ambaripeta
-
బాలుడిగా వెళ్లి..ఇద్దరు పిల్లలతో ఇంటికి..
వెల్గటూరు(కరీంనగర్ జిల్లా): తెలిసీ తెలియనితనం... ఉన్న ఊరిని, తల్లిదండ్రులను వదిలివెళ్లి పోయిన ఓ బాలుడు.. పెద్దవాడై, పెళ్లి చేసుకుని తన నలుగురు పిల్లలతో శుక్రవారం ఆకస్మాత్తుగా తల్లిదండ్రుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఇన్నాళ్లూ ఉన్నాడో లేడోననుకున్న తమ ఒక్కగానొక్క కుమారుడు... పిల్లలతో సహా రావడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కుమారుడిని, అతడి పిల్లలను గుండెలకు హత్తుకుని పట్టరాని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలం అంబారిపేటకు చెందిన సుంకె పోచయ్య-లక్ష్మి దంపతులకు కుమారుడు భూమన్న, ముగ్గురు కూతుళ్లు సంతానం. భూమన్న 12 ఏళ్ల వయసులో తెలిసినవారి వెంట ఇంట్లోంచి వెళ్లి తిరిగిరాలేదు. అతడి కోసం కొన్నేళ్లపాటు ఊరూరా వెతికారు. అయితే, భూమన్న అక్కడక్కడా తిరుగుతూ ముంబై చేరాడు. అక్కడ మేస్త్రీ వద్ద కూలీ పనిచేస్తూ పొట్టపోసుకున్నాడు. అక్కడినుంచి తమిళనాడులోని కన్యాకుమారి వెళ్లాడు. అక్కడే ఓ తమిళ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఓ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు. అయితే, భూమన్న భార్య అతని తల్లిదండ్రుల గురించి ఆరా తీసింది. వారు ఎక్కడ ఉన్నారో.. ఎలా ఉన్నారో తెలుసుకోవాలని కోరింది. దీంతో తల్లిదండ్రుల జాడ తెలుసుకునేందుకు భూమన్న నాలుగు రోజుల క్రితం ఓ కుమారుడు, కుమార్తెను వెంటేసుకుని బయలుదేరాడు. చిన్నప్పుడే ఇంట్లోంచి వెళ్లిపోయిన అతడికి ఊరు పేరు అంబారిపేట తప్ప ఏమీ గుర్తు లేదు. చివరకు జిల్లాపేరు కూడా మర్చిపోయాడు. మెదక్ జిల్లా సిద్దిపేట సమీపంలోని అంబారిపేటకు వెళ్లాడు. అది కాదని తెలుసుకుని బుధవారం రాత్రి కరీంనగర్ చేరుకుని అక్కడ బస చేశాడు. కొందరిని వాకబు చేయగా వెల్గటూర్ మండలంలో అంబారిపేటకు వచ్చాడు. ఊళ్లో ఆరా తీస్తూ చివరికి ఇంటికి వచ్చాడు. జరిగింది చెప్పడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కొడుకును, అతడి పిల్లలను గుండెలకు హత్తుకున్నారు. భూమన్న వచ్చాడని తెలుసుకుని ఆ ఇంటికి బంధువులు తరలివచ్చారు. ఇంటిల్లిపాది సంబరాల్లో మునిగితేలారు. తల్లిదండ్రులను తనతోపాటు తీసుకెళ్తానని, కొద్దిరోజులపాటు అక్కడ ఉంచుకుని స్వగ్రామానికి తీసుకువస్తానని తెలిపాడు. ఇన్నేళ్ల తర్వాత తల్లిదండ్రులను, అక్కాచెల్లెళ్లను, బంధువులను, స్నేహితులను కలుసుకోవడం ఆనందంగా ఉందని అతడు సంతోషంలో మునిగిపోయాడు. భూమన్నకు చిన్ననాడు ముక్కు కుట్టించిన రంధ్రాన్ని బట్టి తల్లిదండ్రులు కొడుకును గుర్తుపట్టినట్లు చెప్పారు. -
అత్తింటి వేధింపులకు వివాహిత బలి
అంబారిపేట(శాలిగౌరారం) :అత్తింటి వేధింపులకు వివాహిత బలైంది. కల కాలం తోడుండాల్సిన భర్త, కంటికిరెప్పలా చూసుకోవాల్సిన అత్తమామలు ఆమె పాలిట కర్కశకులుగా మా రారు. అదనపు కట్నం తీసుకురమ్మని చిత్రహింసలు పెట్టడంతో తట్టుకోలేక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శాలిగౌరారం మం డలం అంబారిపేటలో ఆదివారం వెలుగుచూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..అంబారిపేట గ్రామానికి చెందిన నూనె సోమయ్య, వినోద దంపతుల కుమారుడు నూనె శ్రీనుకు కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన మెండి లచ్చయ్య, రోషమ్మల కుమార్తె భవాని(21)తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.