anti-India slogans
-
హిందూ ఆలయంపై విద్వేష రాతలు
న్యూయార్క్/గాందీనగర్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ప్రముఖ హిందూ ఆలయంపై దాడి జరిగింది. దుండగులు ఆలయ గోడపై భారత వ్యతిరేక అభ్యంతరకర చిత్రాలతోపాటు ఖలిస్తాన్ అంటూ కలర్ స్ప్రే చేశారు. పోలీసులు ఈ ఘటనను విద్వేష నేరంగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. నెవార్క్‌లోని స్వామి నారాయణ్ మందిర్ హిందూ ఆలయంపై అభ్యంతరకర చిత్రాలు(గ్రాఫిటీ) ఉన్నాయంటూ శుక్రవారం ఉదయం తమకు ఆలయ నిర్వాహకుల నుంచి ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు అధికారులు వాటిని పరిశీలించారు. గ్రాఫిటీని రెచ్చగొట్టే చర్యగా ఆలయ పెద్దలు పేర్కొన్నారని పోలీసులు వెల్లడించారు. కావాలనే ఎవరో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని చెప్పారు. విద్వేష నేరంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నామన్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీ తదితరాలతో ఆధారాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనను అమెరికా విదేశాంగ శాఖ, శాన్ఫ్రాన్సిస్కోలోని భారత్ కాన్సులేట్ కార్యాలయం తీవ్రంగా ఖండించాయి. గతంలోనూ భారత దౌత్య కార్యాలయాలపై ఇలాంటి దాడులు జరిగాయి. జూలైలో శాన్ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ కార్యాలయంపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. అమెరికా, కెనడాలపౌరసత్వమున్న ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూపై హత్యాయత్నం వెనుక భారత ప్రమేయముందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఉపేక్షించరాదు: జై శంకర్ ఈ ఘటనపై విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ వెలుపల ఉగ్రవాదం, వేర్పాటువాదాలను ఉపేక్షించరాదని డిమాండ్ చేశారు. -
ఖలిస్తాన్ రెఫరెండం!
టొరంటో: భారత వ్యతిరేక శక్తులు కెనడాలో తిష్టవేశాయని స్వయంగా ఆ దేశ ప్రధాని ట్రూడో ఎదుటే ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేసిన వేళ అదే రోజు మరో పరిణామం చోటుచేసుకుంది. భారత్‌ను విడగొట్టి సిక్కుల కోసం ఖలిస్తాన్‌ను ఏర్పాటుచేయడంపై అభిప్రాయం తెలపాలంటూ కెనడాలో సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) వేర్పాటువాద సంస్థ రెఫరెండం నిర్వహించింది. సుర్రే పట్టణంలో ఎస్ఎఫ్జే వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ సారథ్యంలో సిక్కు ప్రజాభిప్రాయ సేకరణ(రెఫరెండం) చేపట్టారు. భారీ వ్యక్తిగత భద్రత నడుమ రెఫరెండం ప్రాంతానికి వచి్చన గురపత్వంత్ అక్కడే భారత వ్యతిరేక విద్వేష ప్రసంగం చేశారు. గురు నానక్ సింగ్ గురుద్వారా వద్ద జరిగిన ఈ రెఫరెండం తంతులో దాదాపు 7వేల మంది పాల్గొన్నారు. దాదాపు 50 వేలకుపైగా జనం వస్తారని ఆశించిన నిర్వాహకులకు భంగపాటు ఎదురైంది. కెనడా ప్రధాని ట్రూడోతో మోదీ ఖలిస్తాన్ వేర్పాటువాదం సహా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించిన ఆదివారం రోజే ఈ రెఫరెండంను ఎస్ఎఫ్జే నిర్వాహకులు పనిగట్టుకుని నిర్వహించారు. అంతకుముందు పత్వంత్ సింగ్ ఒక ఆడియో సందేశం విడుదలచేశారు. ‘ఢిల్లీలో జీ20 సదస్సు జరుగుతున్న ప్రగతి మైదాన్ ప్రాంగణానికి భారీ సంఖ్యలో వెళ్లి నిరసన గళం వినిపించండి’ అని కశీ్మర్ లోయలో నివసించే ముస్లింలకు పిలుపునిస్తున్నట్లు ఆ ఆడియోలో ఉంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖలిస్తాన్ వేర్పాటువాద జెండా ఎగరేస్తామని పత్వంత్‌సింగ్ సవాల్ చేశారు. -
ఎందుకీ విద్వేషపు చిచ్చు ?
ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశాల్లో ఒకటిగా కెనడాకు పేరుంది. గతేడాది ప్రపంచ శాంతి సూచిలో ఆరో ర్యాంకు దక్కింది. నేరాలు, ఘర్షణలూ తక్కువే. రాజకీయంగా సుస్థిరమైన ప్రభుత్వం. అలాంటి దేశంలో భారతీయులకు భద్రత ఎందుకు లేదు? వారిపై విద్వేష నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి? కెనడాలో భారతీయులు జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్రం హెచ్చరించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది...? కెనడాలో హిందూ, భారత్ వ్యతిరేక శక్తులు బలపడుతున్నాయి. ఇటీవల అక్కడ హిందూ దేవాలయాలపై వరసగా జరుగుతున్న దాడులు ఆందోళన పెంచుతున్నాయి. టొరంటోలోని స్వామినారాయణ మందిరంపై కొన్నాళ్ల క్రితం కొందరు దుండగులు దాడులు చేస్తూ ఖలిస్తాన్ జిందాబాద్, హిందూస్తాన్ ముర్దాబాద్ అంటూ చేసిన నినాదాలతో భారతీయులు ఉలిక్కిపడ్డారు. జూలైలో గ్రేటర్ టొరంటో ప్రాంతంలోని రిచ్మండ్ హిల్‌లో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వీటి వెనక ఖలీస్తాన్ ఉగ్రవాదుల హస్తముందని ఆధారాలున్నా కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం భారత్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది. అధికార లిబరల్ పార్టీ ఎంపీ, ప్రవాస భారతీయుడు చంద్ర ఆర్య వీటిని పార్లమెంటులో లేవనెత్తారు. భారత్‌పై, హిందూ మతంపై విద్వేషం వెళ్లగక్కుతున్నారన్నారు. ఖలిస్తానీల అడ్డా? కెనడా కొన్నేళ్లుగా ఖలిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత వ్యతిరేక అజెండాతో పని చేస్తున్న వీరంతా ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమం కోసం కెనడాను వాడుకుంటున్నారు. భారత్ నిషేధించిన సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) సెప్టెంబర్ 18న ఖలిస్తాన్ రిఫరెండాన్ని నిర్వహించింది. దీన్ని నిలిపేయాలని భారత్ కోరినా కెనడా పట్టించుకోలేదు. లౌకిక దేశమైన తాము ప్రజాభిప్రాయ సేకరణలను అడ్డుకోబోమని తేల్చి చెప్పింది. ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థలైన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్, ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ వంటివి కెనడా గడ్డ నుంచి భారత్‌లో మత ఘర్షణలకు ప్రయత్నిస్తున్నాయి. 2018 నుంచి కెనడాలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలు పెరిగాయి. బ్రాంప్టన్‌లో గౌరీశంకర్, జగన్నాథాలయం, మిసిసాపలో హిందూ హెరిటేజ్ సెంటర్‌పై దాడులు జరిగాయి. ఇదంతా కెనడాలో ఉంటూ భారత్‌ను అస్థిరపరిచే కుట్రేనని గతేడాది అక్కడ పర్యటించిన జాతీయ దర్యాప్తు సంస్థ తేల్చింది. కెనడాలో భారతీయం కెనడాలో మొదట్నుంచి భారతీయుల ప్రాబల్యం ఎక్కువే. ప్రస్తుతం అక్కడ 16 లక్షల మంది (4 శాతం) భారతీయులున్నారు. వీరిలో లక్ష మందికి పైగా శాశ్వత పౌరసత్వముంది. ఎక్కువగా పంజాబీలే కెనడా వెళుతుంటారు. ఆ దేశంలో అత్యధికంగా మాట్లాడే 10 భాషల్లో పంజాబీ కూడా ఉంది. చట్టసభల్లోనూ భారతీయులు సత్తా చాటారు. 2015లో 21 మంది భారత సంతతికి వారు ఎంపీలయ్యారు. 2019లో 23కు పెరిగారు. కెనడా రక్షణ మంత్రి హర్జిత్ సింగ్ సజ్జన్ కూడా భారతీయ మూలాలున్న వ్యక్తే! జర భద్రం: కేంద్రం ‘‘కెనడాలో జాతి విద్వేష నేరాలు, వర్గ హింస, భారత్ వ్యతిరేక కార్యక్రమాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి అక్కడి భారతీయులంతా జాగ్రత్తగా ఉండాలి’’ అంటూ విదేశాంగ శాఖ శుక్రవారం హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే ఒట్టావాలోని భారతీయ హైకమిషన్, టొరంటోలో దౌత్య కార్యాలయాలను సంప్రదించాలని సూచించింది. ఇటీవలి నేరాలపై సమగ్ర విచారణ జరపాలని కెనడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్రం బారత్‌కి విరుద్ధంగా ఫేక్ ఇన్ఫర్మేషన్ని ఇస్తున్న పాక్ ఆధారిత యూట్యూబ్ ఛానెళ్లను సుమారు 35 బ్లాక్ చేసింది. బ్లాక్ చేసిన ఛానెళ్ల కంటెంట్‌లో భారత సాయుధ బలగాలు, కాశ్మీర్, భారత్ విదేశీ సంబంధాలు, మాజీ సీడీఎస్ బిపిన్ రావత్ మరణం వంటి విషయాలకు సంబంధించి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం 35 యూట్యూబ్ ఛానెల్‌లు, రెండు ట్విట్టర్ ఖాతాలు, రెండు ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, రెండు వెబ్సైట్లు, ఒక ఫేస్బుక్ ఖాతాను బ్లాక్ చేసినట్లు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ విక్రమ్ సహాయ్ శుక్రవారం తెలిపారు. అయితే ఈ ఖాతాలన్నీ పాకిస్తాన్ నండి పనిచేస్తాయని, పైగా భారత్‌కి వ్యతిరేకంగా నకిలీ వార్తలను, కంటెంట్లను వ్యాప్తి చేయడమే ముఖ్యోద్దేశం అని పేర్కొన్నారు. అంతేకాదు బ్లాక్ చేసిన ఖాతాలకు సుమారు 130 కోట్ల వ్యూస్, దాదాపు 1.2 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారని విక్రమ్ సహాయ్ అన్నారు. ఈ మేరకు బ్లాక్ చేసిన ఖాతాలలో అప్నీ దునియా నెట్వర్క్ 14 యూట్యూబ్ ఛానెల్‌ళ్లను నిర్వహిస్తోందని, తల్హా ఫిల్మ్స్ నెట్వర్క్ 13 యూట్యూబ్ ఛానెళ్లను నిర్వహిస్తున్నాయని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2021 నిబంధన16 ప్రకారం జారీ చేసిన ఆదేశాలను ఈ ఖాతాలు ఉల్లంఘించాయని పేర్కొంది. (చదవండి: ఎమర్జెన్సీ ల్యాడింగ్ తర్వాత ప్రయాణికులకు ఝలక్ ఇచ్చిన పైలెట్...) -
'కన్హయ్యకు ఆ గొడవతో సంబంధమే లేదు'
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్యకు జాతి వ్యతిరేక నినాదాలకు ప్రత్యక్ష సంబంధంలేదని ఢిల్లీ ప్రభుత్వం తమ నివేదికలో స్పష్టం చేసింది. ఫిబ్రవరి9న జరిగిన ఘటనపై బుధవారం రాత్రి నివేదిక అందచేశామని ఢిల్లీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సంజయ్ కుమార్ తెలిపారు. ఊమర్ ఖలీద్, మరో విద్యార్థి ఆ రోజు నినాదాలు చేశారా లేదా అన్నదానిపై పూర్తిస్థాయి జరగాల్సి ఉందని పేర్కొన్నారు. లభ్యమైన చాలా వీడియోలలో ఊమర్ ఖలీద్ కనపించాడనీ, కశ్మీర్ అంశంపై, అఫ్జల్ గురు విషయాలలో అతడు మద్ధతిస్తున్నట్లు కనిపించాడని సంజయ్ కుమార్ వెల్లడించారు. మరిన్ని వివరాలతో పాటు ఊమర్ ఖలీద్ జాతి వ్యతిరేఖ వివాదాల కార్యక్రమాలలో పాల్గొన్నాడా, లేదా అన్నది త్వరలో తెలుతుందన్నారు. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కొందరు విద్యార్థులను జేఎన్ యూ వర్సిటీ యాజమాన్యం గుర్తించిందని, పూర్తిస్థాయి దర్యాప్తులో అన్ని విషయాలు బయటికొస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీ హైకోర్టు బుధవారం షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. కన్హయ్యకు ఊరట కల్పిస్తూ జస్టిస్ ప్రతిభారాణితో కూడిన ధర్మాసనం ఆరు నెలల కాలానికి బెయిల్ మంజూరు చేసింది. ఆయన దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనరాదని, కేసు దర్యాప్తునకు సహకరించాలని నిర్దేశించింది. అవసరమైనపుడు అధికారుల ఎదుట ఆయన హాజరుకావాలని, కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. విడుదల కోసం రూ. 10 వేల వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలంది. తాను భారత్‌కు వ్యతిరేకంగా ఎటువంటి నినాదాలూ చేయలేదంటూ కన్హయ్య బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా హైకోర్టు మంజూరు చేసింది. మిగతా ఇద్దరూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.