వాంఖడే వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ (మే 12) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న కేరళ క్రికెటర్ విష్ణు వినోద్ ఓ ఆసక్తికర అంశానికి సంబంధించి రికార్డుల్లోకెక్కాడు. వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అయిన విష్ణు వినోద్ చివరిసారిగా 2017లో ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. మళ్లీ ఇన్నాళ్లకు (2189) అతనికి బరిలోకి దిగే అవకాశం లభించింది.
ఐపీఎల్‌లో అత్యధిక గ్యాప్ (రోజుల పరంగా) తర్వాత బరిలోకి దిగిన ఆటగాళ్ల జాబితాలో విష్ణు వినోద్ రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఈ జాబితాలో హర్ప్రీత్ భాటియా (3981) అగ్రస్థానంలో ఉండగా.. విష్ణు రెండులో, స్వప్నిల్ సింగ్ (2182), శ్రీవట్స్ గోస్వామి (2181) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.
2017లో ఆర్సీబీ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన విష్ణు.. ఆ సీజన్‌లో 3 మ్యాచ్‌లు ఆడి కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతనికి ఆతర్వాత అవకాశాలు రాలేదు. 2021 (ఢిల్లీ, 20 లక్షలు), 2022 (సన్‌రైజర్స్, 50 లక్షలు) సీజన్లలో అతనికి వివిధ జట్లలో చోటు లభించినా, తుది జట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఈ సీజన్‌లో ముంబై ఆడిన గత మ్యాచ్‌లో (ఆర్సీబీ) సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన విష్ణు.. కీలకమైన డుప్లెసిస్ క్యాచ్ పట్టుకున్నాడు.
వచ్చీ రాగానే ఎదురుదాడి..
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం (ఆరేళ్ల తర్వాత) ఐపీఎల్‌లో బ్యాటింగ్‌కు దిగిన విష్ణు.. వచ్చీ రాగానే ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ మ్యాచ్‌లో 20 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేసిన విష్ణు భారీ షాట్ అడేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. ఇషాన్ కిషన్ (31), రోహిత్ శర్మ (29), విష్ణు వినోద్ (30) ఓ మోస్తరు స్కోర్లు సాధించడంతో 17 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. నేహల్ వధేరా (15), టిమ్ డేవిడ్ (5) విఫలం కాగా.. సూర్యకుమార్ యాదవ్ (53), గ్రీన్ (0) క్రీజ్‌లో ఉన్నారు.
చదవండి: మరోసారి నిరాశపరిచిన రోహిత్.. హిట్‌మ్యాన్ పని అయిపోయిందంటున్న నెటిజన్లు
Comments
Please login to add a commentAdd a comment