Indian domestic cricket
-
దేశవాలీ క్రికెట్ సీజన్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) 2023-24 దేశవాలీ క్రికెట్ సీజన్ షెడ్యూల్‌ను ఇవాళ (జూన్ 18) విడుదల చేసింది. ఈ సీజన్ 28 జూన్ 2023 నుంచి 14 మార్చి 2024 వరకు సాగనుంది. దులీప్ ట్రోఫీతో ప్రారంభమయ్యే ఈ సీజన్లో మొత్తం 1846 మ్యాచ్‌లు జరుగనున్నాయి. జూన్ 28న మొదలయ్యే దులీప్ ట్రోఫీ జులై 16న ముగుస్తుంది. ఆ వెంటనే జులై 24-ఆగస్ట్ 4 మధ్యలో దియోధర్ ట్రోఫీ జరుగుతుంది. ఈ రెండు టోర్నీల్లో ఆరు జోన్ల జట్లు (సెంట్రల్, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, నార్త్-ఈస్ట్) పాల్గొంటాయి. ఈ రెండు టోర్నీల తర్వాత అక్టోబర్ 1 నుంచి 5 వరకు రంజీ ఛాంపియన్ సౌరాష్ట్ర-రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య ఇరానీ ట్రోఫీ జరుగుతుంది. ఈ మూడు మల్టీ డే ఫార్మాట్ (టెస్ట్ ఫార్మాట్) టోర్నీల తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (టీ20 ఫార్మాట్), విజయ్ హజారే ట్రోఫీ (వన్డే ఫార్మాట్) లు మొదలవుతాయి. ముస్తాక్ అలీ ట్రోఫీ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 6 వరకు జరుగనుండగా.. విజయ్ హజారే ట్రోఫీ నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు జరుగుతుంది. ఈ రెండు పరిమిత ఓవర్ల టోర్నీల్లో మొత్తం 38 జట్లు పోటీపడతాయి. 2024 జనవరి 5 నుంచి రంజీ ట్రోఫీ.. 2024 జనవరి 5 నుంచి ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ మొదలవుతుంది. మార్చి 14 వరకు సాగే ఈ టోర్నీలోనూ మొత్తం 38 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో మొత్తం జట్లు 5 గ్రూపులుగా (గ్రూప్-ఏ,బి,సీ,డీ, ప్లేట్) విభజించబడతాయి. ఇక మహిళల క్రికెట్ విషయానికొస్తే.. సీనియర్ వుమెన్స్ టీ20 ట్రోఫీతో మహిళల డొమెస్టిక్ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ టోర్నీ అక్టోబర్ 19 నుంచి నవంబర్ 9 వరకు సాగుతుంది. ఆతర్వాత నవంబర్ 24-డిసెంబర్ 4 మధ్యలో సీనియర్ వుమెన్స్ ఇంటర్ జోనల్ ట్రోఫీ జరుగుతుంది. దీని తర్వాత జనవరి 4, 2024 నుంచి సీనియర్ వుమెన్స్ వన్డే ట్రోఫీ మొదలవుతుంది. ఈ టోర్నీ జనవరి 26 వరకు సాగుతుంది. -
బీసీసీఐ నుంచి బిగ్‌న్యూస్
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నుంచి ఇవాళ (ఏప్రిల్ 11) ఓ బిగ్‌న్యూస్ వెలువడింది. 2023-24 భారత దేశవాలీ సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. జూన్ 2023-మార్చి 2024 మధ్యలో సాగే ఈ సీజన్లో మొత్తం 1846 మ్యాచ్‌లు జరుగనున్నాయి. 2023 జూన్ 28న మొదలయ్యే దులీప్ ట్రోఫీతో ఈ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ టోర్నీ జులై 16, 2023న ముగుస్తుంది. ఆ వెంటనే జులై 24-ఆగస్ట్ 3 మధ్యలో దియోధర్ ట్రోఫీ జరుగుతుంది. ఈ రెండు టోర్నీల్లో ఆరు జోన్ల జట్లు (సెంట్రల్, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, నార్త్-ఈస్ట్) పాల్గొంటాయి. ఈ రెండు టోర్నీ తర్వాత అక్టోబర్ 1 నుంచి రంజీ ఛాంపియన్ సౌరాష్ట్ర-రెస్ట్ ఆఫ్ఇండియా జట్ల మధ్య ఇరానీ ట్రోఫీ మొదలవుతుంది. ఈ మూడు మల్టీ డే ఫార్మాట్ (టెస్ట్ ఫార్మాట్) టోర్నీల తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (టీ20 ఫార్మాట్), విజయ్ హజారే ట్రోఫీ (వన్డే ఫార్మాట్) లు మొదలవుతాయి. ముస్తాక్ అలీ ట్రోఫీ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 6 వరకు జరుగనుండగా.. విజయ్ హజారే ట్రోఫీ నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు జరుగుతుంది. ఈ రెండు పరిమిత ఓవర్ల టోర్నీల్లో మొత్తం 38 జట్లు పోటీపడతాయి. అనంతరం 2024 జనవరి 5 నుంచి ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ మొదలుకానుంది. మార్చి 14 వరకు సాగే ఈ టోర్నీలోనూ మొత్తం 38 జట్లు పాల్గొంటాయి. ఇక మహిళల క్రికెట్ విషయానికొస్తే.. సీనియర్ వుమెన్స్ టీ20 ట్రోఫీతో మహిళల డొమెస్టిక్ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ టోర్నీ అక్టోబర్ 19 నుంచి నవంబర్ 9 వరకు సాగుతుంది. ఆతర్వాత నవంబర్ 24-డిసెంబర్ 4 మధ్యలో సీనియర్ వుమెన్స్ ఇంటర్ జోనల్ ట్రోఫీ జరుగుతుంది. దీని తర్వాత జనవరి 4, 2024 నుంచి సీనియర్ వుమెన్స్ వన్డే ట్రోఫీ మొదలవుతుంది. ఈ టోర్నీ జనవరి 26 వరకు సాగుతుంది. -
నేటి నుంచి దులీప్ ట్రోఫీ సమరం
దిండిగుల్ (తమిళనాడు): భారత దేశవాళీ క్రికెట్ సీజన్ (2018–19)కు రంగం సిద్ధమైంది. నేటినుంచి జరిగే దులీప్ ట్రోఫీతో కొత్త సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఇండియా ‘గ్రీన్’తో డిఫెండింగ్ చాంపియన్ ఇండియా ‘రెడ్’ తలపడనుంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో పింక్ బంతితో మూడు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. లీగ్ మ్యాచ్‌లన్నీ నాలుగు రోజులు... సెప్టెంబర్ 4నుంచి ఫైనల్ ఐదు రోజులు జరుగుతుంది. ఇండియా ‘రెడ్’కు అభినవ్ ముకుంద్ సారథి కాగా... ‘గ్రీన్’కు పార్థివ్ పటేల్, ‘బ్లూ’కు ఫైజ్ ఫజల్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో భారత ఓపెనర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతున్న నేపథ్యంలో అభినవ్ ముకుంద్, పార్థివ్ పటేల్‌లు తాము ఆ స్థానాలకు అర్హులమే అని నిరూపించుకునేందుకు ఇది సరైన అవకాశం. భారత రెగ్యులర్ టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయం కారణంగా ఆటకు దూరమవ డంతో... అతని స్థానంలో ఎంపికైన దినేశ్ కార్తీక్ ఆ బాధ్యతను సరిగ్గా నిర్వహించలేకపోతున్న నేపథ్యంలో పార్థివ్ పటేల్‌ను పరిగణనలోకి తీసుకోవాలంటే అతను సత్తా చాటక తప్పదు. వీళ్లతో పాటు గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న ఫైజ్ ఫజల్, ధవల్ కులకర్ణి, పర్వేజ్ రసూల్, బాసిల్ థంపి, గుర్బాని, గణేశ్ సతీశ్, బి. సందీప్, ఎ. మిథున్, అంకిత్ రాజ్‌పుత్, జైదేవ్ ఉనాద్కట్‌లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి. ఆంధ్ర క్రికెటర్లు శ్రీకర్ భరత్, అయ్యప్ప ఇండియా ‘బ్లూ’ జట్టుకు, పృథ్వీరాజ్ ‘రెడ్’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండు రోజులు ఆలస్యంగా... సాక్షి, విజయవాడ: ఆస్ట్రేలియా ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’లతో పాటు భారత ‘ఎ’, ‘బి’ జట్లు పాల్గొంటున్న క్వాడ్రాంగులర్ వన్డే టోర్నీ కూడా నేటి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వాతావరణం ప్రతికూలంగా మారడంతో నేడు, రేపు జరగాల్సిన మ్యాచ్‌లను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మూలపాడులో జరిగే ఈ టోర్నీ ఫైనల్ ఈ నెల 29న నిర్వహిస్తారు. దక్షిణాఫ్రికా జట్టుకు జోండో కెప్టెన్ కాగా... ఆస్ట్రేలియాకు ట్రవిస్ హెడ్ సారథ్యం వహిస్తున్నాడు. భారత్ ‘ఎ’ జట్టుకు శ్రేయస్ అయ్యర్, ‘బి’ జట్టుకు మనీశ్ పాండే కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. -
క్రికెట్‌కు మజుందార్ వీడ్కోలు
రిటైర్మెంట్ ప్రకటించిన ముంబై బ్యాట్స్‌మన్ ముంబై: భారత దేశవాళీ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ముంబై బ్యాట్స్‌మన్ అమోల్ మజుందార్ తన 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు 39 ఏళ్ల మజుందార్ గురువారం ప్రకటించాడు. దేశవాళీలో ముంబైతో పాటు అస్సాం, ఆంధ్ర జట్లకు కూడా అతను ప్రాతినిధ్యం వహించాడు. 1993-94 సీజన్లో ఫస్ట్ క్లాస్ కెరీర్ ఆరంభించిన అతను 171 మ్యాచ్‌ల్లో 48.13 సగటుతో 11,167 పరుగులు చేయడం విశేషం. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. ‘అమోల్ బ్యాటింగ్ శైలి ప్రత్యేకం. అతని స్ఫూర్తి జట్టుపై ముద్ర వేసింది. రిటైర్డ్ బృందంలోకి స్వాగతం’ అంటూ ఈ సందర్భంగా సచిన్ ట్వీట్ చేయగా, గుర్తింపు దక్కని హీరోగా రోహిత్ శర్మ అతడిని ప్రస్తుతించాడు.