Ankit Bhati
-
ఐఐటీ చదివి యంగెస్ట్ బిలియనీర్ అయ్యాడిలా.. సంపాదనలో మేటి ఈ అంకిత్ భాటి
Ola Cabs Co-Founder Ankit Bhati: ఓలా క్యాబ్ సర్వీస్ అనగానే భవిష్ అగర్వాల్ గుర్తుకు వస్తారు. అయితే దీని స్థాపించడంలో మరొక వ్యక్తి హస్తం కూడా ఉంది. అతడే ఓలా క్యాబ్ సర్వీస్ కో ఫౌండర్ 'అంకిత్ భాటి' (Ankit Bhati). అతి తక్కువ వయసులోనే బిలీనియర్ అయిన ఈయన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికే మనం ఐఐటీ చేసిన గ్రాడ్యుయేట్లు దేశంలో అనేక వ్యాపారాలు చేసి సక్సెస్ సాధించారు. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు అంకిత్ భాటి. దేశంలోని అతిపెద్ద స్టార్టప్ కంపెనీ స్థాపనలో పాలుపంచుకుని విజయం సాధించిన అంకిత్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బొంబాయిలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసాడు. ఇతడు మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండ్ కోడింగ్‌లో నిపుణుడు. ఓలా క్యాబ్ సర్వీస్ ప్రారంభించడానికి ముందు మైక్రోసాఫ్ట్, మేక్ సెన్స్, విల్కామ్ వంటి అనేక సంస్థలలో పనిచేశారు. 2010లో ఓలా క్యాబ్స్ ప్రారంభమైంది. ఇది కేవలం ఐదు సంవత్సరాల నాటికి వేలకోట్లు టర్నోవర్ తీసుకువచ్చింది. ఈ కారణంగానే భవిష్ అండ్ అంకిత్ ఇద్దరూ కూడా అతి తక్కువ కాలంలో బిలీనియర్స్ అయిన యువకుల జాబితాలో స్థానం పొందారు. (ఇదీ చదవండి: 12 ఏళ్ల నిర్మాణం.. 700 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచంలోనే ఇలాంటి ప్యాలెస్ మరొకటి లేదు!) ఎనిమిది సంవత్సరాల ముందు అంకిత్ నికర విలువ సుమారు రూ. 3000 కోట్లు అని నివేదికల ద్వారా తెలిసింది. కాగా ఇప్పుడది రూ. 938 కోట్లకంటే ఎక్కువ అని సమాచారం. ప్రస్తుతం ఉబర్ సంస్థకు గట్టి పోటీ ఇస్తున్న ఓలా క్యాబ్ సర్వీస్ మంచి లాభాల బాటలో పయనిస్తోంది. సంస్థ సీఈఓగా భవిష్, సిటీఓగా (చీఫ్ టెక్నికల్ ఆఫీసర్) అంకిత్ ఉన్నారు. -
వివాదంలో ఓలా, ఫౌండర్స్‌పై కేసు
బెంగళూరు: ఆన్లైన్ క్యాబ్ అగ్రిగేటర్ ఓలా వివాదలో ఇరుక్కుంది. కాపీరైట్ చట్టం ఉల్లంఘించిన ఆరోపణలతో బెంగళూరు పోలీసులు ఓలా ఫౌండర్స్‌పై కేసున మోదు చేశారు. ఓలా ప్లే ప్లాట్‌ఫారమ్ ద్వారా చలనచిత్ర పాటలను చోరీ చేసి స్ట్రీమింగ్ చేసినందుకు బెంగళూరుకు చెందిన రికార్డింగ్ కంపెనీ ఫిర్యాదు చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఓలా ప్లే ప్లాట్‌ఫాం ద్వారా పైరేటెడ్ సినిమా పాటలను వాడుతున్నారని మ్యూజిక్ సంస్థ లహరి రికార్డింగ్ కంపెనీ లిమిటెడ్. ఓలా మాతృ సంస్థ ఎఎన్ఐ టెక్నాలజీస్ ప్రయివేటు లిమిటెడ్‌పై ఫిర్యాదు చేసింది. తాము ఆడియో హక్కులను కొనుగోలు చేసిన కన్నడ , తెలుగు సినిమాల నుండి పాటలను డౌన్లోడ్ చేసుకుంటున్నారనీ ఆరోపించింది. కర్ణాటక, ఢిల్లీ, కోల్‌కతా తమిళనాడులో వీటిని అక్రమంగా వినియోగిస్తున్నారని మ్యూజిక్ కంపెనీ ఆరోపించింది. దీంతో పోలీసులు ఓలా కార్యాలయంపై దాడి చేసి, పాటలను డౌన్లోడ్ చేయడానికి, నిల్వ చేయడానికి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎఎన్ఐ టెక్నాలజీస్ లిమిటెడ్, ఓలా ఫౌండర్స్ భవిష్ అగర్వాల్ , అంకిత్ భతీపై కేసు నమోదు చేశారు.