Ammaodi scheme
-
వరుసగా ఐదోసారి ‘అమ్మఒడి’
సాక్షి, అమరావతి: ‘జగనన్న అమ్మఒడి’ పథకం నిధులను వచ్చేనెలలో తల్లుల ఖాతాల్లో జమచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. గత నాలుగేళ్లుగా విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత మొదటి నెలలో ఈ పథకాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి సుమారు 43 లక్షల మంది విద్యార్థుల తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను అందించనుంది. వచ్చేనెల 12న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.అదేరోజు ప్రభుత్వ బడుల్లో చదువుతున్న సుమారు 43 లక్షల మందికి పైగా విద్యార్థులకు ‘జగనన్న విద్యాకానుక’ కింద నాణ్యమైన యూనిఫారంతో పాటు పుస్తకాలను అందజేయనున్నారు. మన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించాలని, వారు అంతర్జాతీయంగా రాణించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచే లక్ష్యంతో సమగ్ర విద్యా, పరిపాలనా సంస్కరణలను అమలుచేసింది.‘మనబడి నాడు–నేడు’ కింద డిజిటల్ మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులు కల్పించడంతో పాటు జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, ప్రతి పాఠశాలలోను మరుగుదొడ్లు–వాటి నిర్వహణకు ప్రత్యేక నిధి వంటివి ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో మొత్తం 58,950 పాఠశాలలు ఉండగా, 72,20,633 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో 43.10 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరందరికీ అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించాలని 2019–20 విద్యా సంవత్సరంలోనే ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఐదోసారి రూ.6,400 కోట్ల పంపిణీకి ఏర్పాట్లు..ఇక నవరత్నాల్లో భాగంగా ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు జగనన్న అమ్మఒడి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేలు చొప్పున అందజేస్తోంది. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే 2019–20 విద్యా సంవత్సరంలో తొలిసారి 42,33,098 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,349.6 కోట్లు జమచేసి ఇచ్చిన మాట నిలుపుకున్నారు.ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకే కాక, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న వారికీ అమ్మఒడి అమలుచేసి, 2022–23 విద్యా సంవత్సరం వరకు నాలుగు విడతల్లో రూ.26,067 కోట్ల నిధులను తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. ఇక ఐదోసారి 2023–24 విద్యా సంవత్సరానికి జూన్ నాలుగో వారంలో సుమారు రూ.6,400 కోట్ల నిధులను జమచేయనున్నారు. గత విద్యా సంవత్సరంలో 75 శాతం హాజరున్న ప్రతి విద్యార్థికీ నగదు జమకానుంది. కార్పొరేట్ స్కూళ్లు ప్రభుత్వ బడులతో పోటీపడేలా..గత టీడీపీ ప్రభుత్వంలో బడులు తెరిచి 6–7 నెలలు అయినప్పటికీ యూనిఫారం సంగతి దేవుడెరుగు, కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందించలేని దుస్థితి. ఇక ఇతర వస్తువుల ఊసే ఉండేది కాదు. ఆ పరిస్థితిని సమూలంగా మారుస్తూ జగనన్న ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన రోజే రూ.2,400 విలువైన జగనన్న విద్యా కానుక కిట్ అందజేస్తోంది. కార్పొరేట్ స్కూళ్లే ప్రభుత్వ బడులతో పోటీపడేలా, మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి అమలుచేస్తోంది. దీంతో గత నాలుగు విద్యా సంవత్సరాల్లో రెండేళ్లు కోవిడ్ ఇబ్బందులు తలెత్తినా సంస్కరణలు ఆగలేదు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఇంగ్లిష్ మీడియం బోధన, డిజిటల్ ఎడ్యుకేషన్, టోఫెల్, సీబీఎస్ఈ సిలబస్ అమలుతో మన విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంటున్నారు.ప్రతిభావంతులకు ‘జగనన్న ఆణిముత్యాలు’ సత్కారం..ఇదిలా ఉంటే.. విద్యా రంగంలో సంస్కరణల కొనసాగింపుగా, విద్యలో నాణ్యత, నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు.. విద్యార్థుల కృషిని అభినందించి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడిచిన విద్యా సంవత్సరంలో గొప్ప ముందడుగు వేసింది. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుకుని ప్రతిభ చాటిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించింది. 2023 మార్చిలో ఇంటర్, టెన్త్ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలోని విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లను తలదన్ని అత్యధిక మార్కులు సాధించారు.వీరిలో మొదటిస్థానంలో నిలిచిన 22,768 మందికి ‘జగనన్న ఆణిముత్యాలు బ్రిలియన్స్ అవార్డు’లను ప్రదానం చేశారు. రాష్ట్రస్థాయి విజేతలకు ప్రథమ స్థానంలో ఉన్న వారికి రూ.లక్ష, ద్వితీయ స్థానంలో ఉన్నవారికి రూ.75 వేలు, తృతీయ బహుమతిగా రూ.50 వేలు నగదు బహుమతిగా అందజేశారు. అలాగే, జిల్లా స్థాయి ప్రథమస్థానంలో నిలిచిన వారికి రూ.50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.30 వేలు, తృతీయ స్థానంలో ఉన్నవారికి రూ.15 వేలు ప్రదానం చేశారు.ఇక నియోజకవర్గ స్థాయిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన వారికి రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు చొప్పున ఇవ్వగా, పాఠశాల స్థాయిలో రూ.3 వేలు, రూ.2 వేలు, రూ.వెయ్యి చొప్పున ప్రదానం చేశారు. 2023–24 విద్యా సంవత్సరంలోనూ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోను విద్యార్థులు భారీ సంఖ్యలో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించారు. స్కూళ్లు తెరిచిన అనంతరం వీరిని కూడా సత్కరించేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు.బడి తెరిచిన తొలిరోజే ‘జగనన్న విద్యాకానుక’ మరోవైపు.. ప్రభుత్వ, ఎయిడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బడి తెరిచిన తొలిరోజు జూన్ 12న జగనన్న విద్యా కానుక కిట్లను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. ప్రతి విద్యార్థికీ రూ.2,400 విలువైన కిట్‌లో బైలింగువల్ పాఠ్య పుస్తకాలు (ఇంగ్లిష్–తెలుగు), నోట్‌బుక్స్, వరŠుక్బక్స్, కుట్టు కూలితో మూడు జతల యూనిఫామ్ క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు–తెలుగు డిక్షనరీ, ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీ గల కిట్‌ను మొదటిరోజే అందజేయనుంది.ఇప్పటివరకు ఇలా నాలుగు సార్లు అందజేయగా, గతేడాది రూ.1,042.53 కోట్ల ఖర్చుతో 43,10,165 మంది విద్యార్థులకు విద్యాకానుకను అందించారు. 2024–25 విద్యా సంవత్సరానకి కూడా అంతే సంఖ్యలో కిట్లను సిద్ధంచేస్తున్నారు. ఇప్పటికే పుస్తకాల ముద్రణ దాదాపు పూర్తయింది. ఎన్నికల నేపథ్యంలో రవాణా నిలిపివేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం విద్యాకానుక కిట్లు స్టాక్ పాయింట్లకు చేరుస్తారు.గత విద్యా సంవత్సరాల్లో అమ్మఒడి, విద్యాకానుక పంపిణీ ఇలా..జగనన్న అమ్మ ఒడి.. సంవత్సరం లబ్ధిదారులు నగదు (రూ.కోట్లలో)2019–20 42,33,098 రూ.6,349.62020–21 44,48,865 రూ.6,673.42021–22 42,62,419 రూ.6,393.62022–23 42,61,965 రూ.6,392.9జగనన్న విద్యాకానుక ఇలా..విద్యా సం. లబ్ధిదారులు నిధులు (రూ.కోట్లలో)2020–21 42,34,322 రూ.648.102021–22 47,32,064 రూ.789.212022–23 45,14,687 రూ.886.692023–24 43,10,165 రూ.1,042.53 -
విద్యార్థుల చేరికల్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి : విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. 2021 విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి (పిల్లలు చేరికలు)లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండడమే ఇందుకు నిదర్శనం. ఈ విషయాన్ని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2017తో పోలిస్తే 2021లో దేశంలోని స్థూల నమోదు నిష్పత్తి పెరిగిన టాప్– రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని ఆ నివేదిక తెలిపింది. అలాగే, 2021లో జాతీయ స్థూల నమోదును మించి ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక స్థూల నమోదు ఉందని కూడా పేర్కొంది. 2017తో పోలిస్తే.. 2021లో రాష్ట్రంలో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఎలిమెంటరీ స్థాయిలో స్థూల నమోదు నిష్పత్తి భారీగా పెరిగిందని కూడా నివేదిక తెలిపింది. ‘అమ్మఒడి’ ప్రోత్సాహంతోనే.. అలాగే, స్థూల నమోదు నిష్పత్తిలో టాప్ నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తరువాత ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఉండగా.. స్థూల నమోదు 2017తో పోలిస్తే 2021లో తగ్గిన నాలుగు రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్, గోవా, జార్ఖండ్, బీహార్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2017తో పోలిస్తే 2021లో ప్రైమరీలో 18.4 శాతం, అప్పర్ ప్రైమరీలో 13.4 శాతం, ఎలిమెంటరీలో 16.5 శాతం స్థూల నమోదు పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం బడి ఈడు పిల్లలందరూ బడుల్లోనే ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. అన్ని వర్గాల్లోని పేదల తల్లిదండ్రులకు తమ పిల్లల చదువులు భారం కాకూడదనే దూరదృష్టితో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకం అమలుచేస్తోంది. ఈ పథకం అమలు ద్వారా పేద వర్గాల పిల్లలందరూ స్కూళ్లలో చేరేలా ప్రోత్సాహం అందిస్తోంది. నిజానికి.. పేదలు పిల్లలను బడికి పంపకుండా పనికి పంపిస్తే తమకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలుస్తారనే ఆలోచనలో వారుండే వారు. అయితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న అమ్మఒడి ద్వారా పిల్లలను స్కూళ్లకు పంపితే ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. దీంతో అన్ని వర్గాల్లోని పేదలు తమ పిల్లలను స్కూళ్లకు పంపుతున్నారు. స్థూల నమోదు వృద్ధికి దోహదపడిన సంస్కరణలు.. ► మనబడి నాడు–నేడు ద్వారా తొలిదశలో.. 15 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. ► రెండో దశలో మరో 22,221 స్కూళ్ల రూపురేఖలను మార్చే పనులు చేపట్టారు. ► దీంతోపాటు.. పిల్లలు మధ్యలో చదువు మానేయకుండా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా చర్యలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. పిల్లలు ఎవరైనా స్కూళ్లకు వెళ్లకపోతే వలంటీర్లు ఆ పిల్లల తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి కారణాలు తెలుసుకుని తిరిగి స్కూళ్లకు వచ్చేలా ప్రభుత్వం చర్యలను తీసుకుంది. ► అంతేకాక.. స్కూళ్లకు వచ్చే పిల్లలకు జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోంది. ► పేద పిల్లల చదువులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటు యూనిఫాం, బూట్లు తల్లిదండ్రులపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే జగనన్న విద్యా కానుక ద్వారా ఉచితంగా కిట్‌ను అందిస్తోంది. ► ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను కూడా అమలుచేస్తోంది. ► పిల్లలకు ట్యాబులను కూడా అందిస్తోంది. ఈ చర్యలన్నీ కూడా పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి పెరగడానికి దోహదం చేశాయి. -
నవరత్నాలే..మా గెలుపుకు బాటలు
సాక్షి, కమలాపురం (కడప) : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు అమలుతో ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరుతుందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం పార్టీ మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి అధ్యక్షతన మండలంలోని సి.గోపులాపురం, పాచికలపాడు, మీరాపురం, అక్కంపేట గ్రామాలలో నిర్వహించిన గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే పార్టీలకు అతీతంగా సంక్షేమ పాలన అందుతుందన్నారు. నవరత్నాలతో ప్రతి కుటుంటానికి మేలు జరుగుతుందన్నారు. డ్వాక్రా రుణాలన్ని పూర్తిగా మాఫీ చేసి, తిరిగి కొత్త రుణాలు అందిస్తారన్నారు. అలాగే ప్రతి ఇంటికి రు.3వేల చొప్పున రెండు పింఛన్లు ఇస్తామన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రు.15 వేలు, ఆటో కార్మికులకు ఏటా రు.10వేలు, ఇల్లు లేని వారికి రు.5లక్షలతో పక్కా గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో 45 ఏళ్లు పూర్తి అయిన మహిళలకు రు.75వేలు అందిస్తామన్నారు. ఇలా నవరత్నాల ద్వారా చదువుకునే పిల్లల నుంచి వృద్ధుల వరకు లబ్ధి చేకూరు తుందన్నారు. ప్రజలు కష్టాలన్నీ మరిచి పోయేలా జగన్ రెడ్డి పాలన అందిస్తారని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారు. ఘన స్వాగతం మండలంలోని సి.గోపులాపురం, పాచికలపాడు, మీరాపురం, అక్కంపేట గ్రామాల్లో జరిగిన గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి ఆయా గ్రామాల్లో ఘన స్వాగతం పలికారు. స్థానిక నాయకులు, యువత పూల వర్షం కురిపిస్తూ, బాణా సంచా కాల్చుతూ, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. -
మంచి రోజులు రావాలంటే జగనన్న రావాలి
-
గర్భిణులకు ఆసరా.. అమ్మఒడి
► మాతాశిశు మరణాలను తగ్గించడమే లక్ష్యం ► జూన్ 2 నుంచి అమలు ► గర్భిణులకు విడతల వారీగా రూ.12వేల ప్రోత్సాహకం ► ఆడపిల్ల జన్మిస్తే అదనంగా రూ.వెయ్యి ► కేసీఆర్ కిట్ పంపిణీ ఆదిలాబాద్‌టౌన్/నేరడిగొండ(బోథ్): మాతాశిశు మరణాలను తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టింది.ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నుంచి అమలు చేయనుంది. ఇందుకు సంబంధించి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గర్భిణుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు ఏఎన్ఎంలకు ట్యాబ్‌లు అందజేశారు. ఈ పథకం అమలులోకి వస్తే జిల్లాలోని ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లో ఇంటి వద్ద ప్రసవాల సంఖ్య తగ్గి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుఖ ప్రసవాలు జరగనున్నాయి. దీంతో మాతా, నవజాత శిశువుల మరణాల రేటును కూడా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో.. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉట్నూర్, బోథ్ కమ్యూనిటీ ఆస్పత్రులు, 129 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 6,865 మంది గర్భిణులు ఉన్నారు. పీహెచ్సీ వైద్యాధికారులు ఇప్పటివరకు 4,871 మంది వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. ఇంకా 1994 గర్భిణుల వివరాలు నమోదు చేయాల్సి ఉంది. ఈ నెల 15 వరకు వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో రిమ్స్ ఆస్పత్రితోపాటు బోథ్, ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరుగుతుండగా, ఆయా పీహెచ్‌సీల్లో వేళ్ల మీద లెక్క పెట్టేవిధంగా యేడాదిలో పదుల సంఖ్యలోనే ప్రసవాలు జరుగుతున్నాయి. చాలామంది ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న కొంతమంది ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు సిజరిన్ చేస్తూ వేల రూపాయలు దండుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. సాధారణ కాన్పుల సంఖ్య ఒకటి రెండు అయితే మరీ ఎక్కువే. వీటిని నివారించేందుకు ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశ పెట్టింది. కాగా 2016 ఏప్రిల్ నుంచి 2017 మార్చి వరకు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6652 మంది సిజరిన్, 2242 సాధారణ కాన్పులు జరిగాయి. అదే ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూస్తే దాదాపు 15 వేలకు పైగా సిజరిన్ కాన్పులు జరిగినట్లు తెలుస్తోంది. వందలోపు కూడా సాధారణ కాన్పులు జరగలేదు. అర్హులు వీరే.. అమ్మ ఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే గర్భం దాల్చిన 12 వారాల్లోపు ఆరోగ్య కార్యకర్త వద్ద తప్పకుండా పేరు నమోదు చేసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు జరగాలి. పుట్టిన బిడ్డకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇచ్చే ఇమ్యూనైజేషన్ టీకాలు వేయించాలి. అదేవిధంగా మొదటి, రెండు కాన్పులకు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు డబ్బులను అందజేస్తారు. నాలుగు విడతల్లో డబ్బులు అందజేత.. గర్భిణి పేరు నమోదు, వైద్య పరీక్షలు చేయించుకుని గర్భం దాల్చిన మూడు నెలల వరకు మొదటి విడతగా రూ.4వేలు అకౌంట్లో జమ చేస్తారు. ఆ తర్వాత ఆరు నెలల తర్వాత రూ.4వేలు, ప్రసవం తర్వాత రూ.2వేలు, ఆడపిల్ల జన్మిస్తే అదనంగా రూ.వెయ్యి, పుట్టిన బిడ్డ ఇమ్యూనైజేషన్ పూర్తయిన(సంవత్సరం) తర్వాత రూ.2వేలు అకౌంట్లో జమ చేయనున్నారు. బాలింత, శిశువుకు కేసీఆర్ కిట్.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవమైన బాలింత, పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్‌ను అందజేస్తారు. ఇందులో 12 రకాల వస్తువులను ఇవ్వనున్నారు. ఇందులో బాలింతకు రెండు చీరలు, పుట్టిన బిడ్డకు బేబీ ఆయిల్, బేబీ పౌడర్, చేతికి, కాళ్లకు గ్లౌజులు, దోమతెర, బెడ్‌షీట్, స్నానానికి ఉపయోగించే సబ్బులు, దుస్తులు, తదితర వస్తువులు ఉంటాయి. నమోదు ఇలా.. ఏఎన్ఎంలు తమ పరిధిలోని గ్రామాల్లోని గర్భిణులను మొదటి నెల నుంచే గుర్తిస్తారు. వారి వివరాలను ట్యాబ్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తారు. గర్భిణుల ఊరు, పేరు, వయస్సు, మొదటి, రెండో గర్భం వివరాలు, బ్యాంక్ ఖాతా, ఆధార్ నంబర్, అనారోగ్య సమస్యలు ఉంటే అందులో నమోదు చేస్తారు. నెలవారీ టీకాల వివరాలను పొందుపర్చుతారు. గర్భిణులు టీకాలు వేయించుకున్నారో లేదో ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు. వేయించుకోని వారిని గుర్తించి టీకాలు వేసేలా చూస్తారు. -
అభివృద్ధి చేసేవారికే ఓటు
అభివృద్ధి చేసేవారికే ఓటు భారత రాజ్యాంగం ప్రకారం ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పాటయ్యేవే ప్రభుత్వాలు. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుతూ చట్ట.. కార్యనిర్వాహక రంగాలను గాడిలో పెట్టేవారే పాలకులు. ఇలాంటి వారిని గద్దెనెక్కించేవారు ఓటర్లే. అందుకే ప్రభుత్వ నిర్మాణంలో ఓటు కీలకం.. అత్యంత శక్తివంతం. ప్రజలకు ఎవరు మంచి చేస్తారో వారే మంత్రులుగా కొలువుదీరగలరు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తొలిఓటు పొంది.. మొదటి సారిగా అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకొనేందుకు జిల్లాలో వేలాదిమంది యువత ఎదురుచూస్తోంది. మున్సిపల్, ఎంపీటీసీ, జె డ్పీటీసీతో పాటు సార్వత్రిక ఎన్నికలు కూడా వరుసగా జరగనుండటంతో యువత నిర్ణయం కీలకం కానుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించ గల పార్టీకే తమ ఓటు అని మెజార్టీ నూతన ఓటర్లు స్పష్టం చేశారు. తొలి ఓటు వేయనున్నవారి మనోగతం మీకందిస్తున్నాం. అమ్మఒడి పథకం అద్భుతం: నబీ రసూల్: బీటెక్ (ఈసీఈ): థర్డ్ ఇయర్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ముఖ్యమంత్రి కాగానే అమ్మఒడి పథకం ద్వారా పిల్లల్ని బడికి పంపిన తల్లికి ఆర్థిక వెసులుబాటు కల్పిస్తామనడం చాలా సంతోషం. ఇద్దరు పిల్లలుంటే ఒక్కొక్కరికి ఎల్కేజీ నుంచి 10 వరకు నెలకు *500.. 10 నుంచి 12వ తరగతి వరకు నెలకు *700.. డిగ్రీ, పీజీ పిల్లలకు 1000 రూపాయలను తల్లి ఖాతాలో జమ చేస్తామని ప్రకటించడం గర్వించదగ్గ విషయం. దీనివల్ల అక్షరాస్యత పెంచవచ్చు. జగన్ తండ్రికి తగిన తనయుడని చెప్పవచ్చు. విశ్వసనీయతున్నవారికే ప్రాధాన్యం గోపు బ్రహ్మారెడ్డి: డి గ్రీ ఫైనలియర్ యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించే నాయకునికే తొలి ఓటు వేస్తా. ఎన్నికల్లో గెలుపొందడానికి ఉచిత హామీలు ఇస్తూ, మద్యం, డబ్బుతో ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అలాంటివారిని దరిచేర నీయకుండా విశ్వసనీయత ఉన్న నేతకే ఓటేస్తా. తెలుగు రాష్ట్రాన్ని చీల్చిన..దానికి సహకరించిన పార్టీలకు బుద్ధి చెబుతాం. రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించగల నాయకుడెవరో అందరికీ తెలుసు. ఉచిత విద్య భేష్: ఆస్మా: ఇంజినీరింగ్ (ఈసీఈ) ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల జరిగిన ప్లీనరీ సమావేశంలో ప్రకటించడం ఆనందం. అక్షరాస్యతలో మనం వెనుకబడి ఉన్నాం. ప్రతి స్కూల్లో ఇంగ్లీషు మీడియం ఏర్పాటు చేస్తే పేద విద్యార్థులకు మంచి చదువు అందించవచ్చు. వారి తల్లిదండ్రులు అప్పులు పాలవ్వకుండా ఉంటారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకొనే వారికే ఓటు వేస్తాం. సీమాంధ్రను అభివృద్ధి చేయాలి: జీ అశ్విని: బీటెక్ రాష్ట్ర విభజన తరువాత జరుగుతున్న మొదటి ఎన్నికల్లో.. మేము తొలి ఓటు వేస్తున్నాం. కాంగ్రెస్, టీడీపీల వల్లే రాష్ట్ర విభజన జరిగింది. హైదరాబాద్‌ను ఇప్పటివరకు అందరూ కలిసి అభివృద్ధి చేశారు. కానీ అంతా వృథా అయింది.సీమాంధ్ర కొత్త రాజధానిని సింగపూర్‌లా అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు. మమ్మల్ని అభివృద్ధి చేసే పార్టీకే ఓటువేస్తాం. సీమాంధ్ర ఉద్యమంలో సమైక్యాంధ్రకు పాటుపడిన పార్టీకే తొలి ఓటు వేస్తాం. వ్యవసాయ రంగం కీలకం జీ సోనియా: బీటెక్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ప్రతి నాయకుడూ రైతే దేశానికి వెన్నెముక అంటూ గొప్పలు చెప్పడమే కానీ ఆచరణలో చూపడంలేదు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. ప్రత్యేక ఆర్థిక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. రైతులు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. వారి సంక్షేమం కోసం పాటు పడేవారికే మా ఓటు. ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్: ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత అభ్యర్థులకు కేటాయించే గుర్తులే వారి గెలుపు, ఓటములను నిర్దేశిస్తాయి. జాతీయ పార్టీలకు చెందిన గుర్తులు, రిజిస్టర్ పార్టీల గుర్తులే కాకుండా స్వతంత్ర అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం మరో 82 రకాల గుర్తులను కేటాయించింది. వీటిని ఇలా కేటాయిస్తారు... = ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థి తన నామినేషన్ పత్రంలో గుర్తుల ప్రాధాన్యత క్రమ సంఖ్య సూచించాల్సి ఉంటుంది. జాతీయ, ప్రాంతీయ, గుర్తింపు పొందిన పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు కూడా గుర్తుల వివరాలు తెలియజేయాలి నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మాత్రమే గుర్తులు కేటాయిస్తారు తొలుత జాతీయ గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. ఆ పార్టీ అభ్యర్థి బీ-ఫాం సమర్పించాలి. ఆ తర్వాత గుర్తింపు పొందిన పార్టీలు, రిజిస్టర్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది స్వతంత్ర అభ్యర్థుల విషయంలో తెలుగు అక్షర మాల ప్రకారం వరుస క్రమం కేటాయిస్తారు. ఒక వార్డుకు, డివిజన్‌కు సంబంధించి ఐదుగురు అభ్యర్థులు తొలి ప్రాధాన్యత గుర్తు కింద ఒకే రకమైన గుర్తును (బీరువా) ప్రతిపాదిస్తే , ఆ గుర్తును ఎవరికి కేటాయించాలో ప్రశ్నార్థకంగా మారుతుంది. అలాంటి సమయంలో నామినేషన్ పత్రాల్లో నమోదు చేసిన ప్రకారం తెలుగు అక్షరమాల ఆధారంగా గుర్తులను కేటాయిస్తారు. ఒక సారి కేటాయించిన గుర్తును తిరిగి మార్చుకునే అవకాశం ఉండదు. ఖైదీలూ ఓటు వేయవచ్చు ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్: ప్రీవెంట్యూడిటెన్షన్ కింద వివిధ నేరాల్లో శిక్ష పడి జైలులో ఉన్న ఖైదీలు సైతం ఓటు వేసే హక్కును భారత రాజ్యాంగం కల్పించింది. జైలులో ఉండే ఖైదీలు తాము ఓటర్లమని, తమకు ఫలనా నియోజకవర్గంలోని డివిజన్ పరిధిలో ఓటు హక్కు ఉందని, దానిని ఉపయోగించుకోవాలని రాతపూర్వకంగా జైలర్‌కు అర్జీ పెట్టుకోవాలి. జైలర్ ఆయా నియోజకవర్గం, లేదా వార్డుకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ తెప్పిస్తారు. ఇలా జైలు నుంచే ఖైదీ తన ఓటు హక్కు ఉపయోగించుకొనే అవకాశం ఉంది.