arjunudu
-
గన్నవరం టీడీపీ అభ్యర్థి ఎవరు?.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఆ నియోజకవర్గంలో సైకిల్ పార్టీకి తుప్పు పట్టిపోయింది. ఎక్కడి నుంచో తెచ్చి తమ నెత్తిన రుద్దిన ఇంచార్జ్ మీద చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఇదేం ఖర్మ కార్యక్రమానికి వెళుతున్న పార్టీ అధినేతను దారి మధ్యలో కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారట. తనకు, తన పార్టీకి పట్టిన ఖర్మ గురించి చింతిస్తూ సైకిల్ పార్టీ బాస్ అలా ముందుకు సాగిపోయారట. అర్జునుడా ఇదేం అన్యాయం.? కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాంటి నియోజకవర్గం గన్నవరం. ఇక్కడ బలమైన కమ్మ సామాజికవర్గమే గెలుపును నిర్ణయిస్తుంది. ఈ క్రమంలోనే రెండు సార్లు టీడీపీ తరపున గన్నవరం నుంచి వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం జగన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితుడైన వంశీ వైసీపీ ప్రభుత్వానికి తన మద్దతు పలికారు. ఫలితంగా గన్నవరంలో టీడీపీకి నాయకుడు లేకుండా పోయాడు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మచిలీపట్నానికి చెందిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని తీసుకొచ్చి గన్నవరం నియోజకవర్గం ఇంఛార్జి బాధ్యతలను అప్పగించారు చంద్రబాబు. ఎవరో ఒకరులే.. ఇంఛార్జి రూపంలో తమకొక నాయకుడు దొరకాడని గన్నవరం తమ్ముళ్లు సరిపెట్టుకున్నారు. కాని టీడీపీ క్యాడర్ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఇంఛార్జిగా వచ్చాడే కానీ బచ్చుల క్యాడర్‌ను పట్టించుకోవడం మానేశాడట. ఓ వర్గాన్ని మాత్రమే తనతో తిప్పుకుంటూ తొలినుంచీ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలను గాలికి వదిలేశాడట. కనీసం పార్టీ కార్యక్రమాల సమాచారం కూడా గన్నవరం కేడర్‌కు ఇవ్వడం లేదట. బచ్చుల వైఖరితో విసిగిపోయిన అక్కడి నాయకులు, కార్యకర్తలు గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్ మొహం చూడటం మానేశారట. సైకిల్‌కు స్టాండ్ లేదా? గన్నవరం ఇంచార్జ్ బచ్చుల అర్జునుడి వైఖరి నచ్చక ఎవరైనా ప్రశ్నిస్తే వారి పైనే ఫైరవుతున్నాడట. సమస్యలను బచ్చుల దృష్టికి తీసుకెళితే మీరేంటి నాకు చెప్పేది అంతా నాకు తెలుసు అంటూ దబాయిస్తున్నాడట. మీరంతా పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు.. ఎమ్మెల్యే వంశీ వర్గీయులు అని ముద్రవేస్తున్నాడట. ఎవరైనా గట్టిగా మాట్లాడారో పార్టీ నుంచి సస్పెండ్ చేసి పడేస్తానని బెదిరిస్తున్నారట. వార్నింగ్ ఇవ్వడమే కాదు.. బచ్చుల అర్జునుడు ఇంఛార్జి అయిన తర్వాత ఇప్పటి వరకూ పదిమందిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేశాడట. ఐతే ఈ పరిణామాలతో నైరాశ్యంలో పడ్డ క్యాడర్ పార్టీ ఆఫీస్‌కు, కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారట. పార్టీ అధినేతతో పాటు ఎవరైనా ముఖ్య నేతలు వచ్చినపుడు.. ఎయిర్ పోర్టులో కలిసి వచ్చేస్తున్నారని సమాచారం. చదవండి: మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు లీడర్ కాదు, లీడర్ షిప్ కావాలి ఇంఛార్జిగా కొనసాగుతున్న బచ్చులలో కనీసం నాయకుడి లక్షణాలు లేకపోయినా.. రెండేళ్లుగా సరిపెట్టుకుంటున్న క్యాడర్‌కు ఇక ఓపిక నశించిపోయింది. అందుకే తమ పంచాయతీని అధినేత ఎదుటే తేల్చుకోవాలని భావించారట. ఇదేం ఖర్మ కార్యక్రమానికి వెళుతున్న చంద్రబాబుకు బచ్చుల అర్జునుడి వ్యతిరేక వర్గం అంతా కట్టకట్టుకుని వెళ్లి మరీ స్వాగతం పలికారట. అధినేతకు స్వాగతం పలకడంతో సరిపెట్టకుండా బచ్చుల అర్జునుడి వైఖరి పట్ల తమలో ఉన్న ఆవేదనంతా ఓ లేఖలో వెళ్ళగక్కారట. మరోవైపు బచ్చుల, అతని అనుకూల వర్గం మరోచోట చంద్రబాబుకు స్వాగత ఏర్పాట్లు చేశారట. రెండు వర్గాలు రెండు ప్రదేశాల్లో స్వాగత ఏర్పాట్లను ఊహించని చంద్రబాబు.. ఈ పరిణామాలతో షాకయ్యారట. ఓ వైపు ఇదేం ఖర్మరా కార్యక్రమానికి వెళ్తుంటే పార్టీలో గొడవలు.. పంచాయతీలు స్వాగతం పలుకుతుండటంతో.. నాకిదేం ఖర్మరా బాబు అనుకుంటూ తలబాదుకుంటున్నారట పచ్చ పార్టీ బాస్ చంద్రబాబునాయుడు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
కార్యకర్తతో బూట్లు తొడిగించుకున్న టీడీపీ ఎమ్మెల్సీ
సాక్షి, విజయవాడ: బీసీలను ఉద్ధరిస్తామని, కార్యకర్తలే తమ బలమని ప్రగల్భాలు పలికే టీడీపీ నాయకులు క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మాటల్లో మినహా.. చేతల్లో బీసీలన్నా, కార్యకర్తలన్నా వారికి చులకనే. ఇటీవల బాపులపాడు మండలం మల్లవల్లిలో జరిగిన ఓ ఘటన కార్యకర్తలను ఔరా! అనిపించింది. టీడీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ‘ప్రతి ఇంటికి తెలుగుదేశం’ పేరుతో ఈ నెల 19న మల్లవల్లిలో పర్యటించారు. ఓ కార్యకర్తతో తన షూస్ తొడిగించుకున్న ఘటన అక్కడి వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. టీడీపీ నాయకులు ఈ రకంగా వ్యవహరించటం ఎంత వరకు సమంజసమని గ్రామస్తులు చర్చించుకున్నారు. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్‌గా మారింది. చదవండి: (రాజకీయ జీవితంపై గల్లా అరుణకుమారి సంచలన వ్యాఖ్యలు) -
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడో తెలుసా?
అభయం, చిత్తశుద్ధి, జ్ఞానయోగంలో నెల కొనడం,దానం, దమం,యజ్ఞం,వేదాధ్యయనం, తపస్సు, సరళత్వం, అహింస, క్రోధరాహిత్యం, త్యాగం, శాంతి, చాడీలు చెప్పకపోవడం, సర్వప్రాణుల యందు దయ కలిగిఉండడం,విషయ. వాంఛలు లేకపోవడం, మృదుత్వం, బిడియం, చపలత్వం లేకపోవడం, ద్రోహబుద్ధి, దురభి మానం లేకుండడం, తేజస్సు, క్షమాగుణం,శుచిత్వం మొదలైన సద్గుణాలు. దైవీ సంపత్తితో మూర్తీభవించి ఉంటాయి అని శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడికి చెప్పేడు.ఈ సద్గుణాలు కేవలం అర్జునునకో లేక ద్వాపర యుగానికో పరిమితమైనవి కావు.ఈ సమస్త విశ్వంలో మానవజాతి ఉన్నంతవరకు సర్వులకు అవసరమే.ఎన్ని అధునాతన సాధన సంపత్తి వున్నా మానవుడు ప్రశాంత జీవితాన్ని గడప లేక పోతున్నాడు. ఎటు చూసినా హింస, క్రౌర్యం, అసంతృప్తి పెచ్చు పెరుగుతున్నాయి. మానవతా విలువలు లేని వ్యక్తి అభివృద్ధి చెందడం అసాధ్యం. ఆత్మ నిగ్రహం లేని వాడు ఉన్నతమైన జీవితాన్ని పొందలేడు. క్షణభంగురమైన ఇంద్రియ సుఖాల కోసం పరుగులు తీస్తూ తన పతనానికి తానే కారణమౌతున్నాడు. మనిషి జీవిత ధ్యేయం ఇంద్రియసుఖానుభవం కాదు. ఇంద్రియాలను ఎప్పటికీ తృప్తి పరచ లేము. అగ్నిలో ఆజ్యం పోసినట్లు సుఖాలు అనుభవించే కొద్ది మరిన్ని కోరికల పుడ తాయి.కాని మనిషి తృప్తి చెందడు. మానవ జీవితానికి ఉన్నతమైన లక్ష్యం ఉండాలి. అలా కాని పక్షంలో మానవుడు సర్వావస్థలయందు అసంతృప్తి కలిగే ఉంటాడు. మనిషిలో జ్ఞాన కాంక్ష పెరిగే కొద్దీ అతడు ఉన్నతంగా తీర్చబడతాడు. మన ఆలోచనా రీతిని బట్టే మన ఆచరణ ఉంటుంది. ఇతరులను సంతోషపెట్టినప్పుడే మనిషికి నిజమైన శాంతి.'పరోపకారః పుణ్యయ పాపాయ పరపీడనం' ఎదుటి వాడికి ఉపరకారం చేయడం పుణ్యం అపకారం చేయడం పాపమని మన సనాతన ధర్మం నొక్కి వక్కా ణించింది. అనభిధ్య పరస్వేషు, సర్వ సత్త్వేషు హృదయం । కర్మ ణాం ఫలమస్తీత మనసా త్రితయంచరేత్ ॥ పరుల సొత్తుపై ఆశ లేకుండా ఉండడం, సర్వజీవులయందును కరుణ, కర్మ కు ఫలితం ఉండి తీరుతుందనే భావం ఈ మూడింటినీ మనస్సులో ఉంచుకొని ప్రవర్తించాలని మనుస్మృతి చెబుతుంది. - గుమ్మా ప్రసాద రావు -
భగవద్గీత... సన్మార్గానికి చేయూత
జీవితమంటే ఏమిటి? జీవితం ఇలాగే ఎందుకుంది? ఈ నక్షత్రాలు, గ్రహాలూ ఎందుకున్నాయి? కాలం ఎంతో శక్తిమంతమైనదా? అసలీ ప్రపంచం ఎందుకు సృష్టించబడింది? దేవుడంటే ఎవరు? ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారు? సమాజంలో మంచివాళ్లకు చెడు ఎందుకు జరుగుతుంది? చెడు చేస్తున్న వారిని నిగ్రహించేవారే లేరా? ఈ ప్రకృతి ఏమిటి? ఇంకా ఎన్నో, ఎన్నెన్నో ప్రశ్నలు... ఎపుడైనా ఇటువంటి ప్రశ్నలు మీ మదిలో మెలిగాయా? వాటికి సమాధానాలు తెలుసుకోవాలని ప్రయత్నించారా? అవునో, లేదో కానీ ఇటువంటి మరెన్నో సందేహాలకు సంతృప్తికర సమాధానాలతో తాత్వికదర్శనాన్ని అందించే గ్రంథమే శ్రీమద్భగవద్గీత. వేదసారాన్ని అందించే ఉపనిషత్తులలో మేటియైన ఈ గ్రంథమే గీతోపనిషత్తుగా కూడా ఖ్యాతినొందింది. అసలెందుకు భగవద్గీతకు ఇంత ప్రాముఖ్యత అని అడిగితే అందుకు సమాధానమొక్కటే, అది ఈ సకల చరాచర సృష్టికి మూలకారణమైన దేవాదిదేవుడు సాక్షాత్తు శ్రీ కృష్ణునిచే స్వయంగా ఉపదేశించబడినందుకే. ‘కృష్ణస్తు భగవాన్ స్వయం’ అంటుంది శ్రీమద్భాగవతం. ధర్మాచరణయందు సందిగ్ధతలో పడి, మనస్తాపంతో చింతామగ్నుడైన అర్జునునికి కర్తవ్యబోధ చేసి అజ్ఞానాన్ని తొలగిస్తూ ఉపదేశించినదే భగవద్గీత. అలా భగవద్గీతను విన్న అర్జునుడు చివర్లో ఈ విధంగా అన్నాడు – ఓ అచ్యుతా! నా మోహం ఇప్పుడు నశించింది. నీ కరుణతో నా స్మృతిని తిరిగి పొందాను. ఇప్పుడు నేను స్థిరుడను, సందేహరహితుడను అయి నీ ఆజ్ఞానుసారం వర్తించుటకు సిద్ధంగా ఉన్నాను.’’– భగవద్గీత 18.73 మనం జీవితంలో ఎటువంటి పరిస్థితులలో వున్నా, భగవద్గీతలోని ఉపదేశాలను అనుసరిస్తే మన కర్తవ్య నిర్వహణయందు గల సందేహాలు నివృత్తి అవడమేగాక, దృఢమైన ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకెళ్ళగలం. భగవద్గీత అందించే ఆత్మవిశ్వాసం, చేసే పనుల్లో స్పష్టత మరే ఇతర వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలంటూ నేడు నిర్వహిస్తున్న పలు తరగతుల పాఠ్యాంశాలలో సైతం లభించదు. అసలు జీవన నిర్మాణ మూల ఉద్దేశమేమిటో తెలుసుకున్నప్పుడే వ్యక్తిత్వ వికాసమన్నది సాధ్యపడుతుంది. ఆ విషయాలను గీత విపులంగా వివరిస్తుంది. సమస్త వేదసారాన్ని, భగవతత్త్వాన్ని సమగ్రంగా అందించేదే భగవద్గీత. క్రమం తప్పకుండా పఠించినవాడు ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. అయితే వందల రకాల భగవద్గీతలు అందుబాటులో వున్న నేటి తరుణంలో ఒక విశుద్ధభక్తుడు రచించిన గీతను ఎంచుకోవటమే సకల విధాలా శ్రేయస్కరం. బ్రహ్మ–మధ్వ–గౌడీయ పరంపరలో 32వ ఆచార్యులైన శ్రీల ప్రభుపాదులవారు చిన్ననాటినుండే శ్రీ కృష్ణుని విశుద్ధ భక్తులు. శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూరులచే దీక్షను పొందిన వీరు కృష్ణ పరంపర సందేశాన్ని ‘భగవద్గీత యథాతథం’ గ్రంథంగా రచించారు. భగవద్గీత సందేశాన్ని ప్రపంచమంతటా వ్యాపింపజేశారు అత్యంత విలువైన భగవద్గీతలోని 700 శ్లోకాలను పారాయణ చేయడం ద్వారా విశ్వశాంతి, లోక కళ్యాణం కలుగుతాయి. అలానే విశ్వమానవ సౌభ్రాతృత్వం, స్నేహభావనలు పెరుగుతాయి. మన లోపల ఉండే అసూయ, ద్వేషం లాంటి వాటిని జయించగలం. ఈ గీతాజయంతి రోజున ప్రతి ఒక్కరూభగవద్గీత చదవడం, చదివించడం వంటి సంకల్పాన్ని పాటించండి. (5054 సంవత్సరాల క్రితం ఇదే రోజున శ్రీ కృష్ణుని అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించడం వల్ల దీనిని గీతాజయంతి పర్వదినంగా జరుపుకుంటున్నాం). ►భగవద్గీతలోని ముఖ్యమైన 108 శ్లోకాలను తాత్పర్య సహితంగా పారాయణ చేయడం ద్వారా దేవాది దేవుడైన శ్రీ కృష్ణభగవానుడి అనుగ్రహం పొంది శాంతి సౌఖ్యాలు పొందుతారు. గీతా సందేశం ఏదో ఒక మతానికే కాకుండా ఈ విశ్వంలోనే అందరూ సమతా భావాన్ని కలిగి ఐకమత్యంతో కలిసి మెలిసి పని చేసేలా చేయగలదు. నేడు గీతా జయంతి సందర్భంగా ప్రపంచమంతటా ఉత్సవాలు నిర్వహించబడతాయి. ‘యత్ర యోగేశ్వరో కృష్ణో...’ అని భగవద్గీతలో చెప్పినట్లుగా ప్రతిరోజూ భగవద్గీతను పఠిస్తే సంపద, విజయం, అసాధారణశక్తి, నీతి నిశ్చయంగా సంప్రాప్తిస్తాయి. భగవద్గీతపై వివిధ రకాలుగా వ్యాపించి ఉన్న అపోహలను విడనాడి, జీవితంలో ఆచరించవలసిన సన్మార్గానికి చేయూతనిచ్చే భగవద్గీతను ఇంటిల్లిపాదీ చదువుకోవచ్చు. కావున, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరని ఆశిస్తున్నాము. – సత్యగౌర చంద్ర ప్రభు, హరేకృష్ణమూవ్ మెంట్ హైదరాబాద్ అధ్యక్షులు, అక్షయపాత్ర ఫాండేషన్ ప్రాంతీయ అధ్యక్షులు. -
ఏమిటి కృష్ణా?.... రథం మారిపోయే!
కృష్ణార్జునల వాహనం మారిందేంటి? అని ఆశ్చర్యపోతున్నారా...! కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు రథం తోలుతూ అర్జునుడికి గీతోపదేశం చేస్తాడు... అది ద్వాపర యుగం. మరి ఇది కలియుగం కదా...కృష్ణార్జున పాత్రధారులైన కళాకారులు వేషధారణతోనే ఇలా మోపెడ్‌పై నగరంలో జరిగే ఒక కార్యక్రమానికి బయలుదేరారు. ఈ సందర్భంగా ముషిరాబాద్లో కెమెరా కంటికి చిక్కారు.