Apasrti
-
హోలీ వేడుకల్లో ఒకరి హత్య
వివాహేతర సంబంధమే కారణం ఇద్దరిపై కేసు నమోదు భీమారం : హోలీ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. తన రక్తసంబంధీకురాలితో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడనే నెపంతో హోలీ ఆడుతున్న ఓ వ్యక్తిని హత్య చేసిన సం ఘటన నగంరలోని భీమారంలో గురువారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కరీం నగర్ జిల్లా కేశవపూర్‌కు చెందిన ఎ. రవికుమార్(43)కు భార్య, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం రవికుమార్ డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు 20 ఏళ్ల క్రితం హసన్‌పర్తిలో స్థిరపడ్డాడు. కొంతకాలంగా స్థా నిక మహిళతో రవి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై మహిళ కుటుంబ సభ్యులతో పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. దీంతో రవికుమార్ ఆరు నెలల క్రితం తన మకాన్ని భీమారానికి మా ర్చాడు.ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఆరు గంటలకు భీమారంలో అతడు హోలీ సంబరాల్లో ఉండగా అక్కడికి హసన్పర్తికి చెం దిన ప్రసాద్ వెళ్లాడు. అతడితోపాటు భీమారానికి చెందిన జితేందర్ జతయ్యాడు. ఈ సందర్భంగా రవికుమార్ తన రక్తసంబధీకురాలితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడనే కోపంతో ప్రసాద్ అతడితో గొడవకు దిగాడు. ఈ క్రమంలో అతడి దాడిలో రవికుమార్ కుప్పకూలాడు. దీంతో భయపడిన ప్రసాద్ తన స్నేహితుడు అనిల్ సహకారంతో ద్విచక్ర వాహనంపై రవికుమార్‌ను వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికీ తీసుకెళ్లాడు. అక్కడ అడ్మిట్ చేసుకోవడానికి వైద్యు లు నిరాకరించారు.దీంతోఎంజీఎంఆస్పత్రికితీసుకెళ్లారు అప్పటికే భయంతో ప్రసాద్ ఆస్పత్రి బయటే ఉండగా, రవి కుమార్‌ను అనిల్ స్ట్రెచర్‌పై క్యాజువాలిటీలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నెమ్మదిగా జారుకునే ప్రయత్నం చేయగా వైద్యులు అతడిని గమనించి వివరాలు అడిగారు. జరిగిన సంఘటనను అనిల్ వైద్యులకు చెప్పాడు. వారు రవికుమార్‌ను పరిశీలించగా అప్పటికే ప్రాణాలు వదిలాడు. పోలీసులకు అప్పగింత కాగా అనిల్‌ను ఔట్‌పోస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేయూసీ పోలీసులకు సమాచారంఇచ్చారు.విషయం తెలుసుకున్న కేయూ సీఐ దేవేందర్‌రెడ్డి మార్చురీకి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. వివాహేతర సంబంధం కారణంతోనే హత్య జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న ప్రసాద్, జితేం దర్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అనిల్ కు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని, రవికుమార్‌ను ఆస్పత్రికి తరలించడానికి మాత్ర మే సహకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్నప్రసాద్ హ న్మకొండ మార్కెట్లో కూరగాయాల వ్యాపారం చేస్తుండగా, మరో నిందితుడు జితేందర్ సైతం భీమారంలో కూరగాయలు అమ్ముతున్నాడు. -
స్వచ్ఛభారత్‌లో అపశ్రుతి
వేంపల్లె : స్వచ్ఛభారత్ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. పాఠశాల ఆవరణంలో చెత్తా చెదారం తొలగించి శుభ్రంగా చేస్తుండగా ఓ విద్యార్థికి విషపురుగు కుట్టి మృతి చెందాడు. పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ఆ బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాలిలా ఉన్నారుు. ఇడుపులపాయ గ్రామ పంచాయతీలోని మారుతీ నగర్ ప్రాథమిక పాఠశాలలో ఆంజనేయులు, వెంకటేశ్వరమ్మల దంపతుల కుమారుడు వెంకట చరణ్ (6) 1వ తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో భోజన సమయంలో అక్కడ పాఠశాల ఆవరణంలో ఇతర విద్యార్థులతో కలిసి శుభ్రపరిచేందుకు వెళ్లాడు. ఆ సమయంలో వెంకట చరణ్ కుడికాలికి నొప్పి తగిలింది. వెంటనే అక్కడ ఉన్న ఉపాధ్యాయులు వెంకటేష్, గిరిజకుమారిలకు చెప్పాడు. ఏదో కుచ్చుకుని నొప్పిగా ఉందని తెలియజేయడంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు విషయాన్ని చేరవేశారు. తల్లి వెంకటేశ్వరమ్మ పాఠశాల వద్దకు వెళ్లి తన కొడుకును ఆటోలో వేంపల్లె ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ చికిత్స పొందుతూ వెంకటచరణ్ మృతి చెందాడు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే... స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో పాఠశాల ఆవరణాన్ని శుభ్రపరుస్తుండగా ఏదో విష పురుగు కుట్టిందని.. దీంతోనే తన కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు మృతి చెందారని తీవ్రస్థాయిలో తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి వద్ద అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులపై విరుచుకపడ్డారు. సంఘటన జరిగిన వెంటనే ఉపాధ్యాయులు ఆసుపత్రికి తీసుకెళ్లి ఉండి ఉంటే తమ కుమారుడు ప్రాణాలతో ఉండేవారని వారు కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడే ఉన్న ఆర్.కె.వ్యాలీ ఎస్ఐ ప్రదీప్‌నాయుడు ఘర్షణ జరగకుండా నిలువరించగలిగారు. తమ కుమారుడు మృతికి ఉపాధ్యాయులే కారణమని వాపోయారు. మృతి చెందిన వెంకట చరణ్‌కు నోటి నుండి బురుగు రావడంతో దాదాపు విష పురుగు కుట్టిందని నిర్థారణకు వచ్చారు. పోస్టుమార్టం నిర్వహిస్తే కానీ సరైన కారణం తెలియదు. ఆర్కె వ్యాలీ ఎస్ఐ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్ చేపట్టలేదు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టలేదని.. మధ్యాహ్న భోజన సమయంలో ప్లేట్లు శుభ్రపరిచేందుకు అక్కడికి వెళ్లి ఏదో ముళ్లు కుచ్చుకున్నట్లు తమ వద్దకు వచ్చారని అక్కడి ఉపాధ్యాయులు చెబుతున్నారు. పలువురి పరామర్శ మృతి చెందిన వెంకటచరణ్ మృతదేహాన్ని పలువురు రాజకీయ నాయకులు సందర్శించారు. తల్లిదండ్రులు, బంధువులను ఓదార్చారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇడుపులపాయ ఎంపీటీసీ, వేంపల్లె ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, వేంపల్లె గ్రామ సర్పంచ్ విష్ణువర్థన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డిలు పరామర్శించిన వారిలో ఉన్నారు. విద్యార్థి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ పులివెందుల డివిజన్ అధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి డిమాండు చేశారు. -
హోంమంత్రి కాన్వాయ్‌లో అపశృతి
మైదుకూరు టౌన్: మైదుకూరు నియోజవర్గంలోని జాండ్లవరం గ్రామంలో ఎన్టీఆర్ సృజల స్రవంతి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాన్వాయ్‌తో వెళుతుండగా అపశృతి చోటు చేసుకుంది. మైదుకూరు-జాండ్లవరం మార్గమధ్యంలోని పుల్లయ్యస్వామి సత్రం సమీపంలో మైదుకూరు యూత్ బలిజ సంఘం నాయకుడు ఏపీ రవీంద్ర వెళుతున్న స్కార్పియో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో 8 మంది గాయపడ్డారు. వీరిలో డ్రైవర్ నాగసుబ్బయ్య పరిస్థితి విషమంగా ఉంది. మహేష్, కిట్టు అనే వారు తీవ్రంగా గాయపడ్డారు. దస్తగిరి, చంద్ర, గోవిందు, హరి, సాయిలకు స్వల్పగాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి ఎస్ఐ నరసింహారెడ్డి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం డ్రైవర్ నాగసుబ్బయ్యను ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. -
నిమజ్జనానికి వెళ్లి.. నీట మునిగి
చెరువులోపడి ఒకరి మృతి పంథినిలో ఘటన గణపతి నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. నిమజ్జనం కోసం చెరువులోకి వెళ్లిన ఓ వ్యక్తి ఈత రాకపోవడంతో నీటమునిగి మృతిచెందిన సంఘటన మండలంలోని పంథినిలో సోమవారం రాత్రి జరిగింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం... పంథినికి చెందిన పొన్నం కొమురయ్య(43) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం రాత్రి గ్రామంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయక విగ్రహం ఊరేగింపులో పాల్గొన్న కొమురయ్య నిమజ్జనంలో భాగంగా ఊర చెరువు వద్దకు చేరుకున్నాడు. విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి యువకులతోపాటు అతడు నీళ్లలోకి దిగాడు. అరుుతే అతడికి ఈత రాకపోవడంతో నీటమునిగాడు. నిమజ్జన సంబురాల్లో ఉన్న యువకులు ఈ ఘటనను గమనించకుండా బయటకు వచ్చారు. తమ కంటే ముందుగానే కొమురయ్య ఇంటికి వెళ్లాడని భావించిన యువకులు గ్రామానికి వెళ్లిపోయూరు. మంగళవారం ఉదయం వరకు కొమురయ్య ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు యువకులను విచారించారు. ఆచూకీ లభించకపోవడంతో స్థానికుల సాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసిన ప్రదేశంలో గాలించగా విగ్రహం కింద కొమురయ్య మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య ఐలమ్మ, కుమార్తెలు సరిత, శారద, కుమారుడు రాజు ఉన్నారు. ఐలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్సై రవీందర్ తెలిపారు.