హీరోయిన్ ఆ టాటూను చెరిపేస్తోంది! | Angelina wants to get her tattoos reversed | Sakshi
Sakshi News home page

హీరోయిన్ ఆ టాటూను చెరిపేస్తోంది!

Published Thu, Oct 6 2016 5:13 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

హీరోయిన్ ఆ టాటూను చెరిపేస్తోంది!

హీరోయిన్ ఆ టాటూను చెరిపేస్తోంది!

సెలబ్రిటీలు అభిమానుల నిఘాకళ్లను తప్పించుకోవడం కొచెం కష్టమే. ప్రేమలో మునిగితేలుతున్న సమయంలో వారు ఒంటిపై వేసుకునే టాటూలపై అభిమానులు కన్ను సహజంగానే ఉంటుంది. అయితే ఇలాంటి జంటలు విడిపోయాక చెరిపేసుకునే టాటూలను సైతం అభిమానులు గమనిస్తూనే ఉన్నారు.

ఇప్పుడు అభిమానుల కళ్లు హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలినా జోలీ టాటూపై పడ్డాయి. భర్త బ్రాడ్ పిట్‌తో తన అనుబంధానికి గుర్తుగా గతంలో టాటూ వేయించుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు మా ఇద్దరికీ కుదరదు అంటూ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య ఇప్పుడు దూరం పెరగడంతో అతడికి సంబంధించిన టాటూ సైతం ఒంటిపై ఉండటానికి వీలులేదని ఏంజెలినా భావిస్తోంది. దీంతో.. బ్రాడ్ పిట్ గుర్తుగా ఉన్న టాటూను తొలగించుకోవాలని డిసైడైందని సమాచారం. అయితే.. గతంలో మాజీ భర్త బిల్లీ బాబ్ టాటూను సైతం విడిపోయిన తరువాత ఏంజిలీనా తొలగించింది. బాలీవుడ్ భామ దీపికా పదుకొనే సైతం రణ్బీర్‌తో అనుబంధానికి గుర్తుగా వేయించుకున్న 'ఆర్‌కే' టాటూను బ్రేక్‌అప్ తరువాత తొలగించడానికి నానా తంటాలు పడిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement