Almshouse
-
కవ్వించి నవ్వించిన వాడి కథ
ముగ్గురు మహానటులు నటించిన సినిమాలోని దృశ్యాలివీ... ఈ సినిమాపేరేంటో చెప్పుకోండి చూద్దాం...‘‘గుండెల్లో భయంకర అగ్నిగోళాలు బ్రద్దలవుతున్నా ప్రజలను కవ్వించి నవ్విస్తా తల్లీ. అమ్మా... ధన్యోస్మీ... జగదాంబ ధన్యోస్మీ’’ అన్నాడు అతడు.ఆతరువాత భార్యాబిడ్డలతో కలిసి విజయనగరరాజ్యంలోకి ప్రవేశించాడు. ఒక సత్రంలోకి వెళ్లి...‘‘ఏవండీ...దూరం నుంచి వస్తున్నాం. బస వీలవుతుందా?’’ అని అడిగాడు నెమ్మదిగా.‘‘ఆ గదిలో బూజు దులుపుకుని ఉండండి. రెండురోజులు ఉండవచ్చు’’ అన్నాడు సత్రం నిర్వాహకుడు. తనను తాను పరిచయం చేసుకునే క్రమంలో తాను కవిని అనే విషయం చెప్పాడు అతడు.‘కవి’ అనే శబ్దం వినిపించగానే అతడికి అక్కడ అపూర్వమైన గౌరవమర్యాదలు లభించాయి. ఇది చూసి కవిగారు మురిసిపోయి...‘‘యాథారాజా తథాప్రజా అని ఊరకే అన్నారా పెద్దలు. మీ ఆదరణలో అతిథి మర్యాదలు చూస్తుంటే ఏలిన వారికి కవులంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది’’ అన్నాడు.ఆచార్య స్వాముల వారిని కలవాలని ప్రయత్నిస్తున్నారు కవిగారు. అక్కడి సిబ్బంది మాత్రం ఇతడిని బొత్తిగా ఖాతరు చేయడం లేదు.‘‘ఎవరయ్యా నువ్వు?’’ అని గద్దించాడు ఒక ఆస్థాన కవి.‘‘నాకు కవిత్వంలో కొంత ప్రవేశం ఉందండి. వారి అనుగ్రహంతో రాజాశ్రయం పొందాలని వచ్చా!’’ తాను వచ్చిన పని గురించి చెప్పారు కవిగారు.‘‘నాకు కవిత్వంలో ప్రవేశం ఉందండి’’ అనే మాట విని ఈ కవిగారిని ఆస్థాన కవిగారు ఇలా వెటకారం చేశారు...‘‘ఈ కాలంలో కవిత్వం, వైద్యం రానివాడెవ్వడులే’’ అన్నాడు. మహారాజును కలిసే వరకే అతని దురదృష్టం. ఆతరువాత అదృష్టమే ఆ కవి వెంట పరుగులు తీస్తుంది. కాని ఆ అదృష్టఘడియ ఎప్పుడు వచ్చేనో ఎలా వచ్చేనో! రాయలవారి సభ.‘‘ఏమిటి మీ విజ్ఞాపన?’’ గంభీరస్వరంతో అడిగారు మంత్రి.‘‘మా తండ్రిగారి మరణశాసనం ప్రకారం స్థిరాస్తి మాకు పంచబడింది. కాని స్థిరాస్తి మాకు పంచలేకపోతున్నారు మహాప్రభో’’ అన్నాడు రాయలవారి ముందు నిల్చున్న ముగ్గురిలో ఒకరు.‘‘కారణం?’’ అడిగారు రాయలవారు.‘‘మా తండ్రిగారి పదిహేడు ఏనుగులు... సగం పాలు నాకు, మూడో పాలు రెండో వాడికి, అందులో మూడో పాలు మూడోవాడికి రావాలి. ఈ పంపకం చేయలేక వాటిని మీ గజశాలకు తోలించారు. మాకు న్యాయం చేయండి మహాప్రభో’’ అని దీనంగా వేడుకున్నాడు ముగ్గురిలో పెద్దవాడు.రాయలవారు వెంటనే స్పందించారు: ‘‘మా పాలనలో ఎన్నడూ అన్యాయం జరగబోనివ్వం’’ అంటూ ‘‘ఈ సమస్య గురించి మీ అభిప్రాయం?’’ అని ధర్మాధికారులను అడిగాడు.‘‘ఎన్ని విధాల భాగించి చూసినా జంతుహింస చేయకుండా పాలు పంచడం సాధ్యంగా కనిపించడం లేదు మహారాజా’’ అన్నాడు ధర్మాధికారులలో ఒకరు.‘‘మరణించినవాడు మతిలేనివాడు కాదు మహాప్రభో. ప్రతిభవంతుడైనా ప్రభుభక్తిపరాయణుడు. కనుకనే సాధ్యం కాని విభాగాలలో మరణశాసనం రాశాడు. కాబట్టి ఆయన అభిమతాన్ని మన్నించి మీరు ఏనుగుల్ని స్వీకరించడం ధర్మం’’ అన్నాడు మరో ధర్మాధికారి.‘‘ధర్మం కాదు మహాప్రభో’’ బాధగా అన్నారు అన్నదమ్ముల్లో ఒకరు.‘‘ఈ మహాసభ నిర్ణయాన్ని అన్యాయమని ఆక్షేపించేది ఎవరో’’ సభను ఉద్దేశించి గట్టిగా అడిగారు మహామంత్రి.‘‘నేను’’ అంటూ ఎవరో అనామకుడు లోనికి వచ్చాడు.‘‘ఎవరు నువ్వు?’’ గద్దించారు మహామంత్రి.‘‘ఎవడో పిచ్చివాడు’’ సమాధానమిచ్చాడు ఒక పాలనాధికారి.‘‘కాదు మహాప్రభో తమ ఆశ్రితుడిని’’ అన్నాడు ఆ అనామకుడు.‘‘విద్యానగర పౌరుడివేనా?’’ అడిగారు మహామంత్రి.‘‘ప్రభువులు అనుగ్రహిస్తే అవుతాను. నియోగి బిడ్డను, ఎందుకు వినియోగించినా వినియోగపడతాను’’ అని తెలివిగా సమాధానం ఇచ్చాడు అనామకుడు. ‘‘ఎవరివయ్యా నువ్వు?’’ అని అక్కడ ఎవరో అడిగారు.తాను కృష్ణా తీరం నుంచి వచ్చాను అని, తండ్రి పేరు గార్లపాటి రామన్న మంత్రి అని చెప్పాడు ఆ యువకుడు.‘‘నువ్వు ఈ సమస్యను పరిష్కరించగలవా?’’ అడిగారు మహామంత్రి.‘‘తమకు అభ్యంతరం లేకుండా పరిష్కరిస్తాను’’ అని రంగంలోకి దిగాడు రామన్నగారి కుమారుడు.‘‘పదిహేడు ఏనుగు బొమ్మలు తెప్పించండి’’ అని అడిగాడు.అలాగే పదిహేడు ఏనుగు బొమ్మలు అతని దగ్గరకు తెచ్చారు.‘‘ఈ పదిహేడు ఏనుగుల్లో రాజుగారి ఏనుగును చేర్చడానిక మీకు ఏమైనా అభ్యంతరమా?’’ అని అడిగాడు.‘‘చేర్చడానికి వీల్లేదు. పంచేవి పదిహేడే’’ అన్నారు ఒక ధర్మాధికారి.‘‘నేను పంచేది కూడా పదిహేడే స్వామి’’ అన్నాడు యువకుడు.సభాసదులలో ఆసక్తి అంతకంతకూ పెరిగిపోయింది.‘ఇతడు ఏం చేయబోతున్నాడు?!’‘‘ఇక్కడ ఉన్నవి ఎన్ని ఏనుగులు?’’ అని అడిగాడు యువకుడు.‘‘పదిహేడు’’ అన్నాడు అక్కడ ఉన్నవారిలో ఒకడు.‘‘పదిహేడు కాదు రాజుగారి ఏనుగుతో కలిపి, వెరసి పద్దెమినిది. ఇందులో సగం పాలు పెద్దవాడికి...ఈ తొమ్మిది తీసుకో...రెండో వాడికి మూడో వంతు...అనగా ఆరు...మూడో వాడి పాలు రెండు...ఇక మిగిలింది శ్రీవారి ఏనుగు. ఇది వారి పాలు’’ అని జటిలమైన సమస్యను నిమిషాల్లో తీర్చేశాడు ఆ యువకుడు.‘‘శబ్భాష్’’ అన్నారు మెచ్చుకోలుగా రాయలవారు.ఆనందంగా ఇంటికి వచ్చాడు ఆ యువకుడు.‘‘ఆహా, రాయలవారిది ఇంద్రవైభవం కమల’’ అన్నాడు భార్యతో.‘‘ఆదరించారా?’’ అడిగింది ఆమె.‘‘అన్నాక తప్పుతుందా! వారు మహారాజు, మనల్ని కవిరాజుని చేసేశారు. మహామంత్రి అప్పాజీగారు, మా నాన్నగారు ఒకే గురువు శిష్యులట! ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. మనకు మంచి భవనం కూడా ఏర్పాటు చేస్తానన్నారు. రేపటి నుంచి మన కాపురం అక్కడే’’ అని సంతోషంగా చెప్పుకుపోతున్నాడు యువకుడు. -
దేవాదాయ శాఖలో అధర్మం
నగరానికి దూరప్రాంతాల నుంచి వచ్చే వారి ఆకలి తీర్చాలన్న ఓ మహానుభావుడి ఆశయాన్ని అటు దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు, ఇటు కొందరు స్వార్థపరులు పక్కదారి పట్టించి, వారి ధనదాహం తీర్చుకుంటున్నారు. కాకినాడ నడిబొడ్డున సినిమారోడ్లో ఉన్న శ్రీ మంత్రిప్రగడ వారి సత్రం చుట్టూ అల్లుకున్న ఈ అక్రమ వ్యవహారం ఎప్పుడో వెలుగు చూసినా.. అడ్డుకట్ట మాత్రం పడలేదు. సాక్షి, కాకినాడ : మంత్రిప్రగడ నరసింహారావు అనే దాత స్వాతంత్య్రానికి పూర్వం కాకినాడకు వైద్యం నిమిత్తం వచ్చే రోగులు, ఇతరులకు భోజన సదుపాయం కల్పించే లక్ష్యంతో మూడువేల చదరపు గజాల్లో సత్రాన్ని నిర్మించి, నిర్వహణ నిమిత్తం అమలాపురం, కడియంలలో వ్యవసాయ భూముల్ని సమకూర్చారు. సత్రం భూమిలో సుమారు 1500 గజాలను 60 ఏళ్ల క్రితం లీజుకు తీసుకున్న ఓ సంస్థ సినిమా థియేటర్‌ను, సాంస్కృతిక సంస్థ కార్యాలయాన్ని నిర్మించింది. లీజును పొడిగించుకుం టూ అయిదు దశాబ్దాల పాటు వాటిని కొనసాగించింది. 2007లో వాటిని తొలగించి, భారీ షా పింగ్ కాంప్లెక్స్ నిర్మించింది. అదే సమయంలో మిగిలిన సత్రం భూమిలో దేవాదాయ శాఖ కూ డా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించింది. లీజు సంస్థ 75 షాపులు, దేవాదాయశాఖ 77 షాపులను నిర్మించాయి. లీజు సంస్థ అనుమతి లేకుండానే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడంలో ఓ మాజీ మంత్రి చక్రం తిప్పారని, భారీ మొత్తం చేతులు మారిందని వినికిడి. నామమాత్రపు లీజు.. లక్షల్లో అద్దెలు లీజు సంస్థ 2007 నుంచి కేవలం స్థలానికి ఏడాదికి రూ.లక్షా 20 వేలు మాత్రమే చెల్లిస్తూ ఒక్కో షాపు నుంచి భారీగా అద్దెలు దండుకుంది. ఆ సంస్థ పైకి చూపిన దాని ప్రకారం షాపునకు నెలకు వసూలు చేసింది రూ.వెయ్యి మాత్రమే. ఆ లెక్కన చూసినా 75 షాపులకు నెలకు రూ.75 వేల చొప్పున ఏడాదికి 9 లక్షలు వసూలు చేసుకున్నట్టు. కానీ, సత్రానికి చెల్లించింది ఏడాదికి రూ.లక్షా 20 వేలు మాత్రమే. దేవాదాయ అధికారులదీ అదే దారి.. ఈ వ్యవహారం 2011లో వెలుగు చూడడంతో సత్రం ఈఓని బదిలీ చేసి, లీజు సంస్థ అధీనంలోని షాపింగ్ కాంప్లెక్స్‌ను దేవాదాయశాఖ స్వాధీనం చేసుకుంది. అనుమతి లేకుండా నిర్మించింది కావడంతో లీజు సంస్థ మిన్నకుండిపోయింది. షాపులను అద్దెకు తీసుకున్న వారు ప్రతి నెలా అద్దె సొమ్మును సత్రం ఖాతాలో జ మ చేయాలని దేవాదాయ శాఖ ఆదేశించినా.. ఈనాటి వరకూ వసూలు చేస్తున్న అద్దె ఎంత, ఏ ఖాతాలో ఎంత జమ చేస్తున్నారన్న దానిపై లెక్కాపత్రం లేవు. ఇప్పుడు అనుమతి లేకుండా నిర్మించిన ఈ షాపులను క్రమబద్ధీకరించాలని దేవాదాయశాఖ తలపెట్టింది. అయితే.. దీన్నీ సొమ్ము చేసుకోవడానికి ఆ శాఖ అధికారులు ఆరాటపడుతున్నారు. నిజానికి ఆ శాఖ ఆధ్వర్యంలోని షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు లీజు సంస్థ నిర్మించిన కాంప్లెక్స్‌లోని 152 షాపులు గ త ఏడేళ్లలో ఎన్నో చేతులు మారాయి. ఆరు షా పులు కోర్టు కేసుల్లో ఉండగా మిగిలినన 146 షా పుల్లో 125 బినామీలే నడుపుతున్నారని, వారి లో దాదాపు 100 మంది నుంచి ఇప్పటికే క్రమబద్ధీకరణ పేరిట రూ.లక్ష చొప్పున రూ.కోటి వరకు వసూలు చేశారని సమాచారం. ఓ ఉదారుని ఆశయం పదిలంగా కొనసాగేలా చూ డాల్సిన దేవాదాయ అధికారులు దాన్ని నీరుగార్చడమే కాక శాఖ ఆదాయానికీ గండి కొడుతున్నారు. ఇంతకీ దాత ఆశయాన్ని ఏ మేరకు కొనసాగిస్తున్నారని ఆరా తీస్తే.. పది నుంచి 15 మంది విద్యార్థులకు మాత్రమే మెస్‌లలో భోజ నం చేసేందుకు కూపన్లు ఇస్తూ రికార్డుల్లో ఆ సంఖ్యను పెంచి చూపుతున్నారని తెలిసింది. సత్రం నిర్వహణకు దాత ఇచ్చిన భూములూ అన్యాక్రాంతమయ్యాయని, అందులోనూ అధికారుల ప్రమేయం ఉందని తెలుస్తోంది. దీనిపై విచారణ జరిపి, అవినీతిపరులపై చర్యలు తీసుకుని, దాత లక్ష్యం నెరవేర్చాల్సిన బాధ్యత ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులపై ఉంది. విచారణకు ఆదేశించాం : డీసీ సత్రం స్థలంలోని షాపింగ్ కాంప్లెక్స్‌ల వ్యవహారంపై దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గాదిరాజు సూరిబాబురాజును వివరణ కోరగా లీజు సంస్థ షాపింగ్ కాంప్లెక్స్‌ను ఎలాంటి అనుమతుల్లేకుండా నిర్మించడం వాస్తవమేనన్నారు. అలాగే అనేక షాపులు బినామీల చేతుల్లో ఉన్నట్టు నిర్ధారణకు వచ్చి, విచారణ జరపాలని తమ శాఖ తనిఖీదారు సతీష్‌కుమార్‌ను ఆదేశించామన్నారు. క్రమబద్ధీకరణకు ఎవరైనా అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్న ఆయన.. లీజు సంస్థ వసూలు చేసిన మొత్తాన్ని రాబడతారా అన్నప్పుడు ‘చూద్దాం’ అని జవాబిచ్చారు.