Archery World Cup Stage 1
-
నాలుగో ర్యాంక్‌లో జ్యోతి సురేఖ..
ఆర్చరీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ నాలుగో స్థానంలో నిలిచింది.గత ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌లో ఉన్న జ్యోతి సురేఖ కొరియాలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–2 టోరీ్నలో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోవడంతో ఆమె ర్యాంక్‌లో మార్పు వచ్చింది. భారత్‌కే చెందిన అదితి 10వ ర్యాంక్‌లో, పరీ్ణత్ కౌర్ 12వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. టీమ్ విభాగంలో సురేఖ, అదితి, పరీ్ణత్ బృందం నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. -
పసిడి పోరుకు జ్యోతి సురేఖ జోడీ
అంటాల్యా (తుర్కియే): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు పతకం ఖరారైంది. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, మహారాష్ట్ర ప్లేయర్ ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలె ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన సురేఖ–ఓజస్ రెండో రౌండ్లో 159–157తో మరియా–గైల్స్ (లక్సెంబర్గ్)లపై... క్వార్టర్ ఫైనల్లో 159–156తో సోఫీ–అడ్రియన్ గోంటీర్ (ఫ్రాన్స్)లపై... సెమీఫైనల్లో 157–155తో ఫాతిన్ నూర్‌ఫతే–జువైది (మలేసియా)లపై గెలిచారు. నేడు జరిగే ఫైనల్లో చెన్ యి సువాన్–చెన్ చియె లున్ (చైనీస్ తైపీ)లతో జ్యోతి సురేఖ–ఓజస్ తలపడతారు. రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మాత్రం అతాను దాస్–భజన్ కౌర్ (భారత్) ద్వయం తొలి రౌండ్లో 3–5తో డెన్మార్క్ జోడీ చేతిలో ఓడిపోయింది. ధీరజ్ అద్భుతం... పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ధీరజ్ బొమ్మదేవర అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి రౌండ్లో ధీరజ్ 6–0తో థియో కార్బొనెటి (బెల్జియం)పై, రెండో రౌండ్లో 6–4తో కెజియా చాబిన్ (స్విట్జర్లాండ్)పై, మూడో రౌండ్లో 6–4తో జిగా రావ్నికర్ (స్లొవేనియా)పై, నాలుగో రౌండ్లో 6–5తో అమెరికా దిగ్గజం బ్రాడీ ఇలిసన్పై, క్వార్టర్ ఫైనల్లో 6–4తో తరుణ్‌దీప్ రాయ్ (భారత్)పై గెలుపొందాడు. ప్రపంచ మాజీ చాంపియన్, మూడు ఒలింపిక్ పతకాలు నెగ్గిన ఇలిసన్తో జరిగిన మ్యాచ్‌లో ధీరజ్ ‘షూట్ ఆఫ్’లో గెలిచాడు. ఇద్దరూ 10 పాయింట్లు స్కోరు చేసినా ధీరజ్ కొట్టిన బాణం 10 పాయింట్ల లక్ష్యబిందువుకు అతి సమీపంలో ఉండటంతో విజయం ఖరారు చేసుకున్నాడు. ఆధిక్యంలో అర్జున్ సాటీ జుల్డిజ్ ఓపెన్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో ఎనిమిది రౌండ్ల తర్వాత తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఏడు పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన నాలుగు గేముల్లో మూడింట గెలిచిన అర్జున్, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. వఖిదోవ్ (ఉజ్బెకిస్తాన్), బిబిసారా (కజకిస్తాన్), బోరిస్ గెల్ఫాండ్ (ఇజ్రాయెల్)లపై నెగ్గిన అర్జున్ జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమెర్‌తో జరిగిన గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. 12 మంది అగ్రశ్రేణి ప్లేయర్ల మధ్య 11 రౌండ్లపాటు ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. నేడు చివరి మూడు రౌండ్లు జరుగుతాయి. -
Antalya: జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు
అంటాల్యా (తుర్కియే): భారత అగ్రశ్రేణి ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కొత్త సీజన్లో శుభారంభం చేసింది. ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో ఆమె క్వాలిఫయింగ్‌లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు మరో ప్రపంచ రికార్డును సమం చేసింది. మంగళవారం జరిగిన మహిళల కాంపౌండ్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ మొత్తం 713 పాయింట్లు స్కోరు చేసింది. 2015లో సారా లోపెజ్ (కొలంబియా) 713 పాయింట్లతో నమోదు చేసిన ప్రపంచ రికార్డును సురేఖ సమం చేసింది. అంతేకాకుండా కొత్త ఆసియా రికార్డును సృష్టించింది. 2017లో కొరియా ఆర్చర్ 709 పాయింట్లతో నమోదు చేసిన రికార్డును సురేఖ సవరించింది. క్వాలిఫయింగ్‌లో ఒక్కో ఆర్చర్ 72 బాణాలు సంధించాలి. తొలి రౌండ్లో 36, రెండో రౌండ్లో మరో 36 బాణాలు సంధిస్తారు. తొలి రౌండ్లో జ్యోతి సురేఖ 353 పాయింట్లు... రెండో రౌండ్లో 360 పాయింట్లు సాధించింది. రెండో రౌండ్లో జ్యోతి సురేఖ కొట్టిన 36 బాణాలు 10 పాయింట్ల సర్కిల్‌లోకి వెళ్లడం విశేషం. దాంతో ఆమె అందుబాటులో ఉన్న మొత్తం 360 పాయింట్లను తన ఖాతాలోకి వేసుకుంది. ఈ క్రమంలో జ్యోతి సురేఖ 360కి 360 పాయింట్లు స్కోరు చేసిన తొలి మహిళా ఆర్చర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ ప్రదర్శనతో 2015 నుంచి సారా లోపెజ్ (356 పాయింట్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును జ్యోతి సురేఖ బద్దలు కొట్టింది. ‘ప్రపంచ రికార్డు సాధిస్తానని ఊహించలేదు. ఇదే నా అత్యుత్తమ ప్రదర్శన. టాప్ సీడ్‌తో మెయిన్ రౌండ్లో బరిలోకి దిగనుండటం సంతోషంగా ఉంది. ఎలిమినేషన్ రౌండ్లలోనూ పూర్తి ఏకాగ్రతతో పోటీపడతాను’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి సురేఖ వ్యాఖ్యానించింది. క్వాలిఫయింగ్‌లో టాప్ ర్యాంక్‌లో నిలిచిన సురేఖకు ఎలిమినేషన్ రౌండ్లలో టాప్ సీడ్ దక్కింది. భారత్‌కే చెందిన అదితి, అవ్నీత్ కౌర్ స్కోర్ల ఆధారంగా క్వాలిఫయింగ్ టీమ్ విభాగంలో భారత్ 2,112 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకొని నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. 2011 నుంచి భారత జట్టుకు ఆడుతున్న సురేఖ అంతర్జాతీయ టోర్నీలలో 30 కంటే ఎక్కువ పతకాలు సాధించింది. -
భారత్ ‘పసిడి’ గురి
♦ తొలిసారి స్వర్ణం నెగ్గిన పురుషుల కాంపౌండ్ జట్టు ♦ ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీ షాంఘై: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నమెంట్లో భారత జట్టు ‘గురి’ అదిరింది. కాంపౌండ్ ఈవెంట్లో పురుషుల జట్టు పసిడి పతకంతో మెరిసింది. ప్రపంచకప్ కాంపౌండ్ విభాగం చరిత్రలో భారత్‌కిదే తొలి స్వర్ణం కావడం విశేషం. శనివారం జరిగిన ఫైనల్లో అభిషేక్ వర్మ, రాజు చిన్న శ్రీధర్, అమన్‌జీత్ సింగ్‌లతో కూడిన భారత జట్టు 226–221 స్కోరుతో కార్డొనా, డానియెల్ మునోజ్, కార్లొస్‌లతో కూడిన కొలంబియా జట్టును కంగుతినిపించింది. ఫైనల్లో భారత బృందం మూడు ప్రయత్నాల్లో నాలుగు సార్లు పదికి పది పాయింట్లు సాధించింది. ఈ నాన్–ఒలింపిక్ ఈవెంట్ తొలి ప్రయత్నంలో 58–57తో ముందంజ వేసిన భారత జట్టు... రెండో ప్రయత్నంలోనూ 58–56తో కొలంబియన్లపై ఆధిక్యాన్ని చాటుకుంది. దీంతో 116–113 పాయింట్లతో పైచేయి సాధించింది. మూడో ప్రయత్నంలో తడబడినప్పటికీ (52–52)... భారత్ 168–165 ఆధిక్యంలోనే నిలిచింది. చివరి ప్రయత్నంలో భారత బృందం మళ్లీ పదికి పది పాయింట్లను సాధించడంతో (58–56) విజయం ఖాయమైంది. ఒలింపిక్ ఈవెంట్ అయిన రికర్వ్ ఈవెంట్ (వ్యక్తిగత)లో అతాను దాస్, దీపిక కుమారి క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించారు. కాంపౌండ్ మిక్స్డ్ ఈవెంట్లో అభిషేక్ వర్మ–జ్యోతి సురేఖ జోడి నిరాశ పరిచింది. కాంస్య పతక పోరులో ఈ జంట 151–153తో రియో విల్డే–జెమి వాన్ నటా (అమెరికా) ద్వయం చేతిలో పరాజయం చవిచూసింది.