Andole Assembly Constituency
-
అందోల్ కోటలో గెలుపెవరిది..? తీవ్రంగా శ్రమిస్తున్న ప్రధాన పార్టీలు!
సాక్షి, మెదక్: రాష్ట్ర రాజకీయాల్లో ‘అందోలు’ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి గెలుపొందిన మెజార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రులయ్యారు. 1952లో అందోల్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 16 సార్లు ఎన్నికలు జరిగితే రెండు సార్లు మాత్రమే స్థానిక ఎమ్మెల్యేలు గెలుపొందగా, మిగితా వాటిలో స్థానికేతరులు గెలుపొందారు. మొత్తంగా తొమ్మిది సార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు టీడీపీ, బీఆర్ఎస్ రెండు సార్లు, ఒకసారి ఇంటిపెండింట్ గెలుపొందాయి. 1952 నుంచి 1967 వరకు జనరల్ క్యాటగిరీ ఉండగా, 1967 నుంచి అందోల్ నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వు చేశారు. రిజర్వుడు నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత 12 సార్లు జరిగిన ఎన్నికల్లో రాజనర్సింహ కుటుంబ సభ్యులే ఆరుసార్లు ఎన్నికయ్యారు. 1985, 1994 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి మల్యాల రాజయ్య గెలుపొందగా ఆ ర్థిక, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖలను నిర్వహించాడు. బాబూ మోహన్ 1998 ఉప ఎన్నిక , 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలుపొంది కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. 1989, 2004, 2009 ఎన్నికల్లో దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి మూడుసార్లు గెలుపొంది. మార్కెట్, వ్యవసాయ, విద్య, ఉప ముఖ్యమంత్రి పదవులను పొందాడు. అలాగే, ఓపెన్ కేటగిరి సమయంలో జోగిపేటకు చెందిన వ్యక్తి వైశ్యుడైన బస్వ మాణయ్య స్థానిక మొదటి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఆ తర్వాత 14 సార్లు ఎన్నికలు జరుగగా స్థానికేతరులే గెలుపొందారు. 1967లో రిజర్వుడు తర్వాత స్థానికులకు పోటీ చేసేందుకు అవకాశాలు లభించలేదు. 2018 ఎన్నికల నాటికి స్థానిక నినాదం బలపడింది. దీంతో ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో వట్పల్లి మండలంలోని పోతులబోగుడాకు చెందిన చంటి క్రాంతికిరణ్ విజయం సాధించడంతో రెండోసారి ఎమ్మెల్యే వ్యక్తి గెలిచారు. అందోలు ఎమ్మెల్యేలు.. 1952 వెంకట రాజేశ్వర జ్యోషి (కాంగ్రెస్) 1957 బస్వ మాణయ్య (స్వతంత్ర) 1962 ఎస్.లక్ష్మిదేవి (కాంగ్రెస్) 1967 రాజనర్సింహ (కాంగ్రెస్) 1972 రాజనర్సింహ (కాంగ్రెస్) 1978 రాజనర్సింహ (కాంగ్రెస్) 1983 హెచ్.లక్ష్మణ్ జీ (కాంగ్రెస్) 1985 మల్యాల రాజయ్య (టీడీపీ) 1989 దామోదర్ (కాంగ్రెస్) 1994 మల్యాల రాజయ్య (టీడీపీ) 1998 పి.బాబుమోహన్ (టీడీపీ) 1999 పి.బాబుమోహన్ (టీడీపీ) 2004 దామోదర (కాంగ్రెస్) 2009 దామోదర (కాంగ్రెస్) 2014 బాబుమోహన్ (టీఆర్ఎస్) 2018 చంటి క్రాంతికిరణ్ (టీఆర్ఎస్) ఇవి చదవండి: తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డి : మంత్రి హరీశ్‌రావు -
ఆయనంతే అదో టైపు.. మౌనం వెనుక వ్యూహం ఏంటి?
ఆయనంటేనే అదో టైపు.. అందులో సీనియర్... ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నేత.. మీడియా ముందే బాహాటంగానే కాంగ్రెస్‌లో కోవర్టులు ఉన్నారని పార్టీలో నెలగడం కష్టమని ఆరోపించారు.. కానీ ఇప్పుడు ఆ నేత ఇంట్లో నుంచే ఒకే నియోజకవర్గానికి... రెండు దరఖాస్తులు చేసుకున్నారు.. దీంతో టికెట్ తండ్రికి వస్తుందా, కూతురును వరిస్తుందా అంటూ పార్టీ క్యాడర్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతకు ఒకింట్లో రెండు టికెట్ల పంచాయతీ ఏంటి? సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ స్థానం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అందోల్ నుండి ఐదు సార్లు పోటీ చేయగా మూడు సార్లు విజయం సాధించారు. దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్లో వ్యవసాయ, మార్కెట్, ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగా ఉప ముఖ్యమంత్రిగా దామోదర రాజనర్సింహను హైకమాండ్ నియమించింది. ప్రజలు ఆయనను మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆదరించిన.. తెలంగాణ రాష్టం ఏర్పడినప్పటి నుంచి ఆయనకు రాజకీయాలు కలిసిరావడం లేదు. ఈ సారి ఎలాగైనా గెలవలన్నా పంతంతో పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపుతూ దామోదర రాజనర్సింహ కూతురు త్రిష.. నియోజకవర్గంలో పల్లె బాట కార్యక్రమాన్ని చేపట్టి కాంగ్రెస్ కార్యకర్తల్లో భరోసానిస్తూ నూతన ఉత్సహన్ని కల్గిస్తుంది. అయితే ఇటీవల గాంధీభవన్‌లో అందోల్ సీటు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా తండ్రి, కూతురు ఇద్దరూ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అందోల్ కాంగ్రెస్ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. గత కొంతకాలం నుంచి త్రిష అందోల్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించి నియోజకవర్గంలో జరుగుతున్న పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో రోజుకు ఒక గ్రామం చొప్పున పల్లెబాట పేరుతో ప్రజలకు దగ్గరవుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎన్నికల క్యాంపెనింగ్ మొదలుపెట్టారు. అయితే దామోదర రాజనర్సింహ మాత్రం నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలకు కూడా ఆయన హాజరు కాలేకపోతుండడంతో కాంగ్రెస్ శ్రేణులు కొంత అయోమయానికి లోనవుతున్నారు. రాజనర్సింహకు కాంగ్రెస్ అధిష్టానం జాతీయ సీడబ్ల్యుసీ శాశ్వత పదవి కట్ట బెట్టడంతో కార్యకర్తల్లో కొంత ఉత్సాహం నింపిన.. ఆయన ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమం చేపట్టకపోవడం, నియోజక వర్గం వైపు కన్నెత్తి చూడకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ముక్కునవేలేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ టికెట్లు ప్రకటించక ముందు అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. అంతే కాదు జహీరాబాద్ ఎస్సీ రిజర్వుడ్ స్థానం కావడంతో దామోదర రాజనర్సింహ అక్కడి నుండి పోటీ చేస్తారన్న వినికిడి కూడా జోరుగా వినిపించింది. ఏది ఏమైనా దామోదర రాజనర్సింహ మౌనం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అందోల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా దామోదర రాజనర్సింహ బరిలో ఉంటారా, కూతురు త్రిష బరిలో ఉంటారా అన్న సందిగ్ధం కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రస్తుతం నెలకొంది. చదవండి: ‘గులాబీ’ వనంలో మౌనరాగం!.. ఏం జరుగుతోంది? -
అందోల్‌లో వేడెక్కుతున్న రాజకీయం.. వ్యూహాలు ఫలించేనా?
తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన 2014 మొదటి సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి బాబుమోహన్ కాంగ్రెస్ అభ్యర్థి అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహపై విజయం సాధించడం జరిగింది. 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ ఆభ్యర్థిగా జర్నలిస్ట్ నాయకుడు మలిదశ ఉద్యమకారుడు చంటి క్రాంతి కిరణ్ కాంగ్రెస్ అభ్యర్ధి దామోదర రాజనర్సింహపై విజయం సాధించారు. ఈ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి అయితే విజయం సాధిస్తారో అదే పార్టీ ప్రభుత్వం చేపడుతోంది. వేడెక్కుతున్న రాజకీయం.. అధికార పార్టీలో పోటీలు! రోజు రోజుకు అందోల్‌లో రాజకీయం వేడెక్కింది. పోటీలో ఉండే నాయకులు టికెట్ల కోసం వారి, వారి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు, మాజీ డిప్యూటి సిఎం దామోదర్ రాజనర్సింహ పేరు ఖరారు అయినట్టు తెలుస్తుంది. ఇక బీజేపీ నుంచి గత ఎన్నికల్లో మాజీ మంత్రి బాబూమోహన్ బరిలో నిలిచారు. ఈ సారి ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కమలంలో కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇక అధికార పార్టీలో ఈసారి సిట్టింగ్‌లకే టికెటు దక్కడంతో మరోసారి అందోల్ నుంచి క్రాంతి కిరణ్ పోటీకి సై అంటున్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : నిరుద్యోగ సమస్య గ్రామీణ రోడ్ల సమస్య రైతులు పండించిన పంటలకు మద్దత్తు ధర లేకపోవడం పీజీ కళాశాలలో మౌళిక వసతుల లేమి మున్సిపల్‌కు సొంత భవనం లేకపోవడం రాజకీయ పార్టీల ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు: బీఆర్ఎస్ చంటి క్రాంతి కిరణ్ (సిట్టింగ్ ఎమ్మెల్యే) కాంగ్రెస్ పార్టీ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ బీజేపీ మాజీ మంత్రి పల్లి బాబుమోహన్ జిల్లా మాజీ జెడ్పి చైర్మన్ బాలయ్య టికెట్ రేసులో ఉన్నారు. వృత్తి పరంగా ఓటర్లు: నియోజకవర్గంలో ప్రధానంగా ఎక్కువ మంది ప్రజలు రైతాంగంపైనే ఆధారపడి ఉన్నారు. కొంత శాతం మంది వ్యాపారంపై ఆధారపడి ఉన్నారు. వ్యాపార పరంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో జోగిపేట మున్సిపాలిటీ ముందంజలో ఉంది. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు నదులు: మంజీరా అత్యంత కీలకమైనది. మంజీరా నదిపై సింగూరు జలాశయం 30 టీఎంసీల కెపాసిటీతో నిర్మించిన ప్రాజెక్టు జంట నగరాల దాహార్తి తిరుస్తూ సంగారెడ్డి మెదక్ జిల్లాల రైతులకు సాగునీటి అవసరాలు తిరుస్తుంది. ఒక్క అందోలు నియోజకవర్గంలో ఎడమ కాలువ ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. సింగూరు పర్యాటక కేంద్రంగా విరజిల్లుతుంది. ఆలయాలు: ఉత్తర తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంగా పేరుగాంచిన అందోలు మండలంలోని కిచ్చన్నపల్లిలో దేవాలయం కలదు. అల్లాదుర్గం మండల కేంద్రంలో రేణుక ఎల్లమ్మ దేవాలయం అదే విధంగా అక్కడే బేతాళ స్వామి ఆలయం అత్యంత ప్రతిష్ట గాంచినవి. నియోజకవర్గంలోని ఆసక్తికర అంశాలు : ఇప్పటి వరకు అందోలు నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరగగా మొదటి సారి జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి జోగిపేటకు చెందిన బసవ మామయ్య విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సార్లు విజయం సాధించగా టీడీపీ నాలుగు సార్లు విజయం సాధించింది. తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక బీఆర్ఎస్ రెండు సార్లు విజయం సాధించింది. రాజకీయానికి సంబంధించి ఇతర అంశాలు : 1957 లో మొదటిసారిగా ఏర్పడిన అందోలు నియోజకవర్గం మొదటి రెండు పర్యయాలు జనరల్ స్థానంగా ఉండి 1967 లో ఎస్సి రీజర్వు స్థానంగా ఏర్పడింది. 1957 లో జోగిపేటకు చెందిన ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు బసవ మనయ్య కాంగ్రెస్ అభ్యర్ధి రూక్ ఎండి.రూక్ మోద్దీన్ పై విజయం సాధించడం జరిగింది. 1962 లో లక్షిదేవి గారు కాంగ్రెస్ పార్టీ తరుపున స్వతంత్ర అభ్యర్థి బసవ మణయ్య పై విజయం సాధించారు. 1967 లో ఎస్సి రిజర్వుడ్ గా ఏర్పడిన తరువాత సిరారపు రాజనర్సింహ కాంగ్రెస్ పార్టీ తరుపున స్వతంత్ర అభ్యర్థి ఈశ్వరప్ప పై విజయం సాధించారు. 1972 లో రాజనర్సింహ కాంగ్రెస్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థి లక్మన్ కుమార్ పై విజయం సాధించారు. 1978 లో మరో మారు రాజనర్సింహ ఎమ్మెల్యేగా విజయం సాధించారు 1983 లో టిడిపి తరుపున ఆల్ దేకర్ లక్మన్ జి ఈశ్వరి భాయ్ పై విజయం సాధించడం జరిగింది 1985 లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున మాల్యాల రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థి రాజనర్సింహ పై గెలుపొందడం జరిగింది. 1989 లో కాంగ్రెస్ పార్టీ తరువున దామోదర రాజనర్సింహ పోటి చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాల్యాల రాజయ్య పై విజయం సాదించారు. 1994 లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాల్యాల రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ పై గెలుపొందారు. 1998 లో అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కొనసాగుతున్న మాల్యాల రాజయ్య సిద్ధిపేట ఎంపీగా గెలుపొందడంతో జరిగిన బై ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గా సినీ యాక్టర్ బాబుమోహాన్ గెలుపొందారు. 1999 లో జనరల్ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాబుమోహన్ కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ పై మరోమారు గెలుపొందడం జరిగింది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ తెలుగుదేశం అభ్యర్థి బాబుమోహన్ పై రెండు సార్లు వరుసగా విజయం సాధించి ప్రాథమిక ఉన్న విద్యాశాఖలతో ఉప ముఖ్యమంత్రి గా కావడం జరిగింది. -
ఆందోల్ (ఎస్సి) నియోజకవర్గంని పరిపాలించే అభ్యర్థి ఎవరు?
ఆందోల్ (ఎస్సి) నియోజకవర్గం ఆందోల్ రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన జర్నలిస్టు క్రాంతి కిరణ్ తొలిసారి విజయం సాధించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ ఉప ముఖ్య మంత్రి దామోదర రాజ నరసింహపై 16851 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. క్రాంతికిరణ్‌కు 104229 ఓట్లు రాగా, దామోదర రాజనరసింహకు 87378 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ గతంలో టిఆర్ఎస్ తరపున గెలిచిన ప్రముఖ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ 2018లో బిజెపి పక్షాన పోటీచేసి ఓటమి చెందారు. కేవలం 2350 ఓట్లు మాత్రమే తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయారు. 2014లో దామోదర రాజనరసింహ ఓటమి చెందారు. ఆయనపై టిఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి బాబూ మోహన్ 3291 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. బాబూ మోహన్ 2014లో ఎన్నికలకు కొద్ది రోజుల ముందే టిడిపి నుంచి టిఆర్ఎస్లో చేరారు. బాబూమోహన్ 2014లో గెలవడంతో మూడోసారి గెలిచినట్లయింది. ఈ నియోజకవర్గానికి మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి తొమ్మిది సార్లు, టిడిపి నాలుగుసార్లు టిఆర్ఎస్ రెండుసార్లు గెలిచాయి. ఒకసారి ఇండిపెండెంటు నెగ్గారు. దామోదర రాజనరసింహ గతంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గాలలో సభ్యుడిగా ఉన్నారు. కిరణ్ ముఖ్యమంత్రి అయిన కొంతకాలానికి దామోదర రాజనరసింహ ఉప ముఖ్యమంత్రిగా ప్రమోషన్ పొందారు. ఈయన తండ్రి రాజనరసింహ కాసు, పి.వి. అంజయ్యల మంత్రివర్గాలలో పనిచేసారు. తండ్రి, కొడుకులు ఇద్దరూ మంత్రులైన ఘనత వీరికి దక్కింది. వీరిద్దరూ కలిసి ఏడుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. దామోదర అందోల్‌లో మూడుసార్లు, ఈయన తండ్రి రాజనరసింహ ఇక్కడ మూడుసార్లు, సదాశివపేటలో ఒకసారి మొత్తం నాలుగుసార్లు గెలిచారు. ఇక్కడ నుంచి గెలుపొందిన మరో ఇద్దరు కూడా మంత్రులయ్యారు. టిడిపి తరుఫున గెలిచిన రాజయ్య గతంలో ఎన్.టి.ఆర్, చంద్రబాబుల క్యాబినెట్లలో పనిచేసారు. 1998, 1999లలో సిద్దిపేట నుంచి లోక్‌సభకు కూడా రాజయ్య ఎన్నికయ్యారు. 1998లో లోక్‌సభకు ఎన్నికైన కారణంగా ఆందోల్ సీటుకు రాజీనామా చేయగా, జరిగిన ఉప ఎన్నికలో సినీనటుడు బాబూమోహన్ గెలుపొందారు. ఆయన తిరిగి 1999లో కూడా గెలిచి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. 2014లో టిఆర్ఎస్ పక్షాన గెలిచి, 2018లో బిజెపి నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆందోల్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..