అంబారిపేట(శాలిగౌరారం) :అత్తింటి వేధింపులకు వివాహిత బలైంది. కల కాలం తోడుండాల్సిన భర్త, కంటికిరెప్పలా చూసుకోవాల్సిన అత్తమామలు ఆమె పాలిట కర్కశకులుగా మా రారు. అదనపు కట్నం తీసుకురమ్మని చిత్రహింసలు పెట్టడంతో తట్టుకోలేక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శాలిగౌరారం మం డలం అంబారిపేటలో ఆదివారం వెలుగుచూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..అంబారిపేట గ్రామానికి చెందిన నూనె సోమయ్య, వినోద దంపతుల కుమారుడు నూనె శ్రీనుకు కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన మెండి లచ్చయ్య, రోషమ్మల కుమార్తె భవాని(21)తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.ల క్ష నగదు, 5 తులాల బంగారు, 40 తులా ల వెండి ఆభరణాలు కట్నకానుకల కింద ఇచ్చారు. ఏడాది వరకు సాఫీగా సాగిన వారి సంసారంలో కలతలు ప్రారంభమయ్యాయి.
అదనపు వరకట్నం కోసం భవానిని వేధించసాగారు. ఈ క్రమంలో పలుమార్లు గొడవలు జరగడంతో ఇరుగ్రామాల పెద్దమనుషుల మధ్య రాజీకుదుర్చారు. రెండు సంవత్సరాల క్రితం భర్త శ్రీను ట్రాక్టర్ కొనుగోలు చేస్తానని డబ్బులు తీసుకురావాలని భవానితో గొడవపడ్డాడు. తల్లిగారి ఇంటికి వెళ్లిన భవాని వారిని ఒప్పించి రూ.1.25 లక్షలు తీసుకువచ్చింది. కానీ ఇప్పటికీ ట్రాక్టర్ కొనుగోలు చే యలేదు. అయినప్పటికీ తీరుమారని అత్తింటివారు తరచూ అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో భవా ని కొన్ని నెలల క్రితం తల్లిగారి గ్రామమైన అయిటిపాములకు వెళ్లింది. నెల రోజులక్రితం గ్రామ పెద్దలు భవానికి నచ్చజెప్పి అంబారిపేటకు తీసుకువచ్చారు. అప్పటి నుంచి భర్త శ్రీనుతో పాటు అత్త వినోద, మామ సోమయ్య తిరిగి వేధించసాగారు.
ఈ క్రమం లో శనివారం రాత్రి కూడా గొడవపడ్డారు. దీంతో భవా ని తీవ్ర మనస్తాపం చెంది పురుగుల మందుతాగింది. కొంత సమయం తర్వాత వాంతులు చేసుకోవడంతో గమనించిన కుటింబీకులు 108లో నకిరేకల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న భవాని మృతదేహాన్ని ఆది వారం నల్లగొండ డీఎస్పీ రాంమోహన్‌రావు పరి శీలించారు. శాలిగౌరారం తహసీల్దార్ ఇరుగు లక్ష్మయ్య పంచనామా నిర్వహించారు. మృతురాలి తల్లి రోషమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు.ఆయన వెంట సీఐ రాఘవరావు, ఎస్‌ఐ మహేశ్ ఉన్నారు.
పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన మృతురాలిభర్త, అత్త, మామ మృతురాలు భవాని భర్త శ్రీను, అత్త వినోద, మామ సోమయ్యలు ఆదివారం శాలిగౌరారం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. ఇదిలా ఉండగా వినోద మృతిపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్త అత్త మామలు భవానిని తీవ్రంగా కొట్టారని, కొన ఊపిరి ఉండగానే పురుగుల మందు ఆమె నోట్లో పోసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అత్తింటి వేధింపులకు వివాహిత బలి
Published Mon, Aug 18 2014 2:44 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement