AP Inter Results 2023
-
ఏపీ ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ వెల్లడి
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఇవాళ(మంగళవారం, జూన్ 13) వచ్చేశాయ్. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌కు సంబంధించి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ-ఇంప్రూవ్ మెంట్ ఫలితాల్ని ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు రిలీజ్ చేశారు. మే 24 నుంచి జూన్ 1 వరకు రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ జనరల్/వొకేషనల్ సప్లిమెంటరీ-ఇంప్రూవ్ మెంట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 4 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఫలితాల కోసం https://resultsbie.ap.gov.in/ క్లిక్ చేస్తే సరిపోతుంది. -
AP: నేటి నుంచి ఇంటర్ ఫలితాల రీకౌంటింగ్
సాక్షి, అమరావతి: ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఇంటర్ బోర్డుకు తెలియజేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఏప్రిల్ 27 నుంచి మే 6 వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 24 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు త్వరలో విడుదల చేస్తుందని తెలిపారు. అదే విధంగా జూన్ 5 నుంచి జూన్ 9 వరకు సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. -
ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ఫస్టియర్‌లో 65 శాతం, సెకండియర్‌లో 75 శాతం ఉత్తీర్ణతతో ప్రభంజనం సృష్టించారు. ఇక బాలురు ఫస్టియర్‌లో 58 శాతం, సెకండియర్‌లో 68 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ మేరకు ఇంటర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం విజయవాడలో విడుదల చేశారు. ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 8,13,033 మంది విద్యార్థులు హాజరుకాగా 5,38,327 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ద్వితీయ సంవత్సర విద్యార్థులు 3,79,758 మంది పరీక్షలు రాయగా 72 శాతం (2,72,001) మంది ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా మొదటి సంవత్సరం 4,33,275 మంది పరీక్షలకు హాజరవగా 61 శాతం (2,66,3266) మంది ఉత్తీర్ణులయ్యారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత పెరిగింది. 2022లో ఫస్టియర్‌లో 54 శాతం, సెకండియర్‌లో 61 శాతం ఉత్తీర్ణత నమోదైన సంగతి తెలిసిందే. ఈ లెక్కన ఈ ఏడాది ఫస్టియర్‌లో ఏడు శాతం, సెకండియర్‌లో 11 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఈ నెల 1 నుంచి 18 వరకు పరీక్ష పత్రాల మూల్యాంకనం చేపట్టి కేవలం 8 రోజుల రికార్డు సమయంలోనే œలితాలను ప్రకటించడం విశేషం. కాగా, ఫలితాల కోసం https://examresults. ap.nic.in, www.bie.ap.gov.in చూడొచ్చు. ఫలితాల్లో ఉమ్మడి కృష్ణా టాప్ ఈ విద్యా సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. పశ్చిమ గోదావరి (ఫస్టియర్) రెండో స్థానం, గుంటూరు (ఫస్టియర్) మూడో స్థానంలో నిలిచాయి. ఇక ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో గుంటూరు రెండో స్థానం, పశ్చిమ గోదావరి మూడో స్థానం దక్కించుకున్నాయి. ఒకేషనల్‌లోనూ బాలికలదే పైచేయి.. ఇంటర్ ఒకేషనల్ విభాగంలోనూ బాలికలే పైచేయి సాధించారు. బాలికలు ఫస్టియర్‌లో 58 శాతం, సెకండియర్‌లో 73 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక బాలురు ఫస్టియర్‌లో 37 శాతం, సెకండియర్‌లో 50 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా ఒకేషనల్ విభాగంలో ఫస్టియర్ పరీక్షలకు 36,031 మంది హాజరుకాగా 17,507 మంది (49 శాతం) ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ పరీక్షలకు 31,293 మంది హాజరవగా 19,430 మంది (62 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ ఫలితాల్లో ప్రకాశం జిల్లా 72 శాతంతో ప్రథమస్థానంలో నిలవగా, కర్నూలు 50 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది. విద్యకు అధిక ప్రాధాన్యం: మంత్రి బొత్స ఇంటర్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా ఫలితాలను సైతం రికార్డు స్థాయిలో వెల్లడించడం పట్ల సంతోషంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. అందుకే విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తున్నామన్నారు. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందని తెలిపారు. విద్యపై పెట్టిన ప్రతి పైసా పెట్టుబడితో సమానమని తమ ప్రభుత్వం నమ్ముతోందన్నారు. ఫలితాల వెల్లడి కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, ఇంటర్ విద్య కార్యదర్శి ఎం.వి శేషగిరిబాబు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్, సర్వశిక్ష ఎస్‌బీడీ శ్రీనివాస్, ఎండీఎం డైరక్టర్ నిధి మీనన్, పాఠ్యపుస్తకాల ముద్రణా సంస్థ డైరెక్టర్ రవీంద్రనాథ్‌రెడ్డి, ఇంటర్ బోర్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 6 వరకు రీకౌంటింగ్‌కు అవకాశం ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఇంటర్ బోర్డుకు తెలియజేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఏప్రిల్ 27 నుంచి మే 6 వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 24 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు త్వరలో విడుదల చేస్తుందని తెలిపారు. అదే విధంగా జూన్ 5 నుంచి జూన్ 9 వరకు సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. -
AP Inter Results 2023: ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేస్కోండి
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. కేవలం 22 రోజుల వ్యవధిలో ఫలితాలు విడుదల చేసింది విద్యాశాఖ. ఫలితాల వివరాలను మంత్రి బొత్స మీడియాకు వెల్లడించారు. ►ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 61 శాతం ఉత్తీర్ణత ►ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 72 శాతం ఉత్తీర్ణత ►ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ఫస్ట్ ►ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 70 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా సెకండ్ ►ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 68 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా థర్డ్ ►ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ఫస్ట్ ►ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 78 శాతం ఉత్తీర్ణతతోగుంటూరు జిల్లా సెకండ్ ►ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా థర్డ్ ►ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల్లో బాలుర కంటే బాలికలదే పైచేయి ►ఇంటర్ ఫస్టియర్ లో బాలురు 58%, బాలికలు 65 % ఉత్తీర్ణత ►ఇంటర్ సెకండియర్ లో బాలురు 68% , బాలికలు 75% ఉత్తీర్ణత ఫలితాలపై రీవెరిఫికేషన్ కి మే 6 లోపు అప్లై చేసుకోవాలి: మంత్రి బొత్స ►సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి ►ప్రాక్టికల్స్ మే 6 నుంచి జూన్ 9 వరకు జరుగుతాయి ►మే 3 లోపు సప్లిమెంటరీ పరీక్షలకి ఫీజు చెల్లించుకోవాలి ►విజయనగరం జిల్లాలో ఫలితాలు తగ్గడంపై సమీక్షిస్తాం ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు పరీక్షలు జరిగాయి. 4,84,197 మంది విద్యార్ధులు ఇంటర్ ఫస్టియర్, 5,19,793 మంది విద్యార్దులు సెకండియర్ పరీక్షలకు హాజరయ్యారు. అనంతపురం జిల్లా నార్పలలో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి బొత్స పాల్గొన్నారు. అయితే సీఎం హెలికాఫ్టర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తిన కారణంగా విద్యాశాఖ మంత్రి విజయవాడకు చేరుకోవడం ఆలస్యమైంది. ఈ కారణంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల ఆలస్యమయింది. ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి.. 1) https://results.sakshieducation.com/ దీనిపై క్లిక్ చేయండి 2) హోం పేజీపై కనపడుతున్న ఏపీ ఇంటర్ రిజల్ట్స్‌పై క్లిక్ చేయండి 3) మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి 4) మీ మార్క్ షీట్ ఓపెన్ అవుతుంది 5) మీ జాబితాను అక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు examresults.ap.nic.in, www.bie.ap.gov.in, మనబడి సైట్‌ల్లో కూడా మీ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు..