anti drugs walk
-
'సే నో టు డ్రగ్స్'
-
వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: వెంకయ్య
హైదరాబాద్: డ్రగ్స్ విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. కేబీఆర్ పార్క్ దగ్గర ఆదివారం ఉదయం నిర్వహించిన యాంటి డ్రగ్స్ వాక్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే చెడు ప్రభావాలపై ప్రచారం చేయాలని అన్నారు. మత్తులో కొందరు తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు. మీడియా నిర్మాణాత్మక పాత్ర పోషించి యువతను చైతన్యవంతం చేయాలని కోరారు. శరీరం, మనస్సు, మేధస్సు, సృజనాత్మకతను ఛిద్రం చేస్తుందని గుర్తించాలన్నారు. సినిమా జనాలను ఆలోచింపచేయగలదని, సినిమాల ద్వారా ప్రజలపై మంచి ముద్ర వేయాలని విజ్ఞప్తి చేయాలి. సే నో టు డ్రగ్స్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చంద్రవదన్, అకుల్ సబర్వాల్, సినిమా ప్రముఖులు పాల్గొన్నారు. డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీని జెండా ఊపి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. హైదరాబాద్ నగరవాసులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. -
'యాంటీ డ్రగ్స్ వాక్'లో అనసూయ
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమను డ్రగ్స్ కేసు ఒక్క కుదుపుకు గురిచేసింది. ఏమీడియాలో చూసినా డ్రగ్స్ కేసు గురించే చర్చలు, డిబేట్లు జరుగుతున్నాయి. 12 మంది సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ ఆరోపణలు రావడంతో సినీ పరిశ్రమతో పాటు అభిమానులు కలవరపాటుకు గురయ్యారు. మెత్తం 12 మందికి స్సెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) నోటీసులు జారీ చేయడం, ఒక్కో రోజు ఒక్కోక్కరిని విచారిస్తుండడం ఇండస్ట్రీలో అలజడి రేపుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో డ్రగ్స్-అనర్థాలపై అవగాహన కలిగించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. అవి నిర్వహించే కార్యక్రమాల్లో ప్రముఖ సినీ నటులు పాల్గొని తమ మద్దతు తెలియచేస్తూ తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. కళామందిర్ ఫౌండేషన్, హైదరాబాద్ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 30న హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు వద్ద ‘యాంటీ డ్రగ్ వాక్’ను నిర్వహించనున్నారు. ఈకార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా డ్రగ్స్ మహమ్మారిపై పోరాడేందుకు, ఈకార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకొచ్చింది. ‘డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం రండి’ అంటూ అనసూయ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసింది. #sayNOtoDrugs pic.twitter.com/08STS7i7wg — Anasuya Bharadwaj (@anusuyakhasba) July 23, 2017