Anthony Noto
-
ఆయన రాజీనామాతో ట్విటర్ షేర్లు పతనం
ట్విటర్ సీఓఓ ఆంథోనీ నాటో కంపెనీని వీడినట్టు ట్విటర్ మంగళవారం ప్రకటించింది. నోటో సోఫై కంపెనీ సీఈవోగా ఎంపికయ్యారని, ఈ నేపథ్యంలో ట్విటర్‌కు రాజీనామా చేసినట్టు పేర్కొంది. నోటో రాజీనామాతో ఆ కంపెనీ షేర్లు ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో 3 శాతం మేర పతనమయ్యాయి. నోటో రాజీనామాపై ట్విటర్ సీఈవో జాక్ డోర్సే ఎంతో బాధకరమైన ట్వీట్ చేశారు. ‘నోటో మమల్ని వదిలి వెళ్తుండటం చాలా బాధకరమే. కానీ ట్విట్టర్లో ఆయన సాధించిన ప్రతీది నాకు గర్వకారకంగా, సంతోషంగా ఉంది. నోటో నాకు గత కొన్నేళ్లుగా స్నేహితుడిగా, భాగస్వామిగా, మెంటర్‌గా ఉంటున్నారు. ఆయనకి ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుంది. థాంక్యూ ఆంథోనీ. మీము ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తుంటాం’ అని ట్వీట్ చేశారు. నోటో అంతకముందు గోల్డ్‌మ్యాన్ సాచ్స్‌లో పనిచేశారు. 2014లో ట్విటర్లో చేరారు. ఆయన ఎన్నో రోజులుగా సీఈవో పదవి కోసం ఎదురుచూస్తున్నట్టు రీకోడ్ రిపోర్టు చేసింది. ట్విటర్లో పనిచేయడం తనకు కలిగిన జీవితకాల అవకాశమని, తమ టీమ్‌తో తాను చాలా గర్వపడుతున్నానని నోటో చెప్పారు. తాను ఆ కంపెనీలో పనిచేసిస సమయంలో పలు కీలక మైలురాయిలను సాధించినట్టు పేర్కొన్నారు. -
ట్విట్టర్ కు గట్టి ఎదురుదెబ్బ
శాన్ ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియా ప్రఖ్యాత సంస్థ ట్విట్టర్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు కంపెనీ నుంచి వైదొలగారు. తాజాగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) ఆడమ్ బెయిన్ కూడా ట్విట్టర్ కు టాటా చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ బిజినెస్ కు ఇంచార్జిగా ఉన్న ఆయన సంస్థ నుంచి బయటకు వెళ్లిపోనున్నారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆంటోనీ నోటో ఇక నుంచి సీఓఓగా వ్యవహరిస్తారని ట్విట్టర్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఆరేళ్లుగా ట్విట్టర్ లో పనిచేయడం నాకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. నేను కంపెనీని వదిలి పెట్టాలనుకున్న విషయం సీఈవో జాక్ డోర్సేకు ముందుగానే తెలుసు. నేను బయటకు వెళ్లి కొత్తగా ఏదైనా చేయాలనుకుంటున్నాన’ని బెయిన్ ట్వీట్ చేశారు. తన బాధ్యతలు ఆంటోనీకి బదలాయించేందుకు కొన్ని వారాలు ఆయన ట్విట్టర్ లో కొనసాగుతారు. వాణిజ్య కార్యకలాపాల ద్వారా ట్విట్టర్ ఆదాయం పెంచడంతో బెయిన్ కీలకపాత్ర పోషించారు. కాగా, వరుసగా సీనియర్ అధికారులు ట్విట్టర్ కు గుడ్ బై చెబుతుండడం కలకలం రేపుతోంది. ట్విట్టర్ ఇండియా హెడ్ రిషి జైట్లీ, ట్విట్టర్ ఇండియా (ఆగ్నేయ ఆసియా, మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా) మేనేజింగ్ డైరెక్టర్ పర్మిందర్ సింగ్ ఇటీవలే రాజీనామా చేశారు.