MLA ravindranatha Reddy
-
నవరత్నాలే..మా గెలుపుకు బాటలు
సాక్షి, కమలాపురం (కడప) : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు అమలుతో ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరుతుందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం పార్టీ మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి అధ్యక్షతన మండలంలోని సి.గోపులాపురం, పాచికలపాడు, మీరాపురం, అక్కంపేట గ్రామాలలో నిర్వహించిన గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే పార్టీలకు అతీతంగా సంక్షేమ పాలన అందుతుందన్నారు. నవరత్నాలతో ప్రతి కుటుంటానికి మేలు జరుగుతుందన్నారు. డ్వాక్రా రుణాలన్ని పూర్తిగా మాఫీ చేసి, తిరిగి కొత్త రుణాలు అందిస్తారన్నారు. అలాగే ప్రతి ఇంటికి రు.3వేల చొప్పున రెండు పింఛన్లు ఇస్తామన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రు.15 వేలు, ఆటో కార్మికులకు ఏటా రు.10వేలు, ఇల్లు లేని వారికి రు.5లక్షలతో పక్కా గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో 45 ఏళ్లు పూర్తి అయిన మహిళలకు రు.75వేలు అందిస్తామన్నారు. ఇలా నవరత్నాల ద్వారా చదువుకునే పిల్లల నుంచి వృద్ధుల వరకు లబ్ధి చేకూరు తుందన్నారు. ప్రజలు కష్టాలన్నీ మరిచి పోయేలా జగన్ రెడ్డి పాలన అందిస్తారని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారు. ఘన స్వాగతం మండలంలోని సి.గోపులాపురం, పాచికలపాడు, మీరాపురం, అక్కంపేట గ్రామాల్లో జరిగిన గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి ఆయా గ్రామాల్లో ఘన స్వాగతం పలికారు. స్థానిక నాయకులు, యువత పూల వర్షం కురిపిస్తూ, బాణా సంచా కాల్చుతూ, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. -
రేపటి మహా ధర్నా కొనసాగుతుంది: ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
కమలాపురం: తన పాదయాత్ర ద్వారా సర్వరాయసాగర్ జలాశయానికి నీటిని విడుదల చేయాలనే డిమాండ్ జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లిందని, అయితే రేపటి తన మహా ధర్నా యథావిధిగా కొనసాగుతుందని వైఎస్సార్ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. మూడు రోజులుగా ఆయన పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కలెక్టర్ బాబురావు నాయుడు స్పందిస్తూ ఈ నెల 25వ తేదీ నాటికి నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే తన నాలుగో రోజు పాదయాత్ర ముగింపు నాడు చేపట్టే మహా ధర్నా యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ధర్నా అనంతరం కలెక్టరును కలుస్తానని, ఆయన ఇచ్చే హామీనిబట్టి ముందుగా ప్రకటించిన దీక్ష విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గతంలో అధికారులు ఇలానే హామీలు ఇచ్చి వెనక్కు తగ్గారని, అందుకే కలెక్టర్‌తో నేరుగా మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. -
అధికార అక్కసు.. !
సాక్షి, ముద్దనూరు(వైఎస్సార్): గండికోట జలాల సరఫరాలో రైతుల ప్రయోజనాలను విస్మరించి జిల్లాలోని అధికార పార్టీ నాయకులు జల రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎక్కడ తమకు పేరు రాకుండా పోతుందోనన్న అక్కసుతో అధికారులపై ఒత్తిడి తెచ్చి సర్వరాయసాగర్‌కు నీటి విడుదల ఆపారు. వారి తీరుపై వైఎస్సార్సీపీ నేతలు భగ్గుమన్నారు. వామికొండ వద్ద ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే... సర్వరాయసాగర్‌కు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి నవంబర్ 30వ తేదీ నుంచి పాదయాత్ర చేయాలని గతంలో నిర్ణయించారు. అయితే నాల్గవ తేదీలోగా సర్వరాయసాగర్‌కు నీరు విడుదల చేస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆయన పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం వామికొండ జలాశయం నుంచి సర్వరాయసాగర్‌కు నీటిని ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. కృష్ణాజలాలు సర్వరాయసాగర్‌కు వస్తున్నాయని తెలుసుకున్న ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, కడప మేయర్ సురేష్‌బాబు, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, రైతు విభాగపు జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డిలతో కలిసి సోమవారం సాయంత్రం పూజలు చేసేందుకు సర్వరాయసాగర్ కాలువ వద్దకు వెళ్లారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పూజలు చేసేందుకు వస్తున్నారన్న సమాచారం తెలియడంతో టీడీపీ నాయకులు ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి చేసి నీటి విడుదలను నిలిపి వేయించారు. విషయం తెలిసి ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, ఇతర నాయకులు పెద్దఎత్తున మండల రైతులతో కలిసి వామికొండ జలాశయం క్రాస్ రెగ్యులేటర్ వద్దకు వెళ్లారు. అక్కడ నీరు నిలుపుదల చేశారని తెలియగానే కలెక్టర్ బాబూరావునాయుడు, ఇరిగేషన్ ఎస్ఈ మధుసూదన్‌రెడ్డిలతో రవీంద్రనాథరెడ్డి ఫోన్లో మాట్లాడారు. నీరు ఎందుకు నిలిపివేశారని నిలదీశారు. పైనుంచి ఉత్తర్వులు అందలేదని, రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు అందగానే నీరు విడుదల చేస్తామని ఎస్ఈ తెలిపారు. దీనికి నిరసనగా నేతలందరూ వామికొండ క్రాస్ రెగ్యులేటర్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. నీరు విడుదల చేసేంతవరకు కదలమని ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి అధికారులకు తేల్చిచెప్పారు. ఎమ్మెల్యేలు రోడ్డుపై బైఠాయించారని తెలియగానే కొండాపురం సీఐ చిన్నపెద్దయ్య, ముద్దనూరు ఎస్ఐ నరసింహారెడ్డిలు తన సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్నారు. నిరసనను ఆపాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే నిరాకరించడంతో బలవంతంగా అందరినీ ముద్దనూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు సిద్ధమయ్యారు. పెద్దఎత్తున రైతులు పోలీసులకు అడ్డుతగిలారు. ఉద్రిక్తతల మధ్య నాయకులను ముద్దనూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జమ్మలమడుగు సమన్వయకర్త సుధీర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్, కమలాపురం, వీఎన్‌పల్లె మండలాల కన్వీనర్లు ఉత్తమారెడ్డి, రఘునాథరెడ్డి, నాయకులు సుమిత్ర, రాజశేఖరరెడ్డి, ఎంపీటీసీలు రవి, చండ్రాయుడు, పాలగిరి, అడవిచెర్లోపల్లె, మిట్టపల్లె సర్పంచ్‌లు జంగంరెడ్డి, సాంబశివారెడ్డి, ప్రతాప్ నిరసనలో పాల్గొన్నారు. -
ఇంకెన్నాళ్లు ఆగాలి?
♦ మూడేళ్లుగా ఎదురు చూసినా స్పందించరా.. ♦ నెలాఖరులోగా రైతులకు బీమా సొమ్ము ఇవ్వాలి ♦ లేదంటే బీమా కంపెనీ కార్యాలయాన్ని ముట్టడిద్దాం ♦ ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి ధ్వజం ♦ అఖిలపక్షం నేతల రోడ్డు దిగ్బంధనానికి భారీగా రైతులు వీరపునాయునిపల్లె : నెలాఖరులోగా పంటల బీమా మంజూరు చేయకపోతే రైతులు, అఖిల పక్షం నాయకులతో కలసి బీమా కంపెనీ కార్యాలయాన్ని ముట్టడిద్దామని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి పిలుపునిచ్చారు. 2012 రబీ సీజన్‌కు సంబంధించి పంటల మీమా ప్రీమియం చెల్లించిన రైతులందరికి బీమా మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం మండల పరిధిలోని తంగేడుపల్లె క్రాస్ వద్ద అఖిలపక్ష కమిటి నాయకులు రైతులతో కలసి రోడ్డు దిగ్బంధ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజ రై సంఘీభావం తెలుపుతూ వారు మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఎప్పటికీ రైతుల పక్షమేనన్నారు. జగన్మోహనరెడ్డి పలు మార్లు రైతుల కోసం దీక్ష చేపట్టాడని గుర్తు చేశారు. చిన్న చిన్న కారణాలతో రైతులకు అన్యాయం చేయడం తగదన్నారు. లోపాలుంటే మూడు నెలల్లో సరి చేయాల్సిన అధికారులు మూడేళ్లు గడిచినా పట్టించుకోక పోవడం దారుణం అన్నారు. విషయాన్ని వ్యవసాయ శాఖ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. రైతులకు ఇంత అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, జిల్లాపై వివక్ష చూపుతున్నారనేందుకు ఇదే నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలాఖరులోగా బీమా మంజూరు చేయకపోతే రైతులు, అఖిలపక్షం నేతలతో కలిసి హైదరాబాద్‌లోని బీమా కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ బీమా కంపెనీ నిర్వాకం వల్ల కేవలం 20 వేల మంది రైతులకు మాత్రమే బీమా అందిందని తెలిపారు. మిగిలిన 40 వేల మంది రైతులు రోడ్డుపైకి రావడం విచారకరమన్నారు. రైతులంతా ఐకమత్యంతో పోరాడితేనే ఈ ప్రభుత్వం దిగి వస్తుందన్నారు. దొంగ పాసుపుస్తకాల వల్లే బీమా రాలేదు: వరద వీరపునాయునిపల్లె : పులివెందుల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో చాలా మంది రైతులు నకిలీ పాసు పుస్తకాలు తయారు చేసి వాడుకుంటున్నారని, ఈ కారణంతోనే పంటల బీమా అందడం లేదని ప్రొద్దుటూరు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి ఎన్. వరదరాజులరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తంగేడుపల్లె క్రాస్ మీదుగా వెళ్తున్న అయన్ను బీమా ప్రీమియం కోసం రోడ్డు దిగ్భందించిన రైతులు తమకు మద్దతు తెలపాలని కోరగా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరద మాటలు విన్న రైతులు.. దొంగల్లా కనపడుతున్నామా..అంటూ అయన్ను ప్రశ్నించారు. అంతలో పోలీసులు జోక్యం చేసుకొని వరదను అక్కడి నుంచి పంపించేశారు. ఇది దుర్మార్గ ప్రభుత్వం నేను మారిన మనిషినని మాయ మాటలు చెప్పి ప్రజలను మోసగించి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఈ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి మేలు జరగలేదు. ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెబుతున్నాడే కాని నిధులు మాత్రం మంజూరు చేయలేదు. - చంద్రశేఖర్, సీపీఐ కమలాపురం నియోజకవర్గ కార్యదర్శి రైతుది బానిస బతుకు నేడు స్వదేశీ పాలనలో రైతులు బానిస బతుకు బతుకుతున్నారు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. 2012 రబీ బీమా విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. రైతుల కోసం పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం. -చంద్రశేఖరరెడ్డి, బీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రైతులంటే ఇంత నిర్లక్షమా? చిన్న కారణంతో రైతులకు అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసం? ప్రీమియం చెల్లించిన ప్రతి రైతుకు నెలాఖరులోగా బీమా ఇవ్వాలి. లేకపోతే రైతులతో కలసి ఆందోళన చేపడతాం. - రామసుబ్బారెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బీమా కార్యాలయాన్ని దిగ్బంధిస్తాం ప్రీమియం చెల్లించిన ప్రతి రైతుకు బీమా అందజేయాలి. జిల్లాలో దాదాపు 40 వేల మంది రైతులకు అన్యాయం జరిగింది. బీమా కంపెనీ జనరల్ మేనేజర్ రైతులపై కక్ష పూరిత ధోరణిలో వ్యవహ రిస్తున్నారు. రైతుల తరఫున బీమా కంపెనీ కార్యాలయాన్ని దిగ్బంధిస్తాం. -సోమశేఖరరెడ్డి,కాంగ్రెస్‌కిసాన్ విభాగం రాష్ట్ర నాయకుడు