Area Committee
-
ఇద్దరు మావోయిస్టు నేతల లొంగుబాటు
వరంగల్ రూరల్ ఎస్పీ కాళిదాసు వెల్లడి వరంగల్, న్యూస్‌లైన్: మావోయిస్టు పార్టీలో ఏరియా కమిటీ సభ్యులిద్దరు శనివారం లొంగిపోయినట్లు వరంగల్ రూరల్ ఎస్పీ కాళిదాసు రంగారావు తెలిపారు. వీరిలో వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం ముప్పానపల్లికి చెందిన పాపారావు అలియాస్ రంజిత్, గూడూరు మండలం సీతానాగారం గ్రామానికి చెందిన ఎదుళ్ల భాస్కర్‌రెడ్డి అలియూస్ రామకృష్ణ ఉన్నారు. పాపారావు ఏటూరునాగారం-మహదేవపూర్ ఏరియా కమిటీ సభ్యుడిగా, భాస్కర్‌రెడ్డి గుండాల-నర్సంపేట ఏరియా దళ సభ్యుడిగా పనిచేస్తున్నారని ఎస్పీ తెలిపారు. కాగా, పాపారావు కమలాపురంలోని బిల్ట్ జీఎం హత్య కేసుతోపాటు ఇంకా పలు కేసుల్లో నిందితుడని చెప్పారు. చుండూరు నిందితులకు శిక్ష తప్పదు ఓ టీవీ చానల్లో మావోల పేరుతో హెచ్చరిక గుంటూరు, న్యూస్‌లైన్: చుండూరులో దళితుల ఊచకోతకు పాల్పడిన నిందితులు కోర్టు నుంచి తప్పించుకున్నప్పటికీ.. ప్రజాకోర్టులో వారికి శిక్ష తప్పదంటూ మావోయిస్టు పార్టీ ప్రతినిధి జగన్ పేరుతో ఓ టీవీ చానల్లో శనివారం వెలువడిన ప్రకటన కలకలం సృష్టించింది. నిందితులను కారంచేడు తరహాలో శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనిపై ఆరా తీస్తున్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ దుష్ర్పచారం చేస్తున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత మీడియా ప్రతినిధికి పోలీసులు ఫోన్ చేసి వివరాలడిగి తెలుసుకున్నట్టు సమాచారం. -
పోలీసుల గుప్పిట ‘మావో’ల గుట్టు
సాక్షి, విశాఖపట్నం : మావోయిస్టు కోరుకొండ దళానికి గట్టి షాక్ తగిలింది. అనారోగ్యం వల్ల దళం నుంచి నిష్ర్కమించి, లొంగిపోయిన నలుగురు మిలిటెంట్లు నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్టు తెలిసింది. దాని ఆధారంగా దళంలోని మిగిలిన సభ్యులపై ఉక్కుపాదం మోపేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కూంబింగ్‌కు సన్నద్ధమవుతున్నారు. కోరుకొండ ఏరియా కమిటీలో కీలకంగా వ్యవహరించి నల్లమల,తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాం తాల్లో కమాండర్‌గా పనిచేసిన సంతోష్ అలియాస్ కొర్ర సత్తిబాబు, ఆయన భార్య సుజాత, మరో ఇద్దరు దళ సభ్యులు అనారోగ్యం కారణంగా పార్టీ నాయకత్వం అనుమతితో జనజీవన స్రవంతిలోకి వచ్చారు. మున్ముందు ఇబ్బందులు ఎదుర్కోకుండా పో లీస్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి లొంగిపోయారు. మరింత సమాచారం కోసం వారిని ప్రస్తుతం స్పెషల్ ఇంటెలిజెన్స్ పోలీసు లు విచారిస్తున్నారు. ఇప్పటికే కీలక సమాచారాన్ని రాబట్టిన ఉన్నతాధికారులు డాక్యుమెంటేషన్ ప్రక్రియ అనంతరం వారి లొంగుబాటును అధికారికంగా ప్రకటించనున్నారు. సంతోష్‌ది గూడెం కొత్తవీధి మండలం ఎర్రగెడ్డ గ్రామం. నాలుగేళ్ల క్రితం దళంలో చేరాడు. పలు హింసాత్మక ఘటనలలో పాల్గొన్నాడు. సంతోష్‌పై రూ.4లక్షలు, సుజాతపై రూ.లక్ష రివార్డు ఉంది. వారి నుంచి లభించిన సమాచారంతో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టుల దూకుడుకు ముకుతాడు వేసేందుకు పోలీసులు పక్కా ప్రణాళికతో సంసిద్ధమైనట్టు తెలిసింది.