అభివృద్ధి చేసేవారికే ఓటు
భారత రాజ్యాంగం ప్రకారం ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పాటయ్యేవే ప్రభుత్వాలు. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుతూ చట్ట.. కార్యనిర్వాహక రంగాలను గాడిలో పెట్టేవారే పాలకులు. ఇలాంటి వారిని గద్దెనెక్కించేవారు ఓటర్లే. అందుకే ప్రభుత్వ నిర్మాణంలో ఓటు కీలకం.. అత్యంత శక్తివంతం. ప్రజలకు ఎవరు మంచి చేస్తారో వారే మంత్రులుగా కొలువుదీరగలరు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తొలిఓటు పొంది.. మొదటి సారిగా అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకొనేందుకు జిల్లాలో వేలాదిమంది యువత ఎదురుచూస్తోంది. మున్సిపల్, ఎంపీటీసీ, జె డ్పీటీసీతో పాటు సార్వత్రిక ఎన్నికలు కూడా వరుసగా జరగనుండటంతో యువత నిర్ణయం కీలకం కానుంది. ముఖ్యంగా రాష్ట్ర
ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించ గల పార్టీకే తమ ఓటు అని మెజార్టీ నూతన ఓటర్లు స్పష్టం చేశారు. తొలి ఓటు వేయనున్నవారి మనోగతం మీకందిస్తున్నాం.
అమ్మఒడి పథకం అద్భుతం:
నబీ రసూల్: బీటెక్ (ఈసీఈ): థర్డ్ ఇయర్
వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ముఖ్యమంత్రి కాగానే అమ్మఒడి పథకం ద్వారా పిల్లల్ని బడికి పంపిన తల్లికి ఆర్థిక వెసులుబాటు కల్పిస్తామనడం చాలా సంతోషం. ఇద్దరు పిల్లలుంటే ఒక్కొక్కరికి ఎల్‌కేజీ నుంచి 10 వరకు నెలకు *500.. 10 నుంచి 12వ తరగతి వరకు నెలకు *700.. డిగ్రీ, పీజీ పిల్లలకు 1000 రూపాయలను తల్లి ఖాతాలో జమ చేస్తామని ప్రకటించడం గర్వించదగ్గ విషయం. దీనివల్ల అక్షరాస్యత పెంచవచ్చు. జగన్ తండ్రికి తగిన తనయుడని చెప్పవచ్చు.
విశ్వసనీయతున్నవారికే ప్రాధాన్యం
గోపు బ్రహ్మారెడ్డి: డి గ్రీ ఫైనలియర్
యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించే నాయకునికే తొలి ఓటు వేస్తా. ఎన్నికల్లో గెలుపొందడానికి ఉచిత హామీలు ఇస్తూ, మద్యం, డబ్బుతో ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అలాంటివారిని దరిచేర నీయకుండా విశ్వసనీయత ఉన్న నేతకే ఓటేస్తా. తెలుగు రాష్ట్రాన్ని చీల్చిన..దానికి సహకరించిన పార్టీలకు బుద్ధి చెబుతాం. రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించగల నాయకుడెవరో అందరికీ తెలుసు.
ఉచిత విద్య భేష్:
ఆస్మా: ఇంజినీరింగ్ (ఈసీఈ)
ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల జరిగిన ప్లీనరీ సమావేశంలో ప్రకటించడం ఆనందం. అక్షరాస్యతలో మనం వెనుకబడి ఉన్నాం. ప్రతి స్కూల్‌లో ఇంగ్లీషు మీడియం ఏర్పాటు చేస్తే పేద విద్యార్థులకు మంచి చదువు అందించవచ్చు. వారి తల్లిదండ్రులు అప్పులు పాలవ్వకుండా ఉంటారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకొనే వారికే ఓటు వేస్తాం.
సీమాంధ్రను అభివృద్ధి చేయాలి: జీ అశ్విని: బీటెక్
రాష్ట్ర విభజన తరువాత జరుగుతున్న మొదటి ఎన్నికల్లో.. మేము తొలి ఓటు వేస్తున్నాం. కాంగ్రెస్, టీడీపీల వల్లే రాష్ట్ర విభజన జరిగింది. హైదరాబాద్‌ను ఇప్పటివరకు అందరూ కలిసి అభివృద్ధి చేశారు. కానీ అంతా వృథా అయింది.సీమాంధ్ర కొత్త రాజధానిని సింగపూర్‌లా అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు. మమ్మల్ని అభివృద్ధి చేసే పార్టీకే ఓటువేస్తాం. సీమాంధ్ర ఉద్యమంలో సమైక్యాంధ్రకు పాటుపడిన పార్టీకే తొలి ఓటు వేస్తాం.
వ్యవసాయ రంగం కీలకం జీ సోనియా: బీటెక్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ప్రతి నాయకుడూ రైతే దేశానికి వెన్నెముక అంటూ గొప్పలు చెప్పడమే కానీ ఆచరణలో చూపడంలేదు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. ప్రత్యేక ఆర్థిక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. రైతులు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. వారి సంక్షేమం కోసం పాటు పడేవారికే మా ఓటు.
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్: ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత అభ్యర్థులకు కేటాయించే గుర్తులే వారి గెలుపు, ఓటములను నిర్దేశిస్తాయి. జాతీయ పార్టీలకు చెందిన గుర్తులు, రిజిస్టర్ పార్టీల గుర్తులే కాకుండా స్వతంత్ర అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం మరో 82 రకాల గుర్తులను కేటాయించింది. వీటిని ఇలా కేటాయిస్తారు...
= ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థి తన నామినేషన్ పత్రంలో గుర్తుల ప్రాధాన్యత క్రమ సంఖ్య సూచించాల్సి ఉంటుంది.
జాతీయ, ప్రాంతీయ, గుర్తింపు పొందిన పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు కూడా గుర్తుల వివరాలు తెలియజేయాలి
నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మాత్రమే గుర్తులు కేటాయిస్తారు
తొలుత జాతీయ గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. ఆ పార్టీ అభ్యర్థి బీ-ఫాం సమర్పించాలి. ఆ తర్వాత గుర్తింపు పొందిన పార్టీలు, రిజిస్టర్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది స్వతంత్ర అభ్యర్థుల విషయంలో తెలుగు అక్షర మాల ప్రకారం వరుస క్రమం కేటాయిస్తారు.
ఒక వార్డుకు, డివిజన్‌కు సంబంధించి ఐదుగురు అభ్యర్థులు తొలి ప్రాధాన్యత గుర్తు కింద ఒకే రకమైన గుర్తును (బీరువా) ప్రతిపాదిస్తే , ఆ గుర్తును ఎవరికి కేటాయించాలో ప్రశ్నార్థకంగా మారుతుంది. అలాంటి సమయంలో నామినేషన్ పత్రాల్లో నమోదు చేసిన ప్రకారం తెలుగు అక్షరమాల ఆధారంగా గుర్తులను కేటాయిస్తారు. ఒక సారి కేటాయించిన గుర్తును తిరిగి మార్చుకునే అవకాశం ఉండదు.
ఖైదీలూ ఓటు వేయవచ్చు
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్: ప్రీవెంట్యూడిటెన్‌షన్ కింద వివిధ నేరాల్లో శిక్ష పడి జైలులో ఉన్న ఖైదీలు సైతం ఓటు వేసే హక్కును భారత రాజ్యాంగం కల్పించింది. జైలులో ఉండే ఖైదీలు తాము ఓటర్లమని, తమకు ఫలనా నియోజకవర్గంలోని డివిజన్ పరిధిలో ఓటు హక్కు ఉందని, దానిని ఉపయోగించుకోవాలని రాతపూర్వకంగా జైలర్‌కు అర్జీ పెట్టుకోవాలి. జైలర్ ఆయా నియోజకవర్గం, లేదా వార్డుకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ తెప్పిస్తారు. ఇలా జైలు నుంచే ఖైదీ తన ఓటు హక్కు ఉపయోగించుకొనే అవకాశం ఉంది.
అభివృద్ధి చేసేవారికే ఓటు
Published Wed, Mar 19 2014 4:06 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement