Andhra Pradesh local body polls
-
పేకమేడలా కూలిపోయిన కంచుకోట!
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్ఠా త్మకంగా జరిగిన ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీని ప్రథమంగా చెప్పవచ్చు. కుప్పం ఎన్నికల తీర్పు కోసం 17వ తారీఖున దేశం మొత్తంగా ఎదురుచూసింది. కారణం ఇది చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. దాదాపు 32 ఏళ్లుగా కుప్పం చంద్రబాబు అడ్డాగా, ఆయన కంచుకోటగా చెబుతూ వచ్చారు. 1983లో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఘోర ఓటమి చవిచూశారు. తరువాత ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి తన జన్మస్థలమైన చంద్రగిరి నియోజకవర్గాన్ని కాదని చిత్తూరు జిల్లా ఆఖరులో, కర్ణాటక – తమిళనాడు సరిహద్దులో ఉన్న కుప్పం నియోజకవర్గం నుంచి 1989లో మొదటిసారి గెలుపు సాధించాడు. ఈయన విజయ యాత్రకు వైఎస్సార్ సీపీ 2019 నుండి బ్రేకులు వేసింది. జగన్ పార్టీ వచ్చాక సంక్షేమ ఫలాలు ఇంటింటికీ అందడంతో ప్రజల్లో ఎనలేని చైతన్యం వచ్చింది. తెలుగుదేశం పార్టీ నాయకులకు తప్ప చంద్రబాబు వల్ల తమకు ఎలాంటి మేలు జరగలేదని గ్రహించారు. ఏడెనిమిది సార్లు వరుస విజయాలతో చంద్రబాబుకు కుప్పం ప్రజలను బాగు చేయాలన్న బుద్ధి మాత్రం పెరగలేదు. ఇన్నేళ్లుగా చంద్రబాబు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకపోవడంతో ఇప్పటికీ 50 వేలమంది పేదలు పొరుగు రాష్ట్రానికి వలస వెళుతుంటారు. ఈరోజు కుప్పం ప్రజల హృదయంలో చంద్రబాబు పటం పూర్తిగా చెరిగిపోయింది. దీంతోనే చంద్రబాబు చక్రం రివర్స్ ఆరంభం అయింది. మొన్న జరిగిన మండల ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు పార్టీకి పెద్ద గండే కొట్టారు. జగన్ పార్టీ 70 శాతం పైగా సీట్లను గెలుచుకొని చంద్రబాబుకు కనువిప్పు కలిగించింది. ఈనెల 14న జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, లేకుంటే కుప్పంపై తాను పట్టు కోల్పోతానని బాబు బృహత్తర పథకం రూపొం దించారు. అక్టోబర్ 29, 30 తారీఖులలో కుప్పంలో పర్యటించారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. సెంటిమెంట్లు కూడా తీసుకొచ్చారు. చివరికి ఒక వీధి రౌడీలా మీసం తిప్పే మాటలు కూడా చెప్పారు. కుప్పం ప్రజలే నాకు దేవుళ్ళు అన్నారు. తన అడ్డాలో మరొకరికి చోటే లేదన్నారు. రాజకీయాల్లో తన సమకాలికుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పట్టుకుని అనరాని మాటలు అన్నారు. ఆ మాటలతో కుప్పం ప్రజలు నివ్వెరపోయారు. 2019 ఎన్నికల్లో ఏ నాయకులపైన ప్రజలు తిరగబడ్డారో ఆ టీడీపీ నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో చక్రం తిప్పారు. వీరి కుట్రలు, మోసాలను తెలిసిన కుప్పం ఓటర్లు ఫలితాల్లో తెలుగుదేశం నడ్డి విరిచారు. ఏ నాయకుడికైనా కావాల్సింది ప్రజల విశ్వాసం అది కోల్పోయినవాడు నాయకుడే కాదు. ఉత్తుత్తి మాటలతో, శూన్య హస్తాలతో ఎవరూ అన్ని వేళలా ప్రజలను మోసం చేయలేరు. కొంతకాలమే అందరినీ మోసం చేయగలరు. వయసు పెరిగేకొద్దీ చంద్రబాబు ఎందుకో ప్రజల అవి శ్వాసం పూర్తిగా కోల్పోతున్నారు. కారణాలు ఇప్పటికీ ఆయన విశ్లేషించుకోవడం లేదు. పచ్చ పత్రికలు ఉన్నాయి కదా అని అవాకులు చవాకులు మాట్లాడి సంబరపడకూడదు. నానాయాగీ చేసినంత మాత్రాన విజయం వరించదని కుప్పం తీర్పే తెలుపుతున్నది. తెలుగుదేశం పార్టీ ఎంతో రచ్చ చేసింది. చివరికి కోర్టు తలుపులు కూడా తట్టి కౌంటింగ్‌కు అబ్జర్వర్‌ను పెట్టేలా చేశారు. ఎన్ని విమర్శలు చేసినా, కోర్టులు చెప్పినా ప్రజలు మాత్రం ‘జై జగన్’ అన్నారు. కుప్పంలో వైఎస్సార్సీపీ గెలుపును చంద్రబాబు కలలో కూడా ఊహించలేదు. తెలుగుదేశం కేవలం ఆరు స్థానాలలో గెలిచి, చావుతప్పి కన్నులొట్టపోయినట్లు అయింది. చంద్రబాబు కలల కంచుకోట పేకమేడలా కూలిపోయింది. కుప్పం విజయం పూర్తిగా ఇద్దరికీ చెందుతుంది. ఒకరు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, మరొకరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నవరత్నాల పథకాల ద్వారా కుప్పంలోని ప్రతి వ్యక్తి మనసును జగన్ గెలుచుకున్నారు. ఇక ప్రజలను పోలింగ్ స్టేషన్ల వైపు పరుగులెత్తించిన ఘనత పెద్దిరెడ్డిదే. కుప్పంలో ఎక్కువ శాతం మంది పేద, వెనుకబడిన వర్గాలకు చెందిన వారే. కుప్పం పట్టణంలోని ప్రతి ఇంటికి జగన్ ఫలాలు అందాయి. ఎక్కడున్నా, ఏ ఇంట్లో వున్నా, పింఛన్లుగానీ, రైతు భరోసా డబ్బులు కానీ కరెక్ట్‌గా అందడంతో కుప్పం ప్రజల్లో జగన్ పార్టీపై విశ్వాసాన్ని మరింత పెంచింది. రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. చంద్రబాబు ఇంతకాలం కుప్పంలో హాయిగా గుర్రపు స్వారీ చేస్తూ వచ్చారు. ఆయన గుర్రం అలసి సొలసి చెక్క గుర్రంగా మారి చతికిలపడింది. చంద్రబాబు తన తప్పులు తాను తెలుసుకోకుండా జగన్‌ని తిట్టడమే ప్రధానంగా పెట్టుకోవడం చాలా తప్పు. గెలిస్తే తమ సామర్థ్యం, ఓడితే ఎదుటివారి దౌర్జన్యం, గూండాగిరి అని చెప్పడం ఏ పార్టీకైనా తగదు. జగన్ అధికారం చేపట్టి 30 నెలలు అవుతున్నది. ఇప్పటికైనా తెలుగుదేశం ఆత్మపరిశీలన చేసుకోవడం లేదు. మూస ధోరణిలో వెళితే ఆ పార్టీకి నూకలు చెల్లినట్లే. కుప్పం ప్రజలకు చంద్రబాబు దూరమై, తాగునీరు, కనీస అభివృద్ధి కూడా చేయక, హంద్రీ–నీవా నీళ్లు తెప్పిస్తానన్న మాట వమ్ముచేసి ప్రజల్లో తన స్థానాన్ని కోల్పోయారు. వైఎస్ జగన్ 2019లానే జనం హృదయాల్లో ఇప్పటికీ నిలిచి ఉన్నారు. ‘ప్రజలే దేవుళ్ళు’ అని ఎన్టీఆర్ ప్రతి సభలో చెప్పేవారు. ఆ మాటల్ని పూర్తిగా నిజం చేస్తున్న వ్యక్తి జగన్. పెద్దిరెడ్డి కుప్పంలో వైసీపీ జెండా ఎగరేసి చంద్రబాబు కుంభస్థలాన్ని కొట్టారు. దీంతో చంద్రబాబు నిర్మించుకున్న సామ్రాజ్యం పేకమేడలా కూలిపోయింది. ఓటమిని తెలుగుదేశం పార్టీ సమగ్రంగా విశ్లేషణ చేసుకోవడం మాని మాకు 13 శాతం ఓట్లు పెరిగాయి అని డంబాలు పలకడం వారికే నష్టం. ఓట్ల శాతాలు చర్చలకు పనికొస్తాయి తప్ప ప్రజలకు ఉపయోగపడవు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థలను మేనేజ్ చేయడంతోనో, పచ్చపత్రికల ప్రచారంతో సంబరపడటమో మాని ప్రజల్లోకెళ్లి వాళ్లతో మమేకమై హృదయాన్ని చూరగొనాలి. డాక్టర్ విజయ్ కుమార్ వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త -
జనసేన నేత బైండోవర్
సాక్షి, అనంతపురం: జనసేన పార్టీ నాయకుడు, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన గుప్తాను బైండోవర్ చేశారు. 21, 23న జరిగే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ముందస్తు చర్యల్లో భాగంగా గుంతకల్లు మధుసూదన్ గుప్తాని శుక్రవారం పోలీసులు బైండోవర్ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గుత్తి పట్టణం కర్నూలు రోడ్డులోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన మధుసూదన్ గుప్తా ఈవీఎంను పగులగొట్టారు. అప్పడు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు గుత్తి పోలీసులు పాత కేసులో ఉన్న మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌ని బైండోవర్ చేశారు. రూ.లక్ష సొంత పూచికత్తు తీసుకుని తహసీల్దార్ బ్రహ్మయ్య ఎదుట బైండోవర్ చేశారు. (చదవండి: ఇది ఫెవికాల్ బంధం) కాగా, గత ఎన్నికలకు ముందు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, ఆయన కుమారుడిని ఉద్దేశించి మధుసూదన గుప్తా తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘మర్డర్లు చేయడం నాకు కొత్తకాదు, గతంలో టీడీపీ వారి ఆస్తులు, ఆడవాళ్ల జోలికి వచ్చానంటే అది రాజకీయంలో భాగమేన’ని వ్యాఖ్యానించి కలకలం రేపారు. (వెంటాడి కత్తులతో నరికిన జనసేన కార్యకర్తలు) పలువురి నామినేషన్ల తిరస్కరణ జెడ్పీటీసీ నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ)లో రెండేసి సెట్లు వేసిన అభ్యర్థులకు సంబంధించి ఒక సెట్టును తిరస్కరించారు. అలాగే వివిధ కారణాల వల్ల మరో 8 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. 1995 తర్వాత మూడో సంతానం కల్గిన కారణంగా కదిరి ఇండిపెండెంట్ అభ్యర్థి ఎం.కమలాబాయి నామినేషన్‌ను, కుల ధ్రువీకరణ పత్రం జత చేయని కారణంగా విడపనకల్లు వైఎస్సార్సీపీ తరుఫున దాఖలు చేసిన మేకల పంపాపతి నామినేషన్‌ను, డిక్లరేషన్‌లో అభ్యర్థి సంతకం చేయని కారణంగా అగళి బీజేపీ అభ్యర్థి ఇ.చిక్కప్ప నామినేషన్‌ను, అనంతపురం నగరంలో ఓటరుగా నమోదైన కారణంగా గోరంట్ల బీజేపీ అభ్యర్థి కె.భాస్కర్ నాయక్ నామినేషన్‌ను తిరస్కరించారు. కాగా, తిరస్కరణకు గురైన నామినేషన్లకు సంబంధించి తనకల్లు అభ్యర్థి వై. ఈశ్వరమ్మ, రొళ్ల అభ్యర్థి ఎస్.గౌడప్ప, పరిగి అభ్యర్థి కె.లక్ష్మీదేవమ్మ శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి వద్ద అప్పీలు చేసుకున్నారు. నేటితో నామినేషన్ల ఉపసంహరణ పూర్తి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల నామినేషన్ల అంకం తుదిదశకు చేరుకుంది. శనివారం నామినేషన్ల ఉపసంహరణతో ఈ ప్రక్రియ ముగుస్తుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. కాగా గురువారం రాత్రి 428 మంది నామినేషన్లు ఆమోదం పొందినట్లు తెలిపిన జెడ్పీ అధికారులు శుక్రవారం ఉదయానికి 409 నామినేషన్లను ధ్రువీకరించారు. ఇందులో 9 బీఎస్పీ, 40 బీజేపీ, సీపీఐ 5, సీపీఎం 7, కాంగ్రెస్ 33, వైఎస్సార్సీపీ 138, టీడీపీ 132, జనసేన 16, ఇండిపెండెంట్లు 29 నామినేషన్లు ఉన్నాయి. -
‘స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం’
సాక్షి, విజయవాడ : స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన విజయవాడలో ‘ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల ప్రక్రియ’పై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్దతిలో పారదర్శకంగా జరుపుతామన్నారు. ఎన్నికలు జరపడానికి పూర్తి సంసిద్ధతతో ఉన్నామని తెలిపారు. (చదవండి : 21.. 24.. 27న స్థానిక ఎన్నికలు?) ఎన్నికల విషయంపై శుక్రవారం జిల్లా అధికారుల, ఎస్పీలు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమవుతామని తెలిపారు. పార్టీల సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో లక్షా ఇరవై వేల బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని, మరో 40 వేల బాక్సులు తెలంగాణ నుంచి తీసుకుంటామని చెప్పారు. టెక్నాలజీని ఉపయోగించి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ రమేష్ పేర్కొన్నారు. -
కౌన్సిలర్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి నామినేషన్
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని పేర్కొన్న మున్సిపల్ మాజీ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అనూహ్యంగా సోమవారం తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలోని 18, 34 వార్డులకు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజు చివరి నిమిషంలో తన అనుచరులతో వచ్చి టీడీపీ తరపున నామినేషన్లు వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వార్డుల్లో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా బెదిరించేందుకే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఈ ఎత్తు వేశారనే చర్చ జరుగుతోంది. ఈ రెండు వార్డుల్లో ఏదో ఒక వార్డు నుంచి ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి లేదా కుటుంబ సభ్యుల్లో ఒకరిని పోటీ చేయించనున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిపించి.. జేసీ తన నామినేషన్లు ఉపసంహరించుకుంటారని సమాచారం. తొలి రోజు 11 నామినేషన్లు అనంతపురం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోసం సోమవారం 11 నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక కార్పొరేషన్, 11 మునిసిపాలిటీల పరిధిలోని 373 వార్డులు ఉన్నాయి. మొదటి రోజున సోమవారం అనంతపురం కార్పొరేషన్, ఐదు మునిసిపాలిటీల్లో 11 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో వైఎస్ఆర్సీపీ తరఫున నాలుగు, టీడీపీ తరఫున 7 నామినేషన్లు వచ్చాయి.