Aprameya Radhakrishna
-
ట్విటర్‌లాగా చార్జీలేమీ విధించం..
న్యూఢిల్లీ: యూజర్ల వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోసం ట్విటర్‌లాగా చార్జీలేమి విధించబోమని, ఇది పూర్తిగా ఉచితమేనని దేశీ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అప్రమేయ రాధాకృష్ణ చెప్పారు. ఆధార్ ఆధారిత స్వీయ ధృవీకరణతో పసుపు రంగు వెరిఫికేషన్ బ్యాడ్జ్‌ని ఉచితంగా పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. బాట్స్ (రోబో) సమస్యను సృష్టించినది ట్విటరే అని రాధాకృష్ణ ఆరోపించారు. మొదట్లో వాటిని ప్రోత్సహించిన ట్విటర్ ప్రస్తుతం నియంత్రించడానికి నానా తంటాలు పడుతోందని చెప్పారు. తాము సిసలమైన మనుషులమేనని యూజర్లు ధృవీకరించేందుకు, బ్లూ టిక్ పొందేందుకు .. వెరిఫికేషన్ పేరిట చార్జీలు వసూలు చేసే ప్రయత్నాల్లో ఉందని విమర్శించారు. కూ ఈ ఏడాది తొలి నాళ్ల నుండే స్వచ్ఛంద వెరిఫికేషన్‌ను యూజర్లకు చట్టబద్ధమైన హక్కుగా ఉచితంగా అందిస్తోందని రాధాకృష్ణ తెలిపారు. ఇప్పటివరకూ 1,25,000 మంది భారతీయ యూజర్లు దీన్ని ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా చీఫ్ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత పలు మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. భారీగా ఉద్యోగులను తొలగించడంతో పాటు వెరిఫైడ్ బ్యాడ్జ్‌ల కోసం 8 డాలర్ల ఫీజు విధించనుండటం మొదలైనవి వీటిలో ఉన్నాయి. -
వచ్చే దశాబ్దం మనదే...
సాంకేతిక రంగంలో ప్రస్తుత వృద్ధి, భవిష్యత్తు ప్రణాళికల దృష్ట్యా, వచ్చే దశాబ్దం భారతదేశానిదేనని కూ యాప్ సీఈఓ సహ వ్యవస్థాపకుడు అప్రమయ రాధాకృష్ణ అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన డిజిటల్ ఇండియా వీక్‌లో భాగంగా టెక్నాలజీ ఇండియా అండ్ ది వరల్డ్ అనే అంశంపై ’క్యాటలైజింగ్ న్యూ ఇండియా టేక్డ్’ అనే అంశంపై సదస్సులో కూ యాప్ సీఈఓ అప్రమయ రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంగ్లీషు మాట్లాడలేని ప్రతీ ఒక్కరి భావప్రకటనా స్వేచ్ఛ అనే కల సాకారం కోసం ప్రారంభమైన తమ స్టార్టప్ అంతకంతకూ పురోగమిస్తోందన్నారు. భారతదేశపు ప్రప్రధమ బహుభాషా మైక్రో–బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ ప్రస్తుతం వినూత్నమైన కొత్త ఫీచర్లతో సోషల్ మీడియా దిగ్గజాలకు సవాలు విసురుతోందని, నైజీరియాలో సైతం ఉపయోగించబడుతోందనీ వివరించారు.భవిష్యత్తులో ప్రపంచంలోని ఇతర దేశాలకూ కూ విస్తరించనుందన్నారు. భారత ప్రభుత్వం నిర్వహించిన ఈ డిజిటల్ ఇండియా వీక్‌ను ప్రధాని నరేంద్ర మోదీ గత సోమవారం ప్రారంభించారు. రెండో రోజు కార్యక్రమంలో స్టార్టప్ సదస్సు నిర్వహించారు. ఇందులో, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టెక్ స్టార్టప్‌లు పాల్గొని, ప్రధాని మోదీ కలలుగన్న డిజిటల్ ఇండియాకు అనుగుణంగా తమ భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన అనంతరం కూ సిఇఓ తన సంతోషాన్ని కూ వేదికగా పంచుకున్నారు. ఇదో అద్భుతమైన అవకాశమని పాల్గొన్నవారిలో సానుకూల ధృక్పధం కనిపించిందని అన్నారు. Koo App Participated at the Digital India Week event at Gandhinagar! What an atmosphere of positivity here! Great to be witness to the launch of all the wonderful new digital initiatives by our very own Union Ministers @rajeev_chandrasekhar @ashwinivaishnaw under the leadership of @narendramodi. The next decade is ours 🙂. #indiastechade #diw2022 View attached media content - Aprameya Radhakrishna (@aprameya) 5 July 2022