విపరీత పరిణామాలు
‘లాహిరి లాహిరి లాహిరిలో’ఫేం ఆదిత్య ఓం నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘ఫన్ ఫ్రీక్డ్ ఫేస్బుక్’. ఈ చిత్రం ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. సాగరిక చెత్రి, జల్ చిత్ర, శీతల సింగ్, అంచిత్కౌర్ తదితరులు ఇందులో ప్రధాన పాత్రధారులు. హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి ఆదిత్య ఓం మాట్లాడుతూ -‘‘సామాజిక మాధ్యమానికి యువతరం ఏ రీతిగా బానిసలవుతున్నారు? పర్యవసానంగా ఎలాంటి విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని చెప్పారు. 20 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌ని హైదరాబాద్, వైజాగుల్లో పూర్తి చేస్తామని నిర్మాణ నిర్వాహకులు పి.విజయ్‌వర్మ తెలిపారు.