సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల విరామానంతరం తిరిగి ఈ ఏడాది జీహెచ్‌ఎంసీ వేసవి శిక్షణ (సమ్మర్ కోచింగ్ క్యాంపులు) శిబిరాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ యంత్రాంగం సమాయత్తమవుతోంది. రెండు సంవత్సరాలుగా కోవిడ్ తీవ్రత.. నిరోధక చర్యల కట్టడి నిబంధనల్లో భాగంగా కోచింగ్ క్యాంపులు నిర్వహించలేదు. ప్రస్తుతానికి పరిస్థితి సజావుగా ఉండటంతో వీటి నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గత రెండేళ్లుగా సమ్మర్ కోచింగ్ క్యాంపులు లేనందున వాటిని నిర్వహించే ఇండోర్ స్టేడియంలలో పరిస్థితులు చక్కదిద్దే పనిలో పడ్డారు. దాంతోపాటు అవసరమైన క్రీడా పరికరాలు, సామగ్రి కోసం టెండర్లు పిలుస్తున్నారు. సమ్మర్ కోచింగ్ క్యాంపులను విద్యార్థులకు ప్రతియేటా నిర్వహించేవారు. యాభైఏళ్లకు పైగా చరిత్ర ఉన్న సమ్మర్ కోచింగ్ క్యాంప్స్‌ను వేదికగా చేసుకొని జాతీయస్థాయికి ఎదిగిన క్రీడాకారులెందరో ఉన్నారు. (క్లిక్: దిగ్గజ కంపెనీలు భాగ్యనగర్ దిశగా!)
ఈ శిక్షణ శిబిరాల ద్వారా నైపుణ్యాన్ని మెరుగుపరచుకున్నవారూ ఉన్నారు. యాభైఏళ్ల క్రితం కేవలం పది ప్లేగ్రౌండ్లలో ఆరు క్రీడాంశాల్లో, 15 మంది కోచ్‌లతో తొలి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభమైంది. అప్పట్లో దాదాపు 1600 మంది విద్యార్థులు శిబిరాల్ని వినియోగించుకోగా, గడిచిన రెండు దశాబ్దాలుగా ప్రతియేటా వేలాదిమంది వినియోగించుకుంటున్నారు. యాభైకి పైగా క్రీడాంశాల్లో వందలమంది కోచ్‌లు శిక్షణనిస్తున్నారు. గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గ్రేటర్‌లోని అన్ని జోన్లలో సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. (క్లిక్: సజ్జనార్ స్పెషల్.. ఒక్కరు మినహా అందరు ఈడీల బదిలీ)
Comments
Please login to add a commentAdd a comment