anthamma
-
లారీని ఢీకొట్టిన ఆటో.. మహిళమృతి
నల్లగొండ: వేగంగా వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న కారును తప్పించే క్రమంలో లారీని ఢీకొట్టిన ఘటన జిల్లాలోని మోత్కూరు మండలం అనాజ్ పురం సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. దీంతో ఆటోలో ఉన్న అంతమ్మ(57) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమచారం. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
చికిత్స పొందుతూ మహిళ మృతి
తాండూరు (రంగారెడ్డి): భర్త చేతిలో దాడికి గురై చికిత్స పొందుతున్న ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా తాండూరు మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని మాల్కాపూర్ గ్రామానికి చెందిన అంతమ్మపై భర్త భీమయ్య ఆగస్టు 31న గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఆమె హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.