ఐక్యరాజ్యసమితి తదుపరి సెక్రటరీ జనరల్‌గా పోర్చుగల్ మాజీ ప్రధానమంత్రి ఆంటోనియో గుటెరెస్‌ను సమితి సర్వసభ్య సభ గురువారం నియమించింది. సమితి 9వ సెక్రటరీ జనరల్‌గా 67 ఏళ్ల గుటెరెస్ నియామకానికి సంబంధించిన తీర్మానాన్ని మొత్తం 193 దేశాల సర్వసభ్య సభ హర్షిస్తూ ఆమోదించింది. ప్రస్తుత సెక్రటరీ జనరల్ బాన్ కి-మూన్ పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీతో ముగియనుంది. బాన్ తర్వాత ఆ పదవికి గుటెరెస్‌ను 15 మంది సభ్యుల ఐరాస భద్రతా మండలి గత వారం ఎన్నుకుని, ఆయన పేరును సర్వసభ్య సభకు సిఫారసు చేసింది.