క్రికెట్‌కు మజుందార్ వీడ్కోలు | Amol Muzumdar retires from cricket | Sakshi
Sakshi News home page

క్రికెట్‌కు మజుందార్ వీడ్కోలు

Published Fri, Sep 26 2014 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 PM

క్రికెట్‌కు మజుందార్ వీడ్కోలు

క్రికెట్‌కు మజుందార్ వీడ్కోలు

రిటైర్మెంట్ ప్రకటించిన ముంబై బ్యాట్స్‌మన్
ముంబై: భారత దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ముంబై బ్యాట్స్‌మన్ అమోల్ మజుందార్ తన 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్ అవుతున్నట్లు 39 ఏళ్ల మజుందార్ గురువారం ప్రకటించాడు. దేశవాళీలో ముంబైతో పాటు అస్సాం, ఆంధ్ర జట్లకు కూడా అతను ప్రాతినిధ్యం వహించాడు.  1993-94 సీజన్‌లో ఫస్ట్ క్లాస్ కెరీర్ ఆరంభించిన అతను 171 మ్యాచ్‌ల్లో 48.13 సగటుతో 11,167 పరుగులు చేయడం విశేషం. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. ‘అమోల్ బ్యాటింగ్ శైలి ప్రత్యేకం. అతని స్ఫూర్తి జట్టుపై ముద్ర వేసింది. రిటైర్డ్ బృందంలోకి స్వాగతం’ అంటూ ఈ సందర్భంగా సచిన్ ట్వీట్ చేయగా, గుర్తింపు దక్కని హీరోగా రోహిత్ శర్మ అతడిని ప్రస్తుతించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement