around the world
-
ఇదేం విడ్డూరం..మంగళవారం పెళ్లిళ్లు చేసుకుంటే పెటాకులవుతాయా?
5జీ టెక్నాలజీతో దూసుకుపోతున్నా ఇప్పటికీ మూఢనమ్మకాలు మనల్ని వెనక్కి లాగుతూనే ఉన్నాయి. ఆకాశంలో విహరిస్తున్నా ఇప్పటికీ పిల్లి ఎదురుపడితే అపశకునం అని, రాత్రిపూట గోళ్లు కత్తిరిస్తే అరిష్టం అని, పగిలిన అద్దం వాడిదే దరిద్రమని నమ్మేవాళ్లు బోలెడుమంది ఉన్నారు. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా, ఎన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ మూఢనమ్మకాలు,ఆచారాలను పాటించేవాళ్లు చాలామంది ఉన్నారు. పెద్దవాళ్లు చెప్పారంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుందన్న గుడ్డి నమ్మకంతో కొన్నింటిని ఫాలో అవుతుంటాం. ఇది ఒక్క మనదేశంలోనే కాదండోయ్, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. అలాంటి వింతైన మూఢనమ్మకాలు మనల్ని కశ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి. ♦ నైజీరియాలో పిల్లల పెదవులపై ముద్దు పెట్టరు. అలా చేస్తే పిల్లలు పెద్దవాళ్లయ్యాక వాళ్ల జీవితం నాశనం అవుతుందని నమ్ముతారట. ♦ మామూలుగా ఖాళీగా కూర్చున్నప్పుడు కాళ్లు ఊపడం చాలామందికి అలవాటు. అయితే దక్షిణ కొరియాలో మాత్రం ఈ అలవాటును అస్సలు ఒప్పుకోరట. ఖాళీగా కూర్చొని కాళ్లు కదిపితే ఆ వ్యక్తి సంపద మొత్తం పోతుందని నమ్మకం. అందుకే దక్షిణ కొరియాలో ఎవరైనా కాళ్లు కదుపుతూ ఉంటే ఆ వ్యక్తిని అసహ్యంగా చూస్తారట. ♦ ఐస్‌ల్యాండ్‌లో ఆరుబయట అల్లికలు,కుట్లు చేయరట. అలాచేస్తే చలికాలం మరింత ఎక్కువ కాలం కొనసాగుతుందని భావిస్తారు. అలసే అక్కడ మైనస్ డిగ్రీల వాతావరణం కాబట్టి ఈ పని అస్సలు చేయరు. ♦ లాటిన్ అమెరికా దేశాల్లో మంగళవారం పెళ్లి చేసుకోరు. ఒకవేళ అలా చేసుకుంటే ఆ పెళ్లి పెటాకులైనట్లేనని నమ్మకం. నిత్యం తిట్లు, గొడవలతో చివరకు విడాకులు తీసుకొని విడిపోతారట. అందుకే అక్కడి ప్రజలు మంగళవారం పెళ్లిళ్లు చేసుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ వాళ్లు చేసుకున్నా ఏదో ఒక సాకుతో జనం వెళ్లడానికి కూడా ఇష్టపడరట. ♦ జపాన్‌లో ఉత్తరం లేదా పశ్చిమం వైపు చూస్తూ ఎవరూ నిద్రపోరట. ఎందుకంటే జపాన్‌లో చనిపోయిన వారి తలలు ఉత్తరం వైపు చూస్తున్నట్లు ఉంచుతారు. ఆఫ్రికాలో పశ్చిమంవైపు చూస్తున్నట్లు ఉంచుతారు. అందుకని జపనీస్ అలా నిద్రపోరట. ♦ జర్మనీలో కొవ్విత్తితో సిగరెట్ వెలిగించకూడదు. అది సముద్ర నావికులను చెడు చేస్తుందట. ♦ ఆఫ్రికా దేశం రువాండలో మహిళలు మేక మాంసం తినకపోవడమే మంచిదట. ఎక్కువగా మేక మాంసం తింటే ముఖంపై వెంట్రుకలు వస్తాయనేది మూఢనమ్మకం. ♦ జపాన్‌లో సూర్యాస్తమయం తర్వాత చేతి గోళ్లను కత్తిరించరు. అలా కత్తిరిస్తే త్వరగా చనిపోతారని నమ్ముతారట. మన దగ్గర కూడా అరిష్టం అని రాత్రిళ్లు గోళ్లు కత్తిరించరు. ♦ వర్షం పడుతున్నప్పుడు బయటకు వెళ్లాలంటే ఏం చేస్తాం? గొడుగు తీసుకొని బయటకు వెళ్తాం. అయితే ఆ గొడుగు బయటకు వెళ్లాకే తెరవాలట. ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు గొడుగు తెరవొద్దట. ఇంట్లో ఉండగానే గొడుగు తెరిస్తే దురదృష్టం వెంటాడుతుందట. అందుకే ఎంత వర్షం పడుతున్నా పూర్తిగా ఇంటినుంచి బయటకు వెళ్లిన తర్వాతే గొడుగు తెరుస్తారు. ♦ స్వీడన్లో మాన్హోల్పై పొరపాటున కూడా కాలు పెట్టరట. అలా చేస్తే ప్రేమ విఫలం అవుతుందని, దురవృష్టం వెంటాడుతుందని బలం నమ్ముతారు. వినడానికి విడ్డూరంగా ఉంది కదూ.. -
2019లో ప్రపంచవ్యాప్తంగా పౌరుల ఆగ్రహం
-
300% పెరిగిన సైబర్ నేరాలు
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు దడ పుట్టిస్తున్నాయి. భారత్ లక్ష్యంగా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. దేశంలో 2011-14 మధ్య మూడేళ్ల కాలంలో సైబర్ నేరాలు ఏకంగా 300 శాతం పెరిగాయి. విస్తరిస్తున్న అంతర్జాలం... అరచేతిలో స్మార్ట్ ఫోన్ల మాయాజాలంతో ఈ తరహా నేరాలు ఏటికేడూ ఆందోళనకర స్థాయిలో అధికమవుతున్నట్టు అసోచామ్-పీడబ్ల్యూసీ అధ్యయనంలో తేలింది. ఎక్కువగా అమెరికా, టర్కీ, చైనా, బ్రెజిల్, పాకిస్తాన్, అల్జీరియా, యూఏఈ, యూరప్‌ల నుంచి హ్యాకింగ్‌లకు పాల్పడుతున్నట్టు వెల్లడైంది. 2000 ఐటీ చట్టం కింద 2011-14 మధ్య కాలంలో 300 శాతం అధికంగా సైబర్ కేసులు నమోదైనట్టు ‘ప్రొటెక్టింగ్ ఇంటర్‌కనెక్టెడ్ సిస్టమ్స్ ఇన్ సైబర్ ఎరా’ పేరిట నిర్వహించిన ఈ అధ్యయనం పేర్కొంది. అణు కర్మాగారాలు, రైల్వే, ఇతర రవాణా వ్యవస్థలు, ఆసుపత్రుల వంటివాటిపై నేరగాళ్లు గురిపెట్టారు. దీనివల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం, నీటి కలుషితం, వరద, రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం వంటి భయంకర పరిణామాలు చోటుచేసుకొంటున్నట్టు గుర్తించింది. ‘భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’ 2015లో భద్రతకు సంబంధించి 50 వేల సమస్యలను పరిష్కరించినట్టు ఈ సందర్భంగా అధ్యయనం పేర్కొంది. వ్యక్తిగత, ప్రభుత్వ, వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది. -
11 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టొచ్చాడు!
-
11 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టొచ్చాడు!
పెర్త్: 'సాహసం నా పథం.. రాజసం నా రథం.. సాగితే ఆపడం సాధ్యమా..' అని పాడుకుంటూ కేవలం 11 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టొచ్చాడు ఓ 65 ఏళ్ల పెద్దాయన! పేరు ఫెడర్ కాంకోవ్. దేశం రష్యా. చిన్నప్పటి నుంచి సాహసాలంటే చెవికోసుకునే ఫెడర్.. విధివశాత్తు మతబోధకుడయ్యారు. రష్యాలోని ఓ ఆర్థోడాక్స్ చర్చీలో ఫాదర్ గా పనిచేస్తున్న ఆయన సాహస ప్రవృత్తిని మాత్రం వదులుకోలేదు. ఏమాత్రం సమయం చిక్కినా హాట్ ఎయిర్ బెలూన్ లో అకాశంలోకి వెళ్లి సరదాగా విహరించేవాడు. 'ఒక్కసారైనా ప్రపంచాన్ని చుట్టివచ్చే అవకాశం ఇవ్వు'అని దేవుణ్ని ప్రార్థించాడు. దయగల ప్రభువు ఫెడర్ కోరికను మన్నించాడు. దాదాపు రెండు టన్నుల బరువు, 56 మీటర్ల పొడవు, హీలియంతో నడిచే భారీ హాట్ ఎయిర్ బెలూన్ లో పెర్త్ (ఆస్ట్రేలియా) నుంచి జులై 12న బయలుదేరిన ఫెడర్.. ప్రపంచాన్ని చుట్టేసి, సరిగ్గా 11 రోజుల ఆరు గంటలకు తిరిగి బయలుదేరిన చోటికి చేరుకున్నాడు. 23వేల అడుగుల ఎత్తులో.. విపత్కర వాతావరణాన్ని ఎదుర్కొంటూ, గాలులకు తట్టుకుంటూ, నిద్రలేమితో ఒంటరిగా ప్రయాణించిన ఫెడర్.. అతి తక్కువ సమయంలో గ్లోబ్ ని చుట్టొచ్చిన సాహసిగా రికార్డు సృష్టించాడు. గతంలో అమెరికాకు చెందిన ఓ వ్యాపారవేత్త ఇలాంటి హాట్ ఎయిర్ బెలూన్ లోనే 13 రోజుల ఎనిమిది గంటల్లో ప్రపంచాన్ని చుట్టొచ్చాడు. -
ప్రపంచ వ్యాప్తంగా న్యూఇయర్ సంబరాలు
-
మీ పండుగ పాడుగాను..!
సాక్షి: 'పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి' అంటారు. కొన్ని చోట్ల జరిగే వెరైటీ ఫెస్టివల్స్ చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. కొంత మంది బుర్రలో తట్టిన వింత ఆలోచనల కారణంగానే ఇలాంటి పండుగలు పుట్టుకొచ్చాయి. సాధారణంగా పండుగల వెనుక ఎంతో చారిత్రక నేపథ్యం, ప్రాధాన్యం ఉంటాయి. కానీ ఇలాంటివేమీ లేకుండా వేలం వెర్రిగా జరుపుకునే కొన్ని వెరైటీ ఫెస్టివల్స్ గురించి ఈ రోజు తెలుసుకుందాం.. ! స్పెయిన్‌లో జరిగే టమోటాల పండుగనే 'టమోటా యుద్ధం' అని కూడా అంటారు. దీన్ని ఆగస్టు చివరి బుధవారం జరుపుకుంటారు. ఇది 1945లో ప్రారంభమైంది. ఈ పండుగ రోజున అక్కడికి చేరుకునే జనం ఒక గంట పాటు ఒకరిపై ఒకరు టమోటాలు విసురుకుని ఆనందిస్తారు. అయితే ఇందులో పాల్గొన్న ప్రజలు గాయపడకుండా ఉండేందుకు టమోటాలను విసిరే ముందు నలిపేయాలనే షరతు కూడా ఉంది. ఎలామొదలైంది.. టమోటా యుద్ధం మొదలైన తీరు హాస్యాస్పదంగా అనిపిస్తుంది. 1945 ఆగస్టు చివరి బుధవారం అక్కడ సంప్రదాయం ప్రకారం 'జెయింట్స్ అండ్ బిగ్ హెడ్స్' పెరేడ్ జరుగుతోంది. ఇందులో ఉత్సాహంగా పాల్గొన్న వారిలో ఒక యువకుడు కింద పడిపోయాడు. అతనికి కోపం వచ్చి చేతికి అందిన వస్తువునల్లా జనం మీదకు విసరడం మొదలు పెట్టాడు. ఇంతలో అటుగా వెళ్తున్న టమోటా బండి కనపడింది. అతను ఆ టమోటాలను కూడా విసరడం మొదలు పెట్టాడు. తర్వాత అతనితో పాటు మిగిలిన జనం కూడా ఇలా చేయడం ప్రారంభించారు. పోలీసులు వచ్చే వరకు ఈ తంతు అలానే కొనసాగింది. ఈ పండుగ ఆరంభానికి ప్రారంభ సంఘటన ఇదే. ఇదేదో బావుంది కదా అని కొంత మంది యువత తర్వాత సంవత్సరం కూడా ఉత్తుత్తిగా గొడవపడి టమోటాలతో కొట్టుకున్నారు. ప్రతి ఏటా యువత ఇలా చేయడం ఇష్టపడుతుండటంతో ప్రభుత్వమే దీన్ని అధికారికంగా నిర్వహించడం మొదలు పెట్టింది. పర్యాటకులకు ఇది ప్రధాన ఆకర్షణగా మారింది. జర్మనీలో ప్రతి ఏటా అక్టోబర్ 6న బాతుల పండుగను నిర్వహిస్తారు. అయితే ఇందులో నిజమైన బాతులను ఉపయోగించరు. పసుపుపచ్చ రంగులో ఉండే రబ్బరు బాతు బొమ్మలను ఈ పందెంలో ఉంచుతారు. బొమ్మలు తిరగబడకుండా ఉండేందుకు బాతు బొమ్మకు చిన్న ఇనుపముక్క కడతారు. ఈ పందెంలో వందలాది మంది పాల్గొంటారు. ఈ బొమ్మల మీద పేర్లు రాసుకుంటారు. ఎవరి బాతు ఎక్కువ దూరం ప్రయాణిస్తే వారు పందెంలో గెల్చినట్టు లెక్క. గెల్చిన వారికి 10,000 యూరోల బహుమతి (సుమారు రూ. 7 లక్షలు) లభిస్తుంది. ఈ పండుగలో అందరూ ఒక చోట గుమికూడి రెడ్‌వైన్‌ను ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. జూన్ చివరి మూడు రోజుల్లో ఈ ఫెస్టివల్‌ను జరుపుకుంటారు. దక్షిణ స్పెయిన్‌లోని హారో అనే పట్టణంలో విదేశీయులతో కలిసి సుమారు 10,000 మంది ఇందులో పాల్గొంటారు. వీరంతా జగ్గులు, బకెట్స్, వాటర్ పిస్టల్స్‌తో సుమారు 1,30,000 లీటర్ల రెన్వైన్ చల్లుకుని తడిసిముద్దవుతారు. ప్రత్యేకతలు.. బ్యాటిల్ ఆఫ్ వైన్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు వచ్చేవారు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకుని, వివరాలు నమోదు చేసుకోవాలి. ఉదయం ఏడు గంటలకు మొదలయ్యే ఈ పండుగకి ఒక గంట ముందే చేరుకోవాలి. ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరు కచ్చితంగా తెల్ల దుస్తులు ధరించాలి. చిన్న పిల్లలకు ప్రవేశం లేదు. ఎవరి మీద ఎవరికీ కోపం ఉండకూడదు. కేవలం ఎదుటి వారి తెల్ల దస్తులను వైన్‌తో తడిపి రెడ్‌గా చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఉదయం మొదలైన పండుగ సాయంత్రం వరకు కొనసాగుతుంది. -
చుక్క ఇంధనం లేకుండా.. ప్రపంచయాత్ర!
ఇదివరకే పలుసార్లు విజయవంతంగా గగనవిహారం చేసిన ప్రపంచ తొలి సౌర విమానం 'సోలార్ ఇంపల్స్' మొదటిసారిగా ప్రపంచయాత్రకూ శ్రీకారం చుట్టింది. సోమవారం అబుదాబీ నుంచి సోలార్ ఇంపల్స్-2(ఎస్ఐ-2) సౌర విమానం చరిత్రాత్మక ప్రయాణం మొదలెట్టింది. చుక్క ఇంధనం లేకుండా.. 35 వేల కి.మీ. సాగే ఈ సుదీర్ఘయాత్రకు తొలి పైలట్‌గా సోలార్ ఇంపల్స్ సీఈవో బోర్ష్‌బర్గ్.. రెండో పైలట్‌గా సంస్థ సహ వ్యవస్థాపకుడు పికార్డ్ వ్యవహరిస్తున్నారు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఈ విమానం ఐదు నెలల్లో 25 రోజుల పాటు ఎగరనుంది. జూలై చివరలో ఈ విమానం తిరిగి అబుదాబీకి చేరుకోనుంది. ఇవీ విశేషాలు... విమానంలో సీటు ఒకటే. బరువు 2,300 కిలోలే. ఖాళీ బోయింగ్(1.80 లక్షల కిలోలు)తో పోల్చితే ఇది నామమాత్రమే. ఒక్కో రెక్క పొడవు 72 మీటర్లు. బోయింగ్ 747 విమానం కన్నా దీని రెక్కలే పెద్దవి. సౌరశక్తితోనే నడుస్తుంది. రెండు రెక్కలపై కలిపి 17, 248 సోలార్ సెల్స్ ఉంటాయి. సౌరశక్తితో నడిచే 4 ఎలక్ట్రికల్ మోటార్లు ప్రొపెల్లర్స్‌ను తిప్పుతాయి. సౌరశక్తిని నిల్వ చేసేందుకు నాలుగు లిథియం పాలిమర్ బ్యాటరీలు ఉంటాయి. కార్బన్ ఫైబర్‌తో తయారైన ఇంపల్స్ గరిష్ట వేగం ప్రస్తుతం గంటకు 45 కి.మీనే! సముద్రంపై పగలు 8,500 మీటర్లు, రాత్రి 1,500 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాల మీదుగా సాగే ప్రయాణం ఎక్కడా ఆగకుండా ఐదు రాత్రులు, ఐదు పగళ్లూ సాగనుంది. ఈ ఐదు రోజులూ పైలట్ ఒక్కరే! పైలట్ వెనక్కి వాలడం తప్ప సీట్లోంచి లేచేందుకు వీలు కాదు. కాలకృత్యాలకు వీలుగా పైలట్ సీటును రూపొందించారు. కాక్‌పిట్‌లో ఏసీ ఉండదు కాబట్టి.. పైలట్‌కు ఉక్కపోత, చలి తప్పదు. పైలట్ రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, ఇతర సమాచారం నిరంతరం కంట్రోల్ రూంకు చేరుతుంది. ఎస్ఐ-2 నేడు(మంగళవారం) అహ్మదాబాద్‌కు చేరుకుం టుంది. వారణాసిలో కూడా ఆగుతుంది. అబుదాబీ నుంచి మస్కట్, ఒమన్, భారత్, చైనా, మయన్మార్, హవాయి, ఫీనిక్స్, అరిజోనా, న్యూయార్క్, మొరాకోల మీదుగా ప్రయాణించి తిరిగి అబుదాబీకి చేరుకుని ప్రపంచయాత్రను ముగించనుంది. -
భారత్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలి బంజారాహిల్స్ : భిన్న మతాలకు నెలవైన భారతదేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచదేశాలు అన్ని మతాలను గౌరవిస్తూ ఐకమత్యంతో ముందుకు సాగాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలి అన్నారు. ఆదివారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కాన్సులేట్, అల్-ముస్తఫా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్, వరల్డ్ అలిబేట్ అసెంబ్లీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అవెటైడ్ సేవియర్ ఇన్ వేరియస్ రిలీజియన్స్ అండ్ ఔట్లుక్ అబౌట్ ది ఫ్యూచర్ ఆఫ్ ది వరల్డ్’ (ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న మతాలపై అవగాహన) అన్న అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. వివిధ దేశాల్లో మతం పేరిట జరుగుతున్న హింసలో బలవుతున్నది సామాన్యులేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్ కాన్సులేట్ జనరల్ హసన్ నౌరీన్ మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ మతాలలోని మంచితనాన్ని గ్రహించి మానవాళి సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. విశ్వవ్యాప్తంగా భిన్నమైన మతాలు, జాతులు, ఆచార సంప్రదాయాలు ఉన్నాయని, వీట న్నింటి సారం ఒక్కటేనని పేర్కొన్నారు. పరస్పరం ఘర్షణ పడటం మాని విశ్వశాంతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో హెన్రీ మార్టిన్ ఇనిస్టిట్యూట్ పాదర్ పీటీ శామ్యుల్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో పాటు పలు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.