ట్విటర్ సీఓఓ ఆంథోనీ నాటో కంపెనీని వీడినట్టు ట్విటర్ మంగళవారం ప్రకటించింది. నోటో సోఫై కంపెనీ సీఈవోగా ఎంపికయ్యారని, ఈ నేపథ్యంలో ట్విటర్‌కు రాజీనామా చేసినట్టు పేర్కొంది. నోటో రాజీనామాతో ఆ కంపెనీ షేర్లు ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో 3 శాతం మేర పతనమయ్యాయి. నోటో రాజీనామాపై ట్విటర్ సీఈవో జాక్ డోర్సే ఎంతో బాధకరమైన ట్వీట్ చేశారు. ‘నోటో మమల్ని వదిలి వెళ్తుండటం చాలా బాధకరమే. కానీ ట్విట్టర్‌లో ఆయన సాధించిన ప్రతీది నాకు గర్వకారకంగా, సంతోషంగా ఉంది. నోటో నాకు గత కొన్నేళ్లుగా స్నేహితుడిగా, భాగస్వామిగా, మెంటర్‌గా ఉంటున్నారు. ఆయనకి ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుంది. థాంక్యూ ఆంథోనీ. మీము ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తుంటాం’ అని ట్వీట్ చేశారు.
నోటో అంతకముందు గోల్డ్‌మ్యాన్ సాచ్స్‌లో పనిచేశారు. 2014లో ట్విటర్‌లో చేరారు. ఆయన ఎన్నో రోజులుగా సీఈవో పదవి కోసం ఎదురుచూస్తున్నట్టు రీకోడ్ రిపోర్టు చేసింది. ట్విటర్‌లో పనిచేయడం తనకు కలిగిన జీవితకాల అవకాశమని, తమ టీమ్‌తో తాను చాలా గర్వపడుతున్నానని నోటో చెప్పారు. తాను ఆ కంపెనీలో పనిచేసిస సమయంలో పలు కీలక మైలురాయిలను సాధించినట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment