పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
సాక్షి, కమలాపురం (కడప) : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు అమలుతో ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరుతుందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం పార్టీ మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి అధ్యక్షతన మండలంలోని సి.గోపులాపురం, పాచికలపాడు, మీరాపురం, అక్కంపేట గ్రామాలలో నిర్వహించిన గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఇంటింటికి తిరిగి నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే పార్టీలకు అతీతంగా సంక్షేమ పాలన అందుతుందన్నారు. నవరత్నాలతో ప్రతి కుటుంటానికి మేలు జరుగుతుందన్నారు. డ్వాక్రా రుణాలన్ని పూర్తిగా మాఫీ చేసి, తిరిగి కొత్త రుణాలు అందిస్తారన్నారు. అలాగే ప్రతి ఇంటికి రు.3వేల చొప్పున రెండు పింఛన్లు ఇస్తామన్నారు.
అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రు.15 వేలు, ఆటో కార్మికులకు ఏటా రు.10వేలు, ఇల్లు లేని వారికి రు.5లక్షలతో పక్కా గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో 45 ఏళ్లు పూర్తి అయిన మహిళలకు రు.75వేలు అందిస్తామన్నారు. ఇలా నవరత్నాల ద్వారా చదువుకునే పిల్లల నుంచి వృద్ధుల వరకు లబ్ధి చేకూరు తుందన్నారు. ప్రజలు కష్టాలన్నీ మరిచి పోయేలా జగన్ రెడ్డి పాలన అందిస్తారని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరారు.
ఘన స్వాగతం
మండలంలోని సి.గోపులాపురం, పాచికలపాడు, మీరాపురం, అక్కంపేట గ్రామాల్లో జరిగిన గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి ఆయా గ్రామాల్లో ఘన స్వాగతం పలికారు. స్థానిక నాయకులు, యువత పూల వర్షం కురిపిస్తూ, బాణా సంచా కాల్చుతూ, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment