ముస్తాఫా మృతి కేసులో కోర్టుకు నివేదిక
హైదరాబాద్: మొహిదీపట్నం ఆర్మీ మైదానంలో అనుమానాస్పదంగా మృతి చెందిన మదర్సా విద్యార్థి ముస్తాఫా(11) కేసులో హైదరాబాద్ పోలీసు కమిషనర్, ఆర్మీ అధికారులు సోమవారం కోర్టుకు నివేదిక సమర్పించారు. ప్రధానంగా ఆరు అంశాలపై విచారణ సాగించినట్టు నివేదికలో పోలీసు కమిషనర్ పేర్కొన్నారు.
ఇప్పటివరకు 70 మంది ఆర్మీ ఉద్యోగులను విచారించినట్టు వెల్లడించారు. 23 మందిని వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో విచారించామని తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడ్డ అప్పలరాజు ప్రధాన నిందితుడని అనుమానిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోవడంతో కేసు విచారణ ఆలస్యమవుతోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దర్యాప్తు సాగిస్తున్నట్టు నివేదికలో తెలిపారు.