాత తెలంగాణ పోలీసులు ఈ ఘనత సాధించారు. శెభాష్ తెలంగాణ పోలీస్: ప్రతిభను చాటిన తెలంగాణ పోలీసులను అభినందిస్తూ ట్విట్టర్(ఎక్స్) వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ‘పతకాలు సాధించిన విజేతలు, డీజీపీ రవిగుప్తా, మొత్తం తెలంగాణ పోలీస్ విభాగానికి శుభాకాంక్షలు ’అని సీఎం అభినందించారు. బంగారు పతకాలు సాధించిన వారిలో జి.రామకృష్ణారెడ్డి, డి.విజయ్‌కుమార్, వి.కిరణ్‌కుమార్, పి.అనంతరెడ్డి, ఎం.దేవేందర్ప్రసాద్, వెండి పతకాలు సాధించినవారిలో పి.పవన్, ఎన్.వెంకటరమణ, ఎం.హరిప్రసాద్, కె.శ్రీనివాస్, షేక్‌ఖాదర్ షరీఫ్, సీహెచ్.సంతోష్, కె.సతీష్‌లు ఉన్నారని డీజీపీ రవిగుప్తా తెలిపారు. ఆయా విభాగాల వారీగా చూస్తే.. ► కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాల సేకరణ విభాగంలో ఒక బంగారు, ఒక వెండి పతకం ► పోలీస్ ఫొటోగ్రఫీ విభాగంలో ఒక బంగారు, ఒక వెండి పతకం ► డాగ్ స్క్వాడ్ పోటీల్లో ఒక బంగారు, ఒక వెండి పతకం ► యాంటీ స్టాబేజ్ చెక్‌లో రెండు బంగారు, మూడు వెండి పతకాలు ► పోలీస్ వీడియోగ్రఫీలో ఒక వెండి పతకం దక్కాయి. ►జాతీయస్థాయిలో రెండోస్థానంలో నిలిచిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు ఒక వెండి, మూడు కాంస్య పతకాలు, మూడోస్థానంలో నిలిచిన ఐటీబీపీ సిబ్బందికి ఒక బంగారు, నాలుగు కాంస్య పతకాలు దక్కాయి. -
ఒక్కో గుర్రానిది ఒక్కో ప్రత్యేకత.. దేనికదే మేటి (ఫొటోలు)
-
హైదరాబాద్ : గుర్రపు స్వారీ అదరహో.. (ఫొటోలు)
-
డ్యూటీ మీట్లో సత్తా చాటిన తెలంగాణ పోలీస్
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో తెలంగాణ పోలీసులు సత్తా చాటారు. ఈ నెల 13 నుంచి 17 వరకు మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన 66వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో నాలుగు విభాగాల్లో తెలంగాణ పోలీసులకు అవార్డులు దక్కాయి. రిటన్ టెస్ట్ విభాగంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ సీసీఎస్‌లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఎ.మన్మోహన్ కు బంగారు పతకం లభించింది. పోలీస్ వీడియోగ్రఫీ విభాగంలో సైబరాబాద్ కమిషనరేట్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ ఎ.అనిల్‌కుమార్‌కు రజతపతకం, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ విభాగంలో ఎస్ఐబీ (ఇంటెలిజెన్స్ విభాగంలో) ఎస్సైగా ఉన్న బి.వెంకటేశ్‌కు, ఇంటెలిజెన్స్ సీఐ సెల్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బి. విజయ్‌లకు వెండి పతకాలు లభించాయి. యాంటీ సబోటేజ్ చెకింగ్ (బాంబులను గుర్తించేది) విభాగంలో తెలంగాణ పోలీస్ శాఖకు మూడో స్థానం లభించింది. పోలీస్ డ్యూటీ మీట్లో రాష్ట్ర పోలీసులకు పతకాలు రావడంపై డీజీపీ అంజనీకుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. పతకాలు గెలిచిన అధికారులను ఆయన అభినందించారు. -
రాష్ట్ర పోలీసులకు సీఎం అభినందనలు
ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో తెలంగాణకు పతకాల పంట సాక్షి, హైదరాబాద్: ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో సత్తా చాటిన రాష్ట్ర పోలీసులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందనలు తెలిపారు. కొత్త రాష్ట్రం ఈ ఘనత సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మైసూరులో జరిగిన ఈ పోటీల్లో దేశంలో ఉత్తమ రాష్ట్రానికి అందించే ఓవరాల్ చాంపియన్‌షిప్ ట్రోఫీ తోపాటు పలు పతకాలను రాష్ట్ర పోలీసులు గెలుపొందారు. ఈ మేరకు ట్రోఫీలు, పతకాల వివరాలు వెల్లడిస్తూ సీఎం కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. సైంటిఫిక్ ఎయిడ్ టూ ఇన్వెస్టిగేషన్ బృందం రెండు బంగారు, రెండు వెండి, ఒక కాంస్య పతకాన్ని గెలుపొందింది. ఫోరెన్సిక్ సైన్స్ రాత పరీక్షలో సీఐడీ ఎస్ఐ డి.విశ్వేశ్వర్ బంగారు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ వెండి, నల్లగొండ జిల్లా చందంపేట ఎస్ఐ ఆర్.సతీశ్ కాంస్య పతకాలు గెలు పొందారు. లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఎగ్జిబిట్స్ పోటీ విభాగంలో సీఐడీ ఇన్స్పెక్టర్ టి.అమృత్ రెడ్డి బంగారు పతకం.. పోర్ట్రెయిట్ పార్ల్ విభాగంలో సీఐడీ ఏఎస్ఐ ఎం.రామకృష్ణ వెండి పతకాన్ని గెలుపొందారు. తెలంగాణ పోలీసుల జాగిలం రీటా బంగారు పతకాన్ని గెలుపొందింది. సైంటిఫిక్ ఎయిడ్ టూ ఇన్వెస్టిగేషన్ విభాగంలో తెలంగాణ పోలీసులు విన్నర్స్ ట్రోఫీ, హార్డ్ లైనర్స్ ట్రోఫీలను, కంప్యూటర్ అవేర్నెస్ విభాగంలో రన్నర్స్ ట్రోఫీలను గెలుపొందారు.