Amrit Kaal
-
త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా భారత్
న్యూఢిల్లీ: భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారే క్రమం (అమృత్ కాల్) తొలి దశలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని సాధించనున్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. భారతదేశం 2027–28లో ఐదు ట్రిలియన్ ఎకానమీతో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ అంచనా వేస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి స్థూల ఆర్థిక అంశాల స్థిరత్వం, దీనివల్ల ఏర్పడే బలమైన రూపాయి సహాయంతో భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ మైలురాయిని దాటుతుందని లోక్‌సభలో ఇచి్చన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ‘2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా అమృత్ కాల్ ప్రారంభ సమయంలోనే దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుంది‘ అని చౌదరి చెప్పారు. పురోగతి ఇలా... మంత్రి పేర్కొన్న సమాచారం ప్రకారం, 1980–81లో భారత్ ఎకానమీ పరిమాణం 189 బిలియన్ డాలర్లు. దశాబ్దకాలం గడిచే సరికి ఈ విలువ 326 బిలియన్ డాలర్లకు చేరింది. 2000–01 నాటికి 476 బిలియన్ డాలర్లకు ఎగసింది. 2010–11 నాటికి ఈ విలువ 1.71 ట్రిలియన్ డాలర్లకు చేరగా, 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 2.67 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారింది. 2022–23 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఈ విలువ 3.75 ట్రిలియన్ డాలర్లు. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఐతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (3.75 ట్రిలియన్ డాలర్లు) కొనసాగుతున్న భారత్ తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లుగా (రూ.98,374) అంచనా. 2047 నాటికి ఈ పరిమాణం 18,000 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. భారత్ 2047 నాటికి (స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు) 30 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు నీతి ఆయోగ్ విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తోంది. ఈ విజన్ డాక్యుమెంట్‌ను వచ్చే ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. విజన్ డాక్యుమెంట్– 2047 భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అవసరమైన సంస్థాగత, నిర్మాణాత్మక మార్పులను సంస్కరణలను నిర్దేశించనుంది. దిగువ మధ్య ఆదాయ స్థితి నుంచి దేశ పురోగతి విజన్ 2047 ప్రధానంగా నిర్దేశించుకుంది. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ► భారతదేశం మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. మార్కెట్ నిర్ణయించిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), మారకపు రేటు ద్వారా ప్రభుత్వం ఆర్థిక పురోగతిని పర్యవేక్షిస్తుంది. ►దేశీయ–అంతర్జాతీయ మార్కెట్లు రెండూ భారతదేశ జీడీపీ మారకపు రేటు, జీడీపీకి సంబంధించి వివిధ రంగాల సహకారాన్ని నిర్ణయించే యంత్రాంగాలు. ►2022–23లో భారత్ ఎకానమీలో వ్యవసాయ రంగం వాటా 18.4 శాతం. పారిశ్రామిక రంగం వాటా 28.3 శాతం. సేవల రంగం వాటా 53.3 శాతం. ►వార్షిక బడ్జెట్లలో ప్రకటించిన చర్యలతో సహా విధానపరమైన నిర్ణయాల ద్వారా ప్రభుత్వం ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది. ►జీడీపీ వృద్ధి రేటును వేగంగా పెంచడం కోసం ప్రభుత్వం గత 9 ఏళ్లలో తీసుకున్న ప్రధాన కార్యక్రమాలలో... దివాలా (ఐబీసీ) కోడ్ అమలు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు తగిన మూలధన కల్పన, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు, కార్పొరేట్ పన్ను తగ్గింపు, మూలధన వ్యయాల్లో నాణ్యత పెంపు, 14 రంగాలలో ఉత్పత్తి ఆధారిత పథకాల పథకం అమలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు విధానాల్లో నిరంతర సరళీకరణ, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన ఉన్నాయి. -
ఆప్తమిత్రులకు గోల్డెన్ పాస్‌పోర్టా?: రాహుల్
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ అన్న వినోద్ అదానీ సహా 66 భారతీయులు సైప్రస్ వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ‘గోల్డెన్ పాస్‌పోర్ట్’ మంజూరు చేసినట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘అమృత్‌కాల్‌లో ఆప్తమిత్రులైన ఆ సోదరులిద్దరూ దేశం విడిచి ఎందుకు వెళ్లారు? గోల్డెన్ పాస్‌పోర్టు అంటే ప్రజాధనాన్ని దోచుకుని, డొల్ల కంపెనీలు పెట్టుకుని, విదేశాల్లో జల్సా చేసేందుకు బంగారంలాంటి అవకాశం’అని బుధవారం రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు. రాహుల్ ఆరోపణలపై బీజేపీ దీటుగా స్పందించింది. సైప్రస్ ఇన్వెస్టిమెంట్ ప్రోగ్రామ్ లేదా గోల్డెన్ పాస్‌పోర్ట్ పథకాన్ని 2007లో కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చిందని గుర్తు చేసింది. పన్ను ఎగవేతదారులకు లాభించేలా సైప్రస్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకుందని తెలిపింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక, ఈ విధానంపై నియంత్రణలు తీసుకువచ్చామని పేర్కొంది. -
అమృత్కాల్ అంటే..
న్యూఢిల్లీ: అమృత్‌కాల్‌లో ప్రవేశపెట్టబడిన తొలి బడ్జెట్ ఇదేనంటూ బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ‘ గత బడ్జెట్ వేసిన పునాదులపై నిర్మించబడిన బడ్జెట్ ఇది. పాతికేళ్లలో వందో స్వాతంత్ర దినోత్సవం జరుపుకోనున్న భారత్‌కు బ్లూప్రింట్ ఈ పద్దు’ అని ఆమె వ్యాఖ్యానించారు. బడ్జెట్ ప్రసంగంలో విత్తమంత్రి పలు మార్లు ప్రస్తావించిన ‘అమృత్కాల్’పై చర్చ మొదలైంది. అమృత్కాల్ ప్రత్యేకత ఏంటి అనేది ఓసారి పరిశీలిస్తే.. ఢిల్లీలో 2021వ సంవత్సరంలో 75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ తొలిసారిగా ‘అమృత్కాల్’ అనే భావనను తెరమీదకు తెచ్చారు. ‘దేశం 75 స్వేచ్ఛా స్వాతంత్ర వసంతాలు పూర్తిచేసుకుంది. మరో 25 సంవత్సరాల్లో దేశం శత వసంతాలు పూర్తిచేసుకోబోతోంది. అంటే 2021వ ఏడాది నుంచి వచ్చే 25 సంవత్సరాలు దేశానికి అమృతకాలంతో సమానం. ఈ 25 సంవత్సరాల్లోనే భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించి ‘అభివృద్ధి చెందుతున్న దేశం’ నుంచి ‘అభివృద్ధి చెందిన దేశం’గా అవతరించాలి. ఇందుకు అనుగుణంగా పల్లెలు, పట్టణాలకు మధ్య ఉన్న అభివృద్ధి అంతరాలను చెరిపేయాలి. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని దేశంలో డిజిటలైజేషన్ పాత్ర పెంచి ప్రజాజీవితంలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించుకోవాలి. ప్రతీ గ్రామానికి రోడ్డు సౌకర్యం ఉండాలి. ప్రతీ కుటుంబానికి బ్యాంక్ ఖాతా, గ్యాస్ కనెక్షన్, అర్హుడైన పౌరులకు ఆరోగ్య బీమా ఉండాలి. అందరి సమష్టి కృషి, అంకితభావం, త్యాగాల ఫలితంగానే ఇదంతా సాధ్యం. వందల ఏళ్లు బానిసత్వాన్ని చవిచూసిన భారతీయ సమాజం.. కోల్పోయిన వైభవాన్ని తిరిగి సాధించేందుకు మనకు మనం నిర్దేశించుకున్న పాతికేళ్ల లక్ష్యమిది’ అని ఆనాడు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అమృత్కాల్ అనే పదం మన వేదాల్లో ప్రస్తావించబడింది. కష్టాల కడలిని దాటి విజయతీరాలకు చేరుకునే కాలం. కొత్త పని మొదలుపెట్టేందుకు అత్యంత శుభసూచకమైన సమయంగా అమృత్‌కాల్‌ను భావిస్తారు. -
ఆర్థిక మంత్రి పదే పదే ప్రస్తావించిన 'అమృత్ కాల్' అంటే ఏంటి?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటుకు సమర్పించారు. ప్రధానంగా ఇందులో వేతన జీవులకు ఊరట కల్పిస్తూ ఆదాయపన్ను పరిమితిని పెంచారు. మైనారిటీల సాధికారత, మహిళా సాధికారత, అందరికీ తగిన అవకాశాల కల్పనపై దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. అలాగా సప్తరుషి పేరుతో ఏడు ప్రాధాన్యత అంశాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. నిర్మలా సీతారామన్ పదే పదే ప్రస్తావించిన 'అమృత్ కాల్' అంటే ఏమిటి? అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్ అని ఆమె ప్రకటించడం విశేషంగా నిలిచింది. 'అమృత్ కాల్' అనే పదాన్ని తొలిసారిగా 2021లో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని (పీఎం) నరేంద్ర మోదీ ఉపయోగించారు. రాబోయే 25 సంవత్సరాల కోసం భారతదేశం కోసం కొత్త రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించేటప్పుడు ప్రధాని మోదీ ఈ పదాన్ని ఉపయోగించారు. ఆ సమయంలో, అమృత్ కాల్ ఉద్దేశ్యం భారతదేశ పౌరుల జీవితాలను మెరుగుపరచడం. గ్రామాలు, నగరాల మధ్య అభివృద్ధిలో విభజనను తగ్గించడం అని ప్రధాని మోదీ అన్నారు. ప్రజల జీవితాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించడం మరియు సరికొత్త సాంకేతికతను స్వాగతించడం కూడా దీని లక్ష్యం అని ప్రకటించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });