all religions
-
ప్రతి మతంలోనూ ఉగ్రవాదులున్నారు
సాక్షి, చెన్నై: ప్రతి మతంలోనూ ఉగ్రవాదులు ఉన్నారనీ, తాము పవిత్రులమని ఎవ్వరూ చెప్పుకోలేరని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్ శుక్రవారం అన్నారు. అరెస్టుకు తాను భయపడటం లేదనీ, కానీ తనను అరెస్టు చేస్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. గాంధీజీని హత్య చేసిన నాథూరాం గాడ్సేనుద్దేశిస్తూ కమల్ దేశంలో తొలి తీవ్రవాది హిందువేననడం వివాదమైంది. శుక్రవారం కోయంబత్తూరులోని సులూరులో కమల్ ప్రచారం చేయాల్సి ఉండగా, ఆదివారం నాటి వ్యాఖ్యల కారణంగా ఆయనకు ప్రచారానికి అనుమతి లభించలేదు. దీంతో కమల్ ట్విట్టర్ ద్వారా ప్రజలను ఓట్లు అడిగారు. తాను ఆ వ్యాఖ్యలు చేయడం అరవకురిచ్చిలోనే తొలిసారి కాదనీ, లోక్‌సభ ప్రచారం సమయంలో చెన్నైలోనే ఇదే మాట అన్నా అప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదని కమల్ చెప్పారు. -
జయ జయ శ్రీ సుదర్శన
సర్వధర్మ సముద్ధరణకై ఉద్భవించింది సుదర్శనచక్రం. అది ఆయుధమే అయినా పురుషమూర్తి రూపంలో పూజించబడుతూ విష్ణుసామ్యాన్ని పొందింది. ఈ స్వామిని చక్రమూర్తి, చక్రత్తాళ్వార్ అని పిలుస్తారు. వైష్ణవాలయాలలో చక్రమూర్తి తప్పక ఉంటుంది. ప్రతి ఉత్సవం చివరిలో చక్రస్నానం చేస్తారు. ఈ సుదర్శనచక్రం లోహంతో తయారు చేయబడి ఉంటుంది. కానీ సుదర్శనమూర్తి పూర్తి సాకార రూపంలో, ప్రత్యేకసన్నిధిలో కొలువు దీరిన క్షేత్రం ఒకటుంది. అదే 108 వైష్ణవ దివ్యదేశాలలో 46వదైన తిరుమోగూర్. ఇక్కడి స్వామి కాలమేఘపెరుమాళ్. నాలుగుప్రాకారాలతో కూడిన అతి పెద్ద ఆలయం ఇది. చక్రత్తాళ్వార్ తొలి దేవాలయం ఇదే. ఒక చతురస్రమైన శిలపై మధ్యలో సుదర్శనమూర్తి కుడివైపు ఎనిమిది చేతులు, ఎడమవైపు ఎనిమిది చేతులు కలిగి పదహారు చేతులలో శంఖం, చక్రం, పాశం, గొడ్డలి, కత్తి, బాణం, శూలం, విల్లు, అంకుశం, అగ్ని, వజ్రాయుధం, డాలు, నాగలి, రోకలి, గద, ఈటె మొదలైన ఆయుధాలు ధరించి షోడశాయుధ సుదర్శనమూర్తిగా, భయంకరమైన కోరమీసాలతో అగ్నిజ్వాలలతో కూడిన కిరీటంతో హారం, భుజకీర్తులు, హస్తాభరణాలతో షట్కోణం మధ్యలో దర్శనమిస్తాడు. ఆయన చుట్టూ ఆరు వలయాలు ఉన్నాయి. ఆ ఆరు వృత్తాలలో 154 దివ్య బీజాక్షరాలు లిఖించబడి ఉన్నాయి. ఈ మూర్తి చుట్టూ నలభై ఎనిమిది మంది దేవతల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. విశేషించి ఈ స్వామి మూడు కన్నులతో ఉంటాడు. ఈ మూర్తికి వెనుకవైపు యోగనరసింహస్వామివారు చతుర్భుజాలతో ఆసీనుడై ఉంటాడు.ఇక్కడి చక్రత్తాళ్వార్ స్వామి చాలా ప్రభావవంతమైన దేవుడు. ఈ స్వామిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి అనేకమంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు.సుదర్శనమూర్తిని నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పన్నెండు, పదహారు చేతులతో నిర్మించవచ్చనీ, ఆయుధాలసంఖ్య పెరిగిన కొద్దీ ఆ స్వామి శక్తి పెరుగుతుందనీ విశ్వకర్మీయం అనే ప్రాచీన శిల్పశాస్త్రం చెప్పింది. సకల శత్రుసంహారం సుదర్శనమూర్తి దర్శనఫలం అని వైష్ణవాగమాల అభిప్రాయం. వ్యాపార, వ్యవహారాలలో విజయం, సకలదృష్టిదోషనివారణ, కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
శ్రీరస్తు...శుభమస్తు
కొడంగల్ (మహబూబ్‌నగర్) : కష్టపడి సంపాదించిన సొమ్ముతో పేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతో రాజస్తాన్‌లోని అజ్మీర్‌కు చెందిన అజ్జూభాయి కుల, మతాలకతీతంగా గురువారం కొడంగల్‌లో 11జంటలకు ఉచిత వివాహాలు చేయించారు. పహాలా కదమ్ (మొదటి అడుగు) అనే సంస్థను ఏర్పాటు చేసి, కొడంగల్ మండలం చిట్లపల్లి అబ్దుల్ సాహెబ్ దర్గా ఆవరణలో పెళ్లిళ్లు జరిపించడానికి ఆయన శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా దరఖాస్తు చేస్తుకున్న పేదలకు సొంత ఖర్చులతో ఆరు హిందూ జంటలు, ఐదు ముస్లిం జంటలకు పెళ్లిళ్లు జరిపించారు. అలాగే నూతన వధూవరులకు బట్టలు, మంచం, బీరువా, పరువు, దిండ్లు, తాళి, మెట్టలు, కాళ్ల పట్టీలు, పెళ్లి సామగ్రి, భోజనం తదితర వాటిని సమకూర్చి ఘనంగా వివాహాలు జరిపించారు. వదూవరులకు వారి మత సాంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లు చేయించారు. ఈ వేడుకలకు పలు పార్టీల నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముద్దప్ప దేశ్‌ముఖ్, ఏన్గుల భాస్కర్, ముదిగండ్ల కృష్ణ, మధుసూదన్‌రెడ్డి, ఆర్.బస్వరాజు, దామోదర్‌రెడ్డి, ఎస్ఎమ్ గౌసన్, నాగరాజు, రాంరెడ్డి, చుక్కయ్య, ఆశప్ప, ప్రవీణ్‌కుమార్, కరెంటురాములు పాల్గొన్నారు.