ల క్ష నగదు, 5 తులాల బంగారు, 40 తులా ల వెండి ఆభరణాలు కట్నకానుకల కింద ఇచ్చారు. ఏడాది వరకు సాఫీగా సాగిన వారి సంసారంలో కలతలు ప్రారంభమయ్యాయి. అదనపు వరకట్నం కోసం భవానిని వేధించసాగారు. ఈ క్రమంలో పలుమార్లు గొడవలు జరగడంతో ఇరుగ్రామాల పెద్దమనుషుల మధ్య రాజీకుదుర్చారు. రెండు సంవత్సరాల క్రితం భర్త శ్రీను ట్రాక్టర్ కొనుగోలు చేస్తానని డబ్బులు తీసుకురావాలని భవానితో గొడవపడ్డాడు. తల్లిగారి ఇంటికి వెళ్లిన భవాని వారిని ఒప్పించి రూ.1.25 లక్షలు తీసుకువచ్చింది. కానీ ఇప్పటికీ ట్రాక్టర్ కొనుగోలు చే యలేదు. అయినప్పటికీ తీరుమారని అత్తింటివారు తరచూ అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో భవా ని కొన్ని నెలల క్రితం తల్లిగారి గ్రామమైన అయిటిపాములకు వెళ్లింది. నెల రోజులక్రితం గ్రామ పెద్దలు భవానికి నచ్చజెప్పి అంబారిపేటకు తీసుకువచ్చారు. అప్పటి నుంచి భర్త శ్రీనుతో పాటు అత్త వినోద, మామ సోమయ్య తిరిగి వేధించసాగారు. ఈ క్రమం లో శనివారం రాత్రి కూడా గొడవపడ్డారు. దీంతో భవా ని తీవ్ర మనస్తాపం చెంది పురుగుల మందుతాగింది. కొంత సమయం తర్వాత వాంతులు చేసుకోవడంతో గమనించిన కుటింబీకులు 108లో నకిరేకల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న భవాని మృతదేహాన్ని ఆది వారం నల్లగొండ డీఎస్పీ రాంమోహన్‌రావు పరి శీలించారు. శాలిగౌరారం తహసీల్దార్ ఇరుగు లక్ష్మయ్య పంచనామా నిర్వహించారు. మృతురాలి తల్లి రోషమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు.ఆయన వెంట సీఐ రాఘవరావు, ఎస్ఐ మహేశ్ ఉన్నారు. పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన మృతురాలిభర్త, అత్త, మామ మృతురాలు భవాని భర్త శ్రీను, అత్త వినోద, మామ సోమయ్యలు ఆదివారం శాలిగౌరారం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. ఇదిలా ఉండగా వినోద మృతిపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్త అత్త మామలు భవానిని తీవ్రంగా కొట్టారని, కొన ఊపిరి ఉండగానే పురుగుల మందు ఆమె నోట్లో పోసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
బోగస్ ఫేస్ బుక్ ఖాతాతో 600 మందికి వల!
అమ్మాయిల పేరిట బోగస్ ఫేస్బుక్ అకౌంట్ సృష్టించి కోరుట్లకు చెందిన ప్రముఖులను బోల్తా కొట్టించిన వ్యక్తి కథలాపూర్ మండలం అంబారిపేట గ్రామానికి చెందిన తిరుపతి (32)గా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ఇతడిని కోరుట్ల రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతడు ఎన్ని బోగస్ ఫేస్బుక్ అకౌంట్లు సృష్టించి ఎంతమంది వలలో ఇరికించారన్న విషయమై పోలీసులు నిశితంగా విచారణ సాగిస్తున్నారు. ఆరు వందల మందికి వల? బోగస్ ఫేస్బుక్ అకౌంట్ మెయింటైన్ చేసిన వ్యక్తి కోరుట్లకు చెందిన 601 మందిని చాటింగ్ కోసం ఆహ్వానించినట్లు సమాచారం. దీంట్లో చాలా మంది ప్రముఖులు ఉండటం గమనార్హం. వీరిలో 72 మంది బోగస్ వ్యక్తి మెసేజ్‌కు రెగ్యులర్‌గా స్పందించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచా రం. వీరిని అశ్లీల మెసేజ్‌లు, ఫొటోలు, వీడియో క్లిప్పింగ్స్‌తో రెచ్చగొట్టి తన వలలో వేసుకున్నట్లు సమాచారం. అనంతరం డబ్బులు తన అకౌంట్లో వేయాలని బ్లాక్‌మెయిల్‌కు దిగినట్లు తెలిసింది. ఇలా మోసపోయిన చాలామంది పోలీసులకు ఫిర్యాదు చేయడానికి జంకుతున్నట్లు సమాచారం. కొంతమంది తాము ఫిర్యాదు చేస్తే ఎక్కడ పరువు పోతుందోనని ఆందోళన చెందుతున్నారు. స్వదేశానికి చేరని తిరుపతి అమ్మాయిల పేరిట బోగస్ ఫేస్బుక్ అకౌంట్ సృష్టించిన తిరుపతిని దుబాయ్ నుంచి కోరుట్లకు రప్పించేందుకు మూడురోజులుగా పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. కోరుట్ల, కథలాపూర్‌లో ఉన్న అతని బంధువులతోపాటు సన్నిహితుల ద్వారా తిరుపతిని స్వదేశానికి రప్పించేందుకు పోలీసులు తీవ్ర ఒత్తిడి తె స్తున్నారు. మొదట స్వదేశానికి వస్తానని ఫోన్లో పోలీసులకు చెప్పిన తిరుపతి అనంతరం తప్పించుకునే రీతిలో వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మధ్యవర్తుల ద్వారా అతనికి నచ్చజెప్పేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. తిరుపతి స్వదేశానికి వస్తే తప్ప ఫేస్బుక్ వ్యవహారంలో విచారణ మరింత ముందకు వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు.