april 27
-
ఎయిర్ టెల్ షేర్ల బైబ్యాక్ పై 27న నిర్ణయం
న్యూఢిల్లీ : భారతీ ఎయిర్ టెల్ ఈ నెల 27న జరుపనున్న బోర్డు సమావేశంలో ఈక్విటీ షేర్ల బైబ్యాక్ ను పరిగణలోకి తీసుకోనుంది. ఎంత మొత్తంలో షేర్లు బైబ్యాక్ చేయనుందో వెల్లడికాలేదు. ఈ సమావేశంలో కంపెనీ బైబ్యాక్ ఈక్విటీ షేర్ల పరిశీలనతో పాటు 2016 మార్చి 31న ముగిసిన ఆర్థిక సంవత్సర తుది డివిడెంట్ పై కూడా నిర్ణయం తీసుకోనున్నట్టు బీఎస్ఈ సెన్సెక్స్ కు భారతీ ఎయిర్ టెల్ కంపెనీ నివేదించింది. మార్చి 31న ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి పబ్లిక్ షేర్ హోల్డింగ్ 33.21 శాతం ఉండగా, ప్రమోటర్లు వాటా 66.74 శాతం కలిగి ఉన్నారు. భారత్ లోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్ గా ఉన్న భారతీ ఎయిర్ టెల్ ఓపెన్ మార్కెట్ ట్రేడ్ డీల్ ద్వారా 5శాతం ఇన్ ఫ్రాటెల్ టవర్ వాటాను అమ్మకం పెట్టనుంది. ఈ డీల్ తో రూ.3,500 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల వరకూ రాబట్టనుంది. ఈ వాటా అమ్మకం కేవలం కంపెనీ రుణాన్ని తగ్గించుకోవడానికే చేపట్టనుందని తెలుస్తోంది. కానీ వాటా అమ్మకం ఎప్పుడు చేపడుతుందో కంపెనీ వెల్లడించలేదు. 2015 డిసెంబర్ నాటికి ఎయిర్ టెల్ నికర రుణం రూ.78,816 కోట్లుగా ఉంది. -
గుర్రపుస్వారీ కోసం ప్రత్యేక శిక్షణా తరగతులు
రంగారెడ్డి (మొయినాబాద్) : మానవుని ఆరోగ్యానికి గురపుస్వారి ఎంతో తోడ్పడుతుందని గురపుస్వారీ శిక్షణ మేనేజర్ రియాజ్ మహమ్మద్ అన్నారు. మొయినాబాద్ మండలంలోని అజీజ్నగర్ సమీపాన గల హైదరాబాద్ పోలోరైడ్క్లబ్లో ఏప్రిల్ 27నుంచి సమ్మర్ క్యాంప్లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గురపుస్వారీ చేయటంతో పొట్ట, బరువు, కొవ్వు తగ్గటం లాంటివి జరుగుతాయని పేర్కొన్నారు. విద్యాసంస్థలకు సెలవులు రావటంతో సమ్మర్క్లాస్ను నెల రోజుల పాటు నిర్వహిస్తున్నామని చెప్పారు. నాయకత్వ లక్షణాలపై సమ్మర్ క్యాంప్ హైదరాబాద్ (మలక్పేట) : నగరంలోని దిల్సుఖ్నగర్లో ఆకెళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాయకత్వ లక్షణాలపై ఏప్రిల్ 27న ప్రారంభం కానున్న సమ్మర్క్యాంపు పోస్టర్ను ఫౌండేషన్ వ్యవస్థాపకులు శనివారం అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విత్తనంలా ఒదిగి, మహావృక్షంలా ఎదిగి సమాజానికి నీడను ఇవ్వడమే మానవ జన్మకు పరమార్థమన్నారు. ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి నాయకత్వ లక్షణాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. యువతీయువకులు ముందుకు వచ్చి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు 8985894254 నెంబరును సంప్రదించాలని కోరారు.