anti aircraft bombs
-
రష్యా క్షిపణి వల్లే కూలిందా?
న్యూఢిల్లీ: కజకిస్తాన్‌లోని అక్తావ్ సమీపంలో బుధవారం విమానం కూలడానికి వెలుపలి శక్తుల ప్రమేయమే కారణమని అజెర్బైజాన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. వెలుపలి భౌతిక, సాంకేతిక పరమైన ప్రమేయం వల్లే విమానం కూలినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని శుక్రవారం వెల్లడించింది. ఈ విమానం కుప్పకూలడానికి రష్యా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థే కారణమని అంతకు ముందు వార్తలొచ్చాయి. రష్యా వైమానిక విభాగం ప్రతినిధి యడ్రోవ్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రోజ్నీ, వ్లాడికవ్కాజ్లలోని మౌలిక వసతులు, జనావాసాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడులు జరుగుతున్నాయి. అందుకే గ్రోజ్నీలో ల్యాండ్ చేయకుండా విమానాన్ని దారి మళ్లించారని తెలిపారు. ‘దీన్నిబట్టి చూస్తే, ఆ ప్రాంతంలోని గగనతలాన్ని మూసివేసినట్లు అర్థమవుతోంది. అంటే, ఆ జోన్లోకి వచ్చే ఏదైనా విమానం తక్షణమే బయటకు రావాల్సి ఉంటుంది. లేకుంటే ప్రమాదమే’అని విశ్లేషకులు అంటున్నారు. ‘విమానం గ్రోజ్నీలో ల్యాండయ్యేందుకు రెండుసార్లు ప్రయత్నించింది. అయితే, డ్రోన్ దాడుల భయంతో వేరే విమానాశ్రయాల్లో ల్యాండ్ చేయాలని అధికారులు పైలట్‌కు సూచించారు. అందుకే, పైలట్ అక్తావ్ ఎయిర్‌పోర్టు దిశగా విమానాన్ని మళ్లించారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో కురుస్తున్న దట్టమైన మంచు ప్రమాదానికి కారణమైంది’అని యడ్రోవ్ వివరించారు. కానీ, రష్యా మీడియా విమాన ప్రమాదం గురించిన అసత్యాలు ప్రచారం చేస్తోందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి సిబిహా ఆరోపించారు. క్షిపణి దాడిలో దెబ్బతిన్న విమానంలో ఆనవాళ్లు దొరక్కుండా చేయడానికి రష్యా అధికారులు సముద్రం దాటాలని పైలట్‌పై ఒత్తిడి చేశారని విమర్శించారు. విమానం కూలిన తర్వాత కేబిన్ నుంచి భారీగా పొగలు వస్తున్నట్లుగా చూపే వీడియోలు, ఫొటోలు కూడా ఇందుకు సాక్ష్యంగా ఉన్నాయన్నారు. విమానం ముక్కలై మంటలు అంటుకోవడం, కాస్పియన్ సముద్ర తీరానికి సమీపంలో నేలను తాకి నల్లని పొగలు కమ్ముకుంటున్న వీడియో ఒకటి ఆన్లైన్లో కనిపిస్తోంది. ఘటనా ప్రాంతంలో విమానం ధ్వంసమైన తీరును గమనిస్తే రష్యా మిలటరీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్లే నేలకూలినట్లు కనిపిస్తోందని యూకేకు చెందిన ఓస్ప్రే ఫ్లైట్ సొల్యూషన్స్ సంస్థ చీఫ్ మ్యాట్ బోరీ విశ్లేషించారని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. రష్యన్లే ఆ విమానాన్ని కూల్చేశారని ఉక్రెయిన్ జాతీయ భద్రతాధికారి అండ్రీ కొవలెంకో చెప్పారు. యుద్ధం జరుగుతున్న వేళ గ్రోజ్నీ గగనతలాన్ని రష్యా మూసివేయకపోవడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందన్నారు. -
Russia-Ukraine war: ఉక్రెయిన్‌పైకి ప్రాణాంతక ఆయుధాలు
కీవ్: భారీ సామూహిక మరణాలే లక్ష్యంగా ఉక్రెయిన్‌లో రష్యా సేనలు మరిన్ని ప్రాణాంతక ఆయుధాలను ప్రయోగించవచ్చని ఇంగ్లండ్ రక్షణ శాఖ హెచ్చరించింది. 1960ల నాటి యాంటీ–షిప్ మిస్పైళ్లతో పాటు అణు వార్హెడ్లతో కూడిన కేహెచ్–22 మిస్సైళ్లతో ఉక్రెయిన్ యుద్ధ విమానాలను కూల్చవచ్చని పేర్కొంది. తూర్పు ఉక్రెయిన్‌లో శనివారం రష్యా దాడుల్లో పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. దక్షిణ ఉక్రెయిన్‌లో తమ చేజిక్కిన మెలిటోపోల్ సిటీలో పౌరులకు రష్యా పాస్‌పోర్టులు ఇస్తోంది. జెలెన్స్కీతో ఉర్సులా భేటీ యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వోన్ డెర్ లెయన్ కీవ్‌లో అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. రష్యా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేసేలా మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని పశ్చిమ దేశాలను జెలెన్స్కీ కోరారు. తూర్పు ఉక్రెయిన్ నుంచి వలసలు బాంబులు మోత, ఆహార సంక్షోభం దెబ్బకు తూర్పు ఉక్రెయిన్ నుంచి జనం భారీగా వలస వెళ్తున్నారు. వీరిలో చాలామంది మహిళలు, చిన్నారులు, వృద్ధులే ఉన్నారు. రష్యా అనుకూల వేర్పాటువాదులు మరణశిక్ష విధించిన ముగ్గురు విదేశీయులను కాపాడతామని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా చెప్పారు. వారిలో ఇద్దరు యూకే పౌరులు, ఒక మొరాకో పౌరుడున్నారు. మారియూపోల్కు కలరా ముప్పు దక్షిణ ఉక్రెయిన్‌లోని మారియూపోల్ నగరానికి కలరాతోపాటు ఇతర ప్రాణాంతక రోగాల ముప్పు పొంచి ఉందని స్థానిక మేయర్ బొయ్చెంకో ఆందోళన వ్యక్తం చేశారు. మారియూపోల్‌లో రష్యా దాడుల్లో చనిపోయిన వారి మృతదేహాలను ఇంకా పూర్తిగా తొలగించలేదని చెప్పారు. వందలాది మృతదేహాలు కుళ్లిపోతున్నాయని, ఫలితంగా జలవనరులు కలుషితం అవుతున్నాయన్నారు. తాగనీరు కలుషితమై రోగాలు దాడి చేసే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే నివారణ చర్యలు చేపట్టకపోతే వేలాది మంది బలయ్యే అవకాశం ఉందని వాపోయారు. హెచ్చరించినా పట్టించుకోలేదు: బైడెన్ లాస్ఏంజెలెస్: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర గురించి తమ నిఘా సంస్థలు ముందుగానే సమాచారం సేకరించాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఆయన లాస్ఏంజెలెస్లో డెమొక్రటిక్ పార్టీ ఆధ్వర్యంలో నిధుల సేకరణ కార్యక్రమంలో మాట్లాడారు. యుద్ధానికి రష్యా సిద్ధమవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని అప్రమత్తం చేశానని, అయినప్పటికీ ఆయన పెడచెవిన పెట్టారని అన్నారు. రష్యా ప్రారంభించబోయే యుద్ధం గురించి వినడానికి జెలెన్స్కీ ఇష్టపడలేదని తెలిపారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం గురించి స్పందిస్తూ.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి పరిణామం జరగలేదన్నారు. ఇది అతిశయోక్తి కాదని, ముమ్మాటికీ వాస్తవమేనని స్పష్టం చేశారు. -
ఆకాశంలో బీభత్సానికి ఐసిస్ ప్లాన్
- వైమానిక దాడులను తిప్పికొట్టేందుకు ఉగ్రసంస్థ కొత్త ఎత్తుడడలు మోసూల్: సిరియా, ఇరాక్‌లలోని తమ ప్రభావిత ప్రాంతంపై పట్టును పెంచుకునే క్రమంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ కొత్త ఎత్తుగడలను రచిస్తోంది. తన పాలిట వినాశనకారిగా మారిన వైమానిక దాడులను తిప్పికొట్టేందుకు కొత్త తరహాలో ఆకాశ బాంబులను ప్రయోగిస్తోంది. పేలుడు పదార్థాలు, హైడ్రోజన్ ను ప్లాస్టిక్ సంచులు, కండోమ్‌లలో నింపి, ఆకాశంలోకి పంపి వాటి ద్వారా శత్రుదేశాల యుద్ధవిమానాలను నేల కూల్చడం ఎలాగో తన సైన్యానికి నేర్పుతోంది. దీనికి సంబంధించిన కీలక వీడియో ఒకటి ఇటీవలే వెలుగలోకి వచ్చింది. అబూ అయూబ్ అల్ బాగ్ధాది అనే ఐసిస్ టెక్ శావి 'Dropping Fighter Jets in the Lands of the Islamic State' పేరుతో రూపొందిచిన వీడియోలో ఈ ఆకాశ బాంబుల తయారీకి సంబంధించిన వివరాలను పొందుపర్చారు. సాధారణంగా ఇంట్లో వాడుకునే వస్తువుల ద్వారా హైడ్రోజన్ వాయువును తయారుచేయడం మొదలు ప్లాస్టిక్ సంచుల్లో పేలుడు పదార్థాలను కూర్చడం, ఆ తర్వాత హైడ్రోజన్ ను నింపి, ఆకాశంలోకి వదలడం వరకు అన్ని విషయాలను పూసగుచ్చినట్లు వీడియోలో వివరించారారు. ఇలా తయారుచేసిన వందలకొద్దీ ఆకాశ బాంబులను తన గగనతలంలోకి పంపడం ద్వారా శత్రుదేశ యద్ధవిమానాలను రానీయకుండా చేయాలనేది ఐసిస్ ప్రణాళిక. ఆకాశ బాంబుల్లో నింపే హైడ్రోజన్ పరిమాణాన్ని బట్టి రకరకాల ఎత్తుల్లో వీటిని మోహరింపజేస్తారు. అటుగా ఏదైన ఫైటర్ జెట్ దూసుకొచ్చి ఈ ప్లాస్టిక్ బ్యాగ్ లను తాకగానే పేలిపోతాయి. గత ఏడాది విడుదలైన కొన్ని వీడియోల్లో ఐసిస్ జిహాదీలు కొందరు పెద్ద ఎత్తున కండోమ్స్ గాలిలోకి ఎగురవేస్తున్న దృశ్యాలు కనిపించాయి. అయితే కండోమ్ పరిమాణం చిన్నది కావడంతో వాటి స్థానంలో మధ్య, పెద్ద స్థాయి ప్లాస్టిక్ బ్యాగ్స్ లో పేలుడు పదార్థాలను పైకి వదులుతున్నారు. ఈ ఆకాశ బాంబుల ద్వారా ఇప్పటికే సిరియన్ ప్రభుత్వ దళాలకు చెందిన యుద్ధ విమానాన్ని నేల కూల్చినట్లు ఐసిస్ చెప్పుకుంటోంది.