arrived
-
బాబ్రీ మసీదును ఎక్కడ నిర్మిస్తున్నారు? నిధుల సేకరణ ఎలా?
అయోధ్యలో మసీదు నిర్మాణానికి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. బాబ్రీ మసీదు స్థానంలో మహ్మద్ బిన్ అబ్దుల్లా మసీదును నిర్మించనున్నారు. ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌లోని వాక్యాలను లిఖించిన ఇటుకలను మసీదు నిర్మాణం కోసం వినియోగించనున్నారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు స్థానంలో నిర్మించబోయే ఈ మసీదుకు మహమ్మద్ బిన్ అబ్దుల్లా మసీదు అని పేరు పెట్టారు. అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలోని ధన్నీపూర్ గ్రామంలో ఈ మసీదును నిర్మించనున్నారు. అయోధ్య భూ వివాదంపై 2019లో తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు.. ఐదు ఎకరాల స్థలంలో మసీదు నిర్మించాలని ఆదేశించింది. మసీదు నిర్మాణ బాధ్యతను ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు అనుసంధానంగా ఉన్న ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ చేపట్టింది. మీడియాకు ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ సీనియర్ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అయోధ్యలో మసీదు నిర్మాణం రాబోయే మే నెలలో ప్రారంభం కానుంది. నిర్మాణం పూర్తికావడానికి నాలుగేళ్లు పట్టవచ్చని భావిస్తున్నారు. మసీదు నిర్మాణం కోసం క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్ ద్వారా నిధులను సేకరించనున్నారు. ఈ మసీదులో ఐదు మినార్లు ఉండనున్నాయి. అతిపెద్ద ఖురాన్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. మసీదు కాంప్లెక్స్‌లో ఆసుపత్రి, మ్యూజియం, లైబ్రరీ, కమ్యూనిటీ కిచెన్, ఇండో-ఇస్లామిక్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. మసీదు పునాదికి ఉపయోగించే పవిత్ర ఇటుకను మసీదు అభివృద్ధి కమిటీ అధిపతి హాజీ అరాఫత్ షేక్ భారతదేశానికి తీసుకువచ్చారు. ఈ ఇటుకపై మహ్మద్ ప్రవక్త ప్రవచనాలను బంగారంతో లిఖించారు. మసీదులో మొదటి ప్రార్థనను మక్కా ఇమామ్ ఇమామ్-ఎ-హరమ్ అబ్దుల్ రెహమాన్ అల్-సుదైస్ చేస్తారని సమాచారం. -
Tiger: గబ్బర్ పులి వచ్చింది..
సాక్షి, మంచిర్యాల(ఆదిలాబాద్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లోకి మరో పులి అడుగుపెట్టింది. తిప్పేశ్వర్ నుంచి వచ్చిన గబ్బర్ పులి ఆదిలాబాద్ డివిజన్ సరిహద్దుల్లో సంచరిస్తోంది. మూడేళ్ల వయస్సున్న ఈ మగ పులి మహారాష్ట్ర, జిల్లాకు సరిహద్దుల్లో కిన్వట్, తలమడుగు అటవీ ప్రాంతంలో సంచరిస్తూ కెమెరాకు చిక్కింది. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలోనే సంచరిస్తున్న ఈ బెబ్బులి కవ్వాల్ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పెన్‌గంగా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి సమీపంలో కొత్త ఆవాసాన్ని వెతుక్కుంటూ ఇటువైపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెన్‌గంగా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి చెందిన ఈ పులి ఆ ప్రాంతంలో కనిపించడం లేదని అక్కడి అటవీ అధికారులు గుర్తించారు. తిప్పేశ్వర్ టైగర్ రిజర్వులో పులుల సంఖ్య పెరిగి ఆవాసం, తోడుììæ పులుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంటున్నాయి. దీంతో తోడు, ఆవాసం కోసం ఇతర ప్రాంతాలను వెతుక్కుంటూ ఇటువైపు వస్తున్నవి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో పులి ఈ ప్రాంతంలోకి అడుపెట్టడంతో స్థానిక అధికారులు సంచరించే ప్రాంతంపై అప్రమత్తం అయ్యారు. కారిడార్లోనే నిత్యం సంచారం కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలో కోర్ ప్రాంతంగా ఉన్న మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్ కవ్వాల్‌లో కన్నా బఫర్ ప్రాంతాల్లో పులుల సంచారం అధికమైంది. పులులు ఆదిలాబాద్ డివిజన్‌లోకి తిప్పేశ్వర్ నుంచి ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్లకు తడోబా అందేరి పులుల సంరక్షణ కేంద్రం నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. ఎగువన పెన్‌గంగా, దిగువన ప్రాణహిత తీరాలను దాటుతూ కవ్వాల్‌లోకి అడుగుపెడుతున్నాయి. కోర్ ప్రాంతంగా గుర్తించిన చోట కాకుండా బఫర్ ప్రాంతంగా టైగర్ కారిడార్లోనే పు లుల ఆవాసాలు పెరుగుతున్నాయి. తాజాగా గబ్బర్ పులి సైతం కారిడార్‌కే పరిమితం కాకుండా భీంపూర్, తలమడుగు, కిన్వాట్, బోథ్ మీదుగా కవ్వాల్ వైపు వెళ్లే అవకాశాలు లేకపోలేదు. గతంలోనూ జే1 అనే మగ పులి జన్నారంలో కోర్ ఏరియాలో కొంతకాలం సంచరించి తిరిగి కాగజ్‌నగర్ డివిజన్లోకే వెళ్లిపోయింది. ప్రస్తుతం అక్కడే సంచరిస్తోంది. కాగజ్‌నగర్ డివిజన్లో పెద్దవాగు, ప్రాణహిత తీరాల్లో పులులు సంచరిస్తూ అక్కడే సంతానోత్పత్తిని పెంచుకుంటున్నాయి. తరచూ అక్కడ అడవులకు వెళ్లిన పశువులను వేటాడుతూ ఆకలి తీర్చుకుంటున్నాయి. అటవీ శాఖ కవ్వాల్‌లోని కోర్ ఏరియాలో పులుల స్థిర ఆవాసం కోసం గడ్డిక్షేత్రాల పెంపు, శాకాహార జంతువుల సంఖ్యను వృద్ధి చేయడం వంటి చర్యలు చేపట్టినా అక్కడ ఒక్క పులి స్థిర నివాసం ఏర్పర్చుకోలేకపోయింది. చుట్టపు చూ పుగా వస్తూ వెళ్తున్నాయే తప్ప ఇక్కడే ఆవాసం ఏర్పర్చుకోవడం లేదు. ఖానాపూర్ డివిజన్లో కోర్ గ్రామాల తరలింపు ప్రక్రియలో జాప్యం జరుగుతుండడంతో పులులు కారిడార్‌కే పరిమితం అవుతున్నాయి. పులి అలజడి పెంచికల్పేట్(సిర్పూర్): పెంచికల్పేట్, బెజ్జూర్ ప్రధాన రహదారిలోని లోడ్పల్లి అటవీ ప్రాంతంలో శనివారం పులి సంచరించింది. మోటార్‌సైకిళ్లపై వెళ్తున్న పలువురు సెల్ఫోన్లో చిత్రీకరించారు. పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని కొండపల్లి, లోడ్పల్లి, ఎల్లూర్, ఆగర్‌గూడ గ్రామ సమీపంలో సంచరిస్తూ పశువులపై దాడులకు తెగబడుతోంది. 15 రోజుల క్రితం లోడ్పల్లి ప్రధాన రహదారి పై సంచరించిన పెద్దపులి గ్రామ సమీపానికి వచ్చి మూడు పశువులపై దాడిచేసి హతమార్చింది. వారం రోజుల క్రితం ఎల్లూర్ అటవీ ప్రాంతంలోకి మేతకు వెళ్లిన పశువుల మందపై దాడి చేసి మూడింటిని చంపింది. నిత్యం రేంజ్ పరిధిలోని ఏదో ఒకచోట దాడులకు తెగబడుతుండడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పులుల సంచారంపై పెంచికల్పేట్ రేంజ్ అధికారి ఎస్