Anjali Ameer
-
యాసిడ్ పోస్తానంటూ ప్రియుడు బెదిరింపు
తమిళనాడు ,పెరంబూరు: యాసిడ్ పోస్తానంటూ ప్రియుడు బెదిరిస్తున్నాడని హిజ్రా నటి అంజలి అమీర్ తెలిపింది. తమిళం, మలయాళం భాషల్లో నటిస్తున్న ఈమె ఆ మధ్య పేరంబు అనే తమిళ చిత్రంలో నటుడు మమ్ముట్టితో కలిసి నటించింది. అంజలీ అమీర్ మలయాళ బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో ద్వారా ప్రాచుర్యం పొందింది. ఈమె తన ఫేస్బుక్లో తన ప్రియుడు యాసిడ్‌తో దాడి చేస్తానని బెదిరిస్తున్నాడని పేర్కొంది. అతను రెండేళ్లుగా తాను సంపాదించుకున్న డబ్బును రూ.4 లక్షలకు పైగా దోచుకున్నాడని, ఇప్పుడు యాసిడ్ పోస్తానంటూ బెదిరిస్తున్నాడని కంటతడి పెడుతూ వీడియోను పోస్ట్ చేసింది. అందులో తనకు అండగా ఎవరూ లేరని, తల్లిదండ్రులు కూడా దగ్గర్లో లేరని చెప్పింది. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి కూడా వచ్చానని చెప్పింది. తనను ఆదుకునే వారు లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. కాగా ఈమె తన బయోపిక్‌ను సినిమాగా రూపొందించనుందట. ఈ చిత్రాన్ని 2020 మేలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొంది. అయితే తన ప్రియుడు ఎవరో, అతని పేరు కూడా అంజలి అమీర్ పేర్కొనలేదు. -
ఆ నటిపై సహజీవన భాగస్వామి వేధింపులు
మలయాళ నటి అంజలి అమీర్ తన సహజీవన భాగస్వామికి సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టారు. ఆ వ్యక్తి పెడుతున్న వేధింపులు భరించలేకుండా ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ సినీ పరిశ్రమలో మొట్టమొదటి ట్రాన్స్‌సెక్సువల్ హీరోయిన్గా అంజలి అమీర్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తను ఎదుర్కొంటున్న కష్టాల గురించి అంజలి ఫేస్బుక్ లైవ్‌లో పలు విషయాలను వెల్లడించారు. ‘ఆ వ్యక్తి తనతో కలిసి జీవించాలని నన్ను బెదిరిస్తున్నాడు. కానీ నేను ఇక మీదట అతనితో జీవించాలనుకోవటం లేదు. అతని నుంచి నాకు ప్రమాదం పొంచి ఉంది. అతనితో కలిసి జీవించకుంటే నన్ను చంపేస్తానని, యాసిడ్ పోస్తానని బెదిరిస్తున్నాడు’ అని అంజలి తన బాధను వ్యక్తపరిచారు. ఈ క్రమంలో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. అతను గత కొంతకాలం నుంచి తన సంపాదనపై ఆధారపడి జీవిస్తున్నాడని విమర్శించారు. ఈ బాధలు చూస్తుంటే తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయని తెలిపారు. దీనిపై పోలీసుకు ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు. కాగా, 2018 మలయాళ బిగ్‌బాస్‌లో పాల్గొన్న అంజలి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే పెరంబు చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అంజలి తన బయోపిక్‌ను తెరకెక్కించాలని చూస్తున్నారు. -
మొట్టమొదటి ట్రాన్స్‌సెక్సువల్ హీరోయిన్..
-
ట్రాన్స్‌సెక్సువల్ హీరోయిన్.. ఇన్స్పైరింగ్ వీడియో
కాలికట్ : భారతీయ సినీ పరిశ్రమలో మొట్టమొదటి ట్రాన్స్‌సెక్సువల్ హీరోయిన్గా ఇప్పటికే పాపురల్ అయ్యారు అంజలి అమీర్. ఆమె జీవితగాథపై ‘101 ఇండియా’ సంస్థ తాజాగా ఓ షార్ట్ వీడియోను రూపొందించింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ‘‘నేను పుట్టిన ఏడాదికే అమ్మ చనిపోయింది. ఊహ తెలిసే నాటికి ఒంటరినని తెలిసింది. కాలికట్(కేరళ)లో ఓ ముస్లిం కుటుంబంలో అబ్బాయిగా పుట్టిన నేను.. ఏనాడూ అలా ఉండలేకపోయా. మగవాడి శరీరంలో ఇరుక్కుపోయిన అమ్మాయినినేను. ఈ వైరుధ్యాన్ని మా ఇంట్లోవాళ్లు జీర్ణించుకోలేకపోయారు. బంధువులు, స్కూల్‌మేట్స్ అంతా నన్నొక విచిత్ర జీవిగా చూసేవాళ్లు. కానీ నేను మాత్రం వారి కళ్లలో దొరకని ఆనందాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నించేదాన్ని. కాలం భారంగా గడిచింది. 10వ తరగతి తర్వాత కొంత మార్పు. అప్పటిదాకా వేధించిన జెండర్ బాధను అధిగమించి, నన్ను నేనుగా ఇష్టపడటం నేర్చుకున్నా. ఆ నిర్ణయం నా జీవితాన్ని మార్చేసింది. కొద్ది రోజులకే ఇంట్లోవాళ్లకు చెప్పకుండా బయటికి వచ్చేశా.. కొయంబత్తూరు వెళ్లి ఎల్జీబీటీ కమ్యూనిటీతో కలిసిపోయా. కొంతకాలానికి బెంగళూరు షిఫ్ట్ అయ్యా. సెక్స్ మార్పిడి ఆపరేషన్‌కు అవసరమైన డబ్బు కోసం బార్ డాన్సర్‌గా, ఇంకా రకరకాల పనులు చేశా. చివరికి నా కల నెరవేరింది. అప్పటి నుంచి వెనక్కితిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. క్రమంగా మోడలింగ్‌లో అవకాశాలొచ్చాయి. పాపురల్ మోడల్‌గా ఎదుగుతున్న క్రమంలోనే సూపర్‌స్టార్ మమ్ముట్టి సార్ నుంచి పిలుపు.. ఆయన పక్కన హీరోయిన్గా చేయమని! అదొక అధ్బుతం. కానీ ఇలా జరుగుతుందని, ఈ సమాజం నన్ను అంగీకరిస్తుందని ముందే తెలుసు. ఇప్పుడు నేనొక పరిపూర్ణ మహిళను’’ అని గర్వంగా చెబుతారు అంజలి. అంజలి ప్రస్తుతం.. సూపర్‌స్టార్ మమ్ముట్టి సరసన ‘పరంబు’ సినిమాలో నటిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత రామ్ దర్శకత్వంలో మలయాళ, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘పరంబు’ ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.