నో ఎక్స్‌పీరియన్స్!
యాక్టింగ్‌లో అదరగొడుతున్నా... డెరైక్షన్‌లో మార్కులు కొట్టేస్తున్నా... వంటలో ఓనమాలు కూడా రావంటోంది హాలీవుడ్ సూపర్‌స్టార్ ఏంజలినాజోలీ. ఆరుగురు పిల్లల తల్లి అయిన ఈ ముప్ఫై తొమ్మిదేళ్ల తార అప్పుడప్పుడూ ప్రయోగాలు చేసినా.. ఆశించిన స్థాయిలో టేస్ట్ తేలేకపోయానంటోంది. ‘మా అబ్బాయి పాక్స్ నాకంటే బాగా వండుతాడు. నాకైతే బేసిక్ డిషెస్ చేయడం కూడా రాదు. ఇప్పుడు అధికారికంగా ఒకరికి భార్యని. త్వరలోనే అన్నీ వండటం నేర్చుకుంటానని బ్రాడ్‌కు చెప్పా. బాధపడాల్సిందేమీ లేదని అతడన్నాడు. నా పిల్లలు కూడా ఎంతో స్వీట్. నేనేం వండినా దాన్ని ఎంజాయ్ చేస్తారు’ అని తన కుకింగ్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంది ఏంజలీనా.