ఐరాస సెక్రటరీ జనరల్‌గా ఆంటోనియో
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి తదుపరి సెక్రటరీ జనరల్‌గా పోర్చుగల్ మాజీ ప్రధానమంత్రి ఆంటోనియో గుటెరెస్ను సమితి సర్వసభ్య సభ గురువారం నియమించింది. సమితి 9వ సెక్రటరీ జనరల్‌గా 67 ఏళ్ల గుటెరెస్ నియామకానికి సంబంధించిన తీర్మానాన్ని మొత్తం 193 దేశాల సర్వసభ్య సభ హర్షిస్తూ ఆమోదించింది. ప్రస్తుత సెక్రటరీ జనరల్ బాన్ కి-మూన్ పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీతో ముగియనుంది. బాన్ తర్వాత ఆ పదవికి గుటెరెస్ను 15 మంది సభ్యుల ఐరాస భద్రతా మండలి గత వారం ఎన్నుకుని, ఆయన పేరును సర్వసభ్య సభకు సిఫారసు చేసింది.
గుటెరెస్ 1995 నుండి 2002 వరకూ పోర్చుగల్ ప్రధానమంత్రిగా పనిచేశారు. 2005 జూన్ నుండి 2015 డిసెంబర్ వరకు శరణార్థులకు ఐరాస హైకమిషనర్‌గా ఉన్నారు. ఆయన 2007 జనవరి 1వ తేదీ నుండి సమితి సెక్రటరీ జనరల్‌గా కొత్త బాధ్యతలు చేపడతారు. ఈ పదవీ కాలం ఐదేళ్ల పాటు ఉంటుంది. ఆ తర్వాత సభ్య దేశాలు ఆయన పదవీ కాలాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించవచ్చు.