ananthalakshmi
-
అణకువ
‘‘ఆకులందున అణిగి మణిగి కవిత కోకిల పలుకవలెనోయ్’’ అంటారు గురజాడ. తన ఘనతని తాను ప్రకటించుకోవటం కాక, ప్రతిభని అవతలి వారు గుర్తించాలి. కోకిల కనపడ నవసరం లేదు. దాని గుర్తింపు మధురమైన కంఠస్వరం మాత్రమే. కావాల్సిన వారు దానిని వెతుక్కోవాలి. ఎందుకంటే – రత్నాన్ని అన్వేషించాలే కాని, అది తనని తాను ప్రకటించుకోదు. ‘‘అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది. ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది.’’ అనే సామెత తెలుసు కదా! నిండు కుండ లాగా తొణకకుండా బెణకకుండా ఉండటం సమృద్ధికి, సంపదకి సంకేతం. అది ఉత్తమ వ్యక్తిత్వ లక్షణం. ఎగిరెగిరి పడకుండా, తన గొప్పని, లేదా తానే గొప్ప అని ప్రకటించుకుంటూ, ప్రదర్శించుకుంటూ ఉండక పోవటమే అణకువ. ఎందుకంటే ఎవరైనా ఒక రంగంలో గొప్ప అనుకుంటే, అదే రంగంలో అంతకన్న ఘనులు అప్పుడే కాని, తరువాత కాని ఉండచ్చు. కనక అహంకరించకూడదు. తన స్థాయి ఏమిటో తెలుసుకుని ఉండాలి. నీలో గొప్పతనం ఉంటే అది నువ్వు ప్రకటించుకోకూడదు. ఇతరులు గుర్తించాలి. ఎట్లా? ప్రవర్తన ద్వారా, మాట ద్వారా. తన గొప్పతనం తానే చెప్పుకున్న వాడు హాస్యాస్పదుడు అవుతాడు. అంతకన్న ముందు ఆయుః క్షీణం అని పెద్దలు చెప్పిన మాట. పైగా తనని తాను పొగడుకోవటం ఆత్మహత్యా సదృశం. మహాపాతకం. అంటే నివృత్తి లేని పరిహారం, ప్రాయశ్చిత్తం లేని పెద్ద పాపం. నోటితో చెప్పక పోయినా తమ ప్రవర్తన ద్వారా తామే చాలా ఘనులు, ఇతరులు పనికిరానివారు అనే అభిప్రాయం కలిగేట్టు ప్రవర్తిస్తారు కొందరు. అది వారి విద్యావిహీనత ను సూచిస్తుంది. విద్య వల్ల మొదట వచ్చేది వినయం. (విద్య యొసగును వినయంబు, వినయంబు వలన పాత్రత, పాత్రత వలన ధనం, ధనం వల్ల ఐహికాముష్మిక సంపదలు బడయు నరుడు) అంటే వినయం అన్నది విద్యావంతుల లక్షణం. వినయ విధేయతలు లేని వారు డిగ్రీలు ఉన్నా విద్యావంతులుగా పరిగణింపబడరు. చదువు ‘‘కొన్నవారు’’ మాత్రమే అవుతారు. ‘‘వస్త్రేణ, వపుషా, వాచా, విద్యయా, వినయేన చ నరో యాతి గౌరవం’’ గౌరవార్హతలలో ప్రధానమైన ఐదింటిలో వినయం కూడా ఒకటి. అలా ఒదిగి ఉండటం మనిషి గొప్పతనాన్ని ఏ మాత్రం తగ్గించదు. ‘‘అనువు గాని చోట అధికుల మనరాదు/ కొంచెముండు / టన్న కొదువ గాదు / కొండ అద్దమందు కొంచెమై ఉండదా? విశ్వదాభిరామ వినుర వేమ.’’ పరిస్థితులు అనుకూలం గా లేనప్పుడు కొంచెం తగ్గి ఉండటం శ్రేయస్కరం. ఎవరో నన్ను గుర్తించి గౌరవించలేదు అనుకుని కుంగిపోవటం, గుర్తింపు కోసం పాకులాడటం దుఃఖానికి అవమానాలకి హేతువు లవుతాయి. కాస్త తల ఒగ్గి అనుకూల పరిస్థితులు వచ్చాక మళ్ళీ తల ఎత్తవచ్చు. సముద్రంలో అలలు ఎగసి ‘పడుతూ’ ఉంటాయి. ఎగిరితే ఆకాశంలో ఉండలేము కదా! కింద పడక తప్పదు. పడకుండా ఉండాలంటే ఎగరకూడదు. ఎదగాలి. ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే పైకి క్రమం గా ఎక్కాలి. పైగా ఎత్తుకి వెళ్ళిన కొద్ది మరింత జాగ్రత్తగా ఉండాలి. నేల మీద ఉన్నప్పుడు పడితే చిన్న దెబ్బ. ఎంత ఎత్తునుండి పడితే అంత పెద్ద దెబ్బ. అణకువ తో ఉన్న వారి మీద పెద్దలకి వాత్సల్యం ఉంటుంది. వారి ఆశీస్సులు, సహాయ సహకారాలు ఉంటాయి. ఎంత ఒదిగితే అంత ఎదుగుతారు. – డా‘‘ ఎన్.అనంతలక్ష్మి -
పనిలో ఉంటే మనసూ బాగుంటుంది
స్త్రీలకు రిటైర్మెంట్ వయసు వస్తే వారు మనుమల, మనమరాళ్ల బాగోగుల్లో పడాల్సి వస్తుంది. లేదా కొడుకు దగ్గరో కూతురు దగ్గరో ఉంటూ టీవీ చూస్తూ కాలక్షేపం చేయాల్సి ఉంటుంది. ‘కాని అలా ఉంటే బోర్. ఏదైనా ప్రయోజనకరమైన పని చేస్తే సంతోషంగా ఉంటుంది... మనసూ బాగుంటుంది’ అంటుంది అనంతలక్ష్మి. రిటైర్ అయ్యాక రైతుగా కూడా మారిన ఆమె పచ్చని పరిసరాల్లో ఉంటూ తనూ ఒక చెట్టులా నీడను పంచుతోంది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామానికి చెందిన కొమ్మినేని అనంతలక్ష్మి వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎంగా చేరి, సూపర్వైజర్గా తన సర్వీసునంతా గ్రామీణ ప్రాంతాల్లోనే చేసి రిటైర్ అయ్యింది. ఇద్దరు పిల్లలు. జీవితం చక్కగా ఒక ఒడ్డుకు చేరింది. ఇక ఏ పనీ చేయకుండా ఆమె కాలక్షేపం చేయవచ్చు. కాని ఆమె అలా ఉండలేకపోయింది. వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఏర్పడ్డ అనుబంధాలు వదులుకోలేకపోయింది. వారి కోసం పని చేస్తూనే ఉండాలని అనుకుంది. కష్టమనుకుంటే కుదరదు ‘ఎ.ఎన్.ఎమ్గా ఉద్యోగం అంటే పల్లె పల్లె తిరగాలి. నా పరిధిలో నాలుగూళ్లు ఉండేవి. వైద్య పరంగా ఎవరెలా ఉన్నారో కనుక్కుంటూ రోజంతా తిరుగుతూనే ఉండేదాన్ని’ అంటుంది అనంతలక్ష్మి. ‘ఆ రోజుల్లో కుటుంబ అవసరాలు తీరాలంటే నేనూ ఉద్యోగం చేయక తప్పని పరిస్థితులు. పిల్లలు చిన్నవాళ్లు. వాళ్లని వెంటేసుకుని ఊరూరు తిరిగిన రోజులూ ఉన్నాయి. కష్టం అనుకుంటే ఏ పనీ చేయలేం. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండటమే కాదు, మనకంటూ సొంత పని అంటూ ఉండాలి. ఎవరి మీదా ఆధారపడకూడదనే మనస్తత్వం నాది. ఎఎన్ఎమ్ నుంచి సూపర్వైజర్గా చేసి, రిటైర్ అయ్యాను’ అంటుందామె. ప్రయత్నాలు ఫలవంతం ‘పిల్లలిద్దరూ జీవితంలో స్థిరపడ్డారు. ఉద్యోగంలో రిటైర్మెంట్ వచ్చింది. పాతికేళ్లకు పైగా విధులు నిర్వర్తించిన దాన్ని. ఒక్కసారిగా ఖాళీగా ఇంట్లో కూర్చోవాలంటే ఇబ్బందిగానే అనిపించింది. కొన్ని రోజులు ఏం చేయాలో అర్థం కాలేదు. ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో కొద్దిపాటి పొలం ఉంది. రోజూ కాసేపు పొలం వద్దకు వెళ్లేదాన్ని. కూరగాయల సాగు, పండ్ల మొక్కలను నాటడం వంటి పనులు చేయడం మొదలుపెట్టాను. పల్లెలూ, పంటపొలాల్లో తిరుగుతున్నప్పుడు నా దృష్టి రైతులు చేసే పని మీద ఉండేది. నాకు తెలియకుండానే గమనింపు కూడా పెరిగింది. నేను కూరగాయలు, పండ్ల మొక్కల పెంపకం మొదలుపెట్టినప్పుడు నాకు మరో కొత్త జీవితం మొదలైనట్టనిపించింది. రెండేళ్లుగా వ్యవసాయంలో చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫలితమివ్వడం మొదలుపెట్టాయి. ఇంటికి వాడుకోగా, మిగిలిన వాటిని అవసరమైనవారికి ఇస్తూ వస్తున్నాను’ అందామె. మరవని సేవ.. ‘విశ్రాంత జీవనం వచ్చింది కదా అని చేసిన పనిని మర్చిపోలేం. అలాగే గ్రామాలవాళ్లు కూడా మర్చిపోరు. వారికి అవసరమైన వైద్య సేవలు అడుగుతూ ఉంటారు. నాకు అందరూ తెలుసు కాబట్టి నేనే స్వయంగా అడిగి తెలుసుకుంటుంటాను. వైద్యపరమైన ఏ చిన్న అవసరం వచ్చినా ముందుంటాను. ఊళ్లోనే వైద్య అవసరాలలో ఉన్నవారిని గమనించి, అవగాహన కల్పిస్తుంటాను. పొలంలో పండిన కూరగాయలు, పండ్లు రోడ్డు మీద ఓ వైపుగా పెట్టేస్తాను. అవసరమైన వాళ్లు ఆగి తీసుకెళుతుంటారు. కొందరు డబ్బిచ్చి తీసుకెళుతుంటారు. వీటితోపాటు ఈ మధ్య రెండు ఆవులతో పశు పోషణ కూడా మొదలుపెట్టాను. మట్టి పనిలో సంతోషాన్ని, నలుగురికి మేలు చేయడంలో సంతృప్తిని పొందుతున్నాను. పనిలో ఉంటే మనసూ బాగుంటుంది. ఆ పనిని నలుగురు మెచ్చుకుంటే మరింత ఉత్సాహం వస్తుంది. మలివయసులో నలుగురికి మేలు చేసే పనులను ఎంచుకుంటే జీవితంలో ఏ చీకూ చింత లేకుండా గడిచిపోతుందని నా జీవితమే నాకు నేర్పించింది’ అని వివరించింది అనంతలక్ష్మి. విశ్రాంత జీవనం వచ్చింది కదా అని చేసిన పనిని మర్చిపోలేం. అలాగే గ్రామాలవాళ్లు కూడా మర్చిపోరు. వారికి అవసరమైన వైద్యసేవలు అడుగుతూ ఉంటారు. నాకు అందరూ తెలుసు కాబట్టి నేనే స్వయంగా అడిగి తెలుసుకుంటుంటాను. వైద్యపరమైన ఏ చిన్న అవసరం వచ్చినా ముందుంటాను. – సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి -
ప్రభుత్వ పరిశీలనలో కాపుల సమస్య
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనంత లక్ష్మి మద్దతు తెలపాలని ఆమెను కోరిన ముద్రగడ, కాపు జేఏసీ కాకినాడ రూరల్ : కాపులను బీసీల్లో చేర్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, కాపుల పట్ల టీడీపీకి ఎప్పుడూ మంచి అభిప్రాయమే ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని తప్పకుండా అమలు చేస్తారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అన్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో కలసి కాపు జాయింట్ యాక్షన్ కమిటీ ఎమ్మెల్యే అనంతలక్ష్మిని బుధవారం సాయంత్రం వలసపాకలలోని ఆమె క్యాంప్ కార్యాలయంలో కలిసింది. కాపుల ఉద్యమానికి మద్దతు తెలిపాలని వారు కోరడంతో ఆమె పైవిధంగా స్పందించారు. ఇప్పటికే కాపునేతలంతా ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రం అందించారని, తాను కూడా మరోసారి ప్రజాప్రతినిధులను కలిసి కాపులను బీసీల్లో కలిపే అంశాన్ని వివరిస్తున్నట్టు ముద్రగడ తెలిపారు. దీనిపై అనంతలక్ష్మి స్పందిస్తూ కాపులను బీసీల్లో కలిపేందుకు జిల్లాలోని 19 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఉన్నారన్నారు. ఈ విషయమై తామంతా కలసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పామన్నారు. మరోసారి ఎమ్మెల్యేలంతా ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.కాపు జేఏసీ ప్రతినిధులు వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, బస్వా ప్రభాకరరావు, జానపాముల నాగబాబులతో పాటు అనేక మంది కాపు ప్రతినిధులు ఎమ్మెల్యే అనంతలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. -
పౌరో‘షి’త్యం
స్టీమర్రోడ్డు (నరసాపురం) : పౌరోహిత్యం పురుషులకే సొంతం అనే మాట ఇక చెల్లదు. మహిళలు కూడా వేదమంత్రాలతో భగవదారాధనలో ముందుంటున్నారు. భక్తులకు భగవంతునికి అనుసంధానంగా ఉంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని స్టీమర్రోడ్డుకి చెందిన మహిళామణి చిలకమర్తి అనంతలక్ష్మి ఈ రెండో కోవకే చెందుతారు. లలితాంబఘాట్లోని లలితాంబదేవిని దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తులకు సమంత్రికంగా శఠగోపం పెడుతుంటారు. ఆమె తండ్రి లక్ష్మీనారాయణ కూడా పురోహితులుగా వ్యవహరించేవారు.