బంధుప్రీతి, బుజ్జగింపు విపక్షాలపై మోదీ ధ్వజం
వారణాసి/కోల్కతా: బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలే ప్రతిపక్షాల విధానమని ప్రధాని మోదీ మండిపడ్డారు. తన సొంత లోక్సభ నియోజవర్గమైన వారణాసిలో ఆదివారం రూ.6,700 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారణాసి శివారులోని సీగ్రాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో పదేళ్ల క్రితం వరకు వందల కోట్ల రూపాయల కుంభకోణాల గురించి పత్రికల్లో నిత్యం వార్తలు వస్తుండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో వారణాసిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచి్చన తర్వాత అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టలకు బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు తప్ప అభివృద్ధి అంటే ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. వారణాసి అభివృద్ధిని అవి పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు. ‘సబ్కా వికాస్’ సిద్ధాంతంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక గత 125 రోజులవ్యవధిలోనే దేశవ్యాప్తంగా రూ.15 లక్షల కోట్ల విలువైన పనులు ప్రారంభించామని చెప్పారు. అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలి్పంచడం తమ లక్ష్యమని ప్రకటించారు. ఎయిర్పోర్టు విస్తరణ పనులకు శంకుస్థాపన పశి్చమ బెంగాల్ రాష్ట్రం సిలిగురి సమీపంలోని బాగ్డోగ్రా ఎయిర్పోర్టు విస్తరణ పనులకు ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రూ.1,550 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఈ ఏడాది ఆగస్టులో ఆమోదం తెలిపింది. శంకర కంటి ఆసుపత్రి ప్రారంభం వారణాసిలో కంచి మఠం ఆధ్వర్యంలో నిర్మించిన ఆర్జే శంకర కంటి ఆసుపత్రిని మోదీ ప్రారంభించారు. ఈ ఆస్పత్రిలో ఏటా 30 వేల కంటి శస్త్రచికిత్సలు ఉచితంగా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు మఠం వర్గాలు తెలిపాయి. వారణాసికి రావడం ఆశీర్వచనంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా మోదీ అన్నారు. మత విశ్వాసాలకు, ఆధ్యాతి్మకతకు కేంద్రమైన వారణాసి నగరం ఆరోగ్య కేంద్రంగానూ అభివృద్ధి చెందుతుండడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మోదీపై కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్డీఏ అంటే ‘నరేంద్ర దామోదర్ దాస్ కా అనుశాసన్’ అని అభివర్ణించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మోదీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ఇది ప్రపంచంలోనే ఆదర్శవంతమైన ప్రభుత్వమని కొనియాడారు.