రంగారెడ్డి (మొయినాబాద్) : మానవుని ఆరోగ్యానికి గురపుస్వారి ఎంతో తోడ్పడుతుందని గురపుస్వారీ శిక్షణ మేనేజర్ రియాజ్ మహమ్మద్ అన్నారు. మొయినాబాద్ మండలంలోని అజీజ్‌నగర్ సమీపాన గల హైదరాబాద్ పోలోరైడ్‌క్లబ్‌లో ఏప్రిల్ 27నుంచి సమ్మర్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గురపుస్వారీ చేయటంతో పొట్ట, బరువు, కొవ్వు తగ్గటం లాంటివి జరుగుతాయని పేర్కొన్నారు. విద్యాసంస్థలకు సెలవులు రావటంతో సమ్మర్‌క్లాస్‌ను నెల రోజుల పాటు నిర్వహిస్తున్నామని చెప్పారు.
నాయకత్వ లక్షణాలపై సమ్మర్ క్యాంప్
హైదరాబాద్ (మలక్‌పేట) : నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఆకెళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాయకత్వ లక్షణాలపై ఏప్రిల్ 27న ప్రారంభం కానున్న సమ్మర్‌క్యాంపు పోస్టర్‌ను ఫౌండేషన్ వ్యవస్థాపకులు శనివారం అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విత్తనంలా ఒదిగి, మహావృక్షంలా ఎదిగి సమాజానికి నీడను ఇవ్వడమే మానవ జన్మకు పరమార్థమన్నారు. ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి నాయకత్వ లక్షణాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. యువతీయువకులు ముందుకు వచ్చి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు 8985894254 నెంబరును సంప్రదించాలని కోరారు.