Amol Mazumdar
-
ముంబై కోచ్‌గా దేశవాళీ క్రికెట్ దిగ్గజం..
ముంబై: రాబోయే దేశవాళీ సీజన్లో ముంబై జట్టు హెడ్ కోచ్‌గా దేశవాళీ క్రికెట్ దిగ్గజం, ముంబై మాజీ కెప్టెన్ అమోల్ ముజుందార్ నియమితులయ్యారు. ప్రస్తుత కోచ్ రమేశ్ పొవార్ ఇటీవలే భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడంతో అతని స్థానంలో ముజుందార్‌ను ఎంపికయ్యారు. ప్రతిష్టాత్మకమైన ముంబై కోచ్ పదవి కోసం భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తదితర మాజీలు పోటీపడ్డా, చివరకు ఆ పదవి ముజుందార్‌నే వరించింది. ఈ పదవి కోసం మొత్తం 9 మంది మాజీ ఆటగాళ్లు దరఖాస్తు చేసుకోగా.. జతిన్ పరాంజ్పే, నీలేశ్ కులకర్ణి, వినోద్ కాంబ్లీలతో కూడిన ఎంసీఏ క్రికెట్ కమిటీ ముజుందార్వైపే మొగ్గు చూపింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. కాగా, ముంబై కొత్త కోచ్‌గా ఎంపికైన మజుందార్ 1994-2013 మధ్యకాలంలో 171 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 48.1 సగటుతో 11,167 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు, 60 అర్ధశతకాలు ఉన్నాయి. చదవండి: అతనో రాతి గోడ.. అతని ఓపికకు సలామ్ -
క్రికెట్‌కు మజుందార్ వీడ్కోలు
రిటైర్మెంట్ ప్రకటించిన ముంబై బ్యాట్స్‌మన్ ముంబై: భారత దేశవాళీ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ముంబై బ్యాట్స్‌మన్ అమోల్ మజుందార్ తన 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు 39 ఏళ్ల మజుందార్ గురువారం ప్రకటించాడు. దేశవాళీలో ముంబైతో పాటు అస్సాం, ఆంధ్ర జట్లకు కూడా అతను ప్రాతినిధ్యం వహించాడు. 1993-94 సీజన్లో ఫస్ట్ క్లాస్ కెరీర్ ఆరంభించిన అతను 171 మ్యాచ్‌ల్లో 48.13 సగటుతో 11,167 పరుగులు చేయడం విశేషం. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. ‘అమోల్ బ్యాటింగ్ శైలి ప్రత్యేకం. అతని స్ఫూర్తి జట్టుపై ముద్ర వేసింది. రిటైర్డ్ బృందంలోకి స్వాగతం’ అంటూ ఈ సందర్భంగా సచిన్ ట్వీట్ చేయగా, గుర్తింపు దక్కని హీరోగా రోహిత్ శర్మ అతడిని ప్రస్తుతించాడు.