వైఎస్స్ జగన్ ఆరోగ్యం మెరుగు పడాలని అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చాంద్ బాషా కదిరి నానా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
వైఎస్స్ జగన్ ఆరోగ్యం మెరుగు పడాలని అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చాంద్ బాషా కదిరి నానా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా వచ్చే వరకూ తమ పార్టీ అధినేత పోరాటం ఆగదని స్పష్టం చేశారు. జగన్ దీక్ష భగ్నం చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం భగ్నం చేసింది జగన్ దీక్షను కాదని.. ఐదు కోట్ల ఆంధ్రుల హక్కును అని వ్యాఖ్యానించారు.