Angelina
-
హీరోయిన్ ఆ టాటూను చెరిపేస్తోంది!
సెలబ్రిటీలు అభిమానుల నిఘాకళ్లను తప్పించుకోవడం కొచెం కష్టమే. ప్రేమలో మునిగితేలుతున్న సమయంలో వారు ఒంటిపై వేసుకునే టాటూలపై అభిమానులు కన్ను సహజంగానే ఉంటుంది. అయితే ఇలాంటి జంటలు విడిపోయాక చెరిపేసుకునే టాటూలను సైతం అభిమానులు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అభిమానుల కళ్లు హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలినా జోలీ టాటూపై పడ్డాయి. భర్త బ్రాడ్ పిట్తో తన అనుబంధానికి గుర్తుగా గతంలో టాటూ వేయించుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు మా ఇద్దరికీ కుదరదు అంటూ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య ఇప్పుడు దూరం పెరగడంతో అతడికి సంబంధించిన టాటూ సైతం ఒంటిపై ఉండటానికి వీలులేదని ఏంజెలినా భావిస్తోంది. దీంతో.. బ్రాడ్ పిట్ గుర్తుగా ఉన్న టాటూను తొలగించుకోవాలని డిసైడైందని సమాచారం. అయితే.. గతంలో మాజీ భర్త బిల్లీ బాబ్ టాటూను సైతం విడిపోయిన తరువాత ఏంజిలీనా తొలగించింది. బాలీవుడ్ భామ దీపికా పదుకొనే సైతం రణ్‌బీర్‌తో అనుబంధానికి గుర్తుగా వేయించుకున్న 'ఆర్కే' టాటూను బ్రేక్అప్ తరువాత తొలగించడానికి నానా తంటాలు పడిన విషయం తెలిసిందే. -
నో ఎక్స్పీరియన్స్!
యాక్టింగ్‌లో అదరగొడుతున్నా... డెరైక్షన్‌లో మార్కులు కొట్టేస్తున్నా... వంటలో ఓనమాలు కూడా రావంటోంది హాలీవుడ్ సూపర్‌స్టార్ ఏంజలినాజోలీ. ఆరుగురు పిల్లల తల్లి అయిన ఈ ముప్ఫై తొమ్మిదేళ్ల తార అప్పుడప్పుడూ ప్రయోగాలు చేసినా.. ఆశించిన స్థాయిలో టేస్ట్ తేలేకపోయానంటోంది. ‘మా అబ్బాయి పాక్స్ నాకంటే బాగా వండుతాడు. నాకైతే బేసిక్ డిషెస్ చేయడం కూడా రాదు. ఇప్పుడు అధికారికంగా ఒకరికి భార్యని. త్వరలోనే అన్నీ వండటం నేర్చుకుంటానని బ్రాడ్‌కు చెప్పా. బాధపడాల్సిందేమీ లేదని అతడన్నాడు. నా పిల్లలు కూడా ఎంతో స్వీట్. నేనేం వండినా దాన్ని ఎంజాయ్ చేస్తారు’ అని తన కుకింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంది ఏంజలీనా. -
22మంది అతిథుల సమక్షంలో పెళ్లి!
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు. ఈ రెండూ ఒకేసారి చేస్తే, మధ్యతరగతి కుటుంబాలవారు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే. కానీ, హాలీవుడ్ తారలు బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ వంటి కోటీశ్వరులకు ఇది చాలా చిన్న విషయం. ఈ ఇద్దరూ ఒకవైపు ఇల్లు కట్టిస్తున్నారు... మరోవైపు తమ పెళ్లికి సంబంధించిన సన్నాహాలు చేసుకుంటున్నారు. తాము ప్రేమలో పడ్డ విషయాన్ని పదేళ్ల క్రితం ప్రకటించింది ఈ జంట. ఎట్టకేలకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది చివర్లో లేక వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఉంగరాలు మార్చుకోవాలని వీరిద్దరూ నిశ్చయించుకున్నారు. పెళ్లయిన తర్వాత ఉండటం కోసం ఓ ఇల్లు కట్టిస్తున్నారు. ఇంటిపని ఇప్పుడు తుది మెరుగుల దశలో ఉంది. మరోవైపు పెళ్లిబట్టలు, నగలను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకునే పని మీద ఉన్నారిద్దరూ. అదేం లెక్కో కానీ.. కేవలం 22 మంది అతిథులను మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానించాలనుకున్నారట. అత్యంత నిరాడంబరంగా వివాహం చేసుకోనున్నామనీ, జీవితానికి తీపి గుర్తుగా నిలిచే ఆ తేదీ ఏమిటన్నది త్వరలోనే ప్రకటిస్తామనీ బ్రాడ్, జోలీ జంట పేర్కొంది.