మలేరియా జ్వరంతో మహిళ మృతి
నల్గొండ జిల్లా రామన్నపేట మండలం జనంపెల్లిలో ఓ మహిళ మలేరియా జ్వరంతో మృతి చెందింది. గ్రామానికి చెందిన వరికుప్పల ఆండాలు(53) గురువారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే.. జనవరి 31న ఇదే కుటుంబానికి చెందిన రామ చంద్ర అనే వ్యక్తి సైతం మలేరియా జర్వంతోనే మృతి చెందారు. వారం రోజుల్లోనే ఇద్దరు కుటుంబ సభ్యులు మృతి చెందడంతో.. గ్రామంలో విషాదం నెల కొంది.