ApSpecialStatus
-
కడపలో కొనసాగుతోన్న బంద్
-
మీ స్ఫూర్తే నన్ను నడిపిస్తోంది: వైఎస్ జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేవరకు పోరు ఆగదని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. నాకు మీరిచ్చిన మద్దతు, నా పై చూపించిన ఆప్యాయత మరవలేనిదని ప్రజలను ఉద్దేశించి ఆయన తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధించాలనే మీరిచ్చిన స్పూర్తే తనను నడిపిస్తుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు మన పోరు కొనసాగుతోందని వైఎస్ జగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద ఏడు రోజులపాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించటంతో పోలీసులు దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న వైఎస్ జగన్ ను వైద్యులు నిన్న సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. Deeply touched by your support, commitment & affection. Your spirit kept me going.Our battle will continue till we achieve #APSpecialStatus. — YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2015 -
హోదా వచ్చే వరకూ పోరు ఆగదు
వైఎస్స్ జగన్ ఆరోగ్యం మెరుగు పడాలని అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చాంద్ బాషా కదిరి నానా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా వచ్చే వరకూ తమ పార్టీ అధినేత పోరాటం ఆగదని స్పష్టం చేశారు. జగన్ దీక్ష భగ్నం చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం భగ్నం చేసింది జగన్ దీక్షను కాదని.. ఐదు కోట్ల ఆంధ్రుల హక్కును అని వ్యాఖ్యానించారు. -
వైఎస్ జగన్ను కలిసిన పార్టీ నేతలు
గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం పార్టీ నేతలు కలిశారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ని పార్టీ నేతలు పరామర్శించారు. వైఎస్ జగన్ను కలిసినవారిలో విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణ కోసం వైఎస్సార్ సీపీ ముఖ్యనేతల సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సంప్రదించి పోరాట కార్యాచరణ ప్రకటించనున్నారు. అంతకు ముందు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరాహారదీక్షను బలవంతంగా విరవింపజేసిన నేపథ్యంలో గుంటూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నాయకులు సమావేశమయ్యారు. ప్రత్యేక హోదా పోరాటాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించారు. వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.