భారత్‌లో ఎప్పుడైనా కష్టమే: షకీబ్
న్యూఢిల్లీ: టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియాతో వారి దేశంలోనే టెస్టు మ్యాచులు చాలా కష్టమని బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ అసన్ అన్నాడు. భారత్, బంగ్లా జట్లు ఫిబ్రవరి 9-13 తేదీల మధ్య హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ లో తలపడనున్నాయి. ఎన్నో ఐపీఎల్ మ్యాచ్‌లు భారత్‌లో ఆడిన అనుభవం ఉన్నా.. తొలిసారిగా వారిగడ్డపై భారత్‌తో టెస్ట్ ఆడనుండటం చాలా ఎగ్జైజ్మెంట్గా ఉందన్నాడు షకీబ్. యువ ఆటగాళ్లతో బంగ్లా టీమ్ భారత్‌కు వచ్చిందన్నాడు.
'ర్యాంకులు, ఆటపరంగా ఏ విధంగా చూసిన భారత్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అయితే తలపడినప్పుడూ అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తాం. సమష్టి కృషితో భారత్‌కు పోటీ ఇవ్వాలని భావిస్తున్నాం. ఇక్కడి వికెట్ నా బౌలింగ్‌కు సరిగ్గా సరిపోతుంది. కానీ, టీమిండియా బ్యాటింగ్, స్పిన్, ఫాస్ట్ బౌలింగ్ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది' అని భారత్-ఏతో జరుగుతున్న రెండు రోజుల వార్మప్ మ్యాచ్ సందర్భంగా షకీబ్ ఈ వివరాలు వెల్లడించాడు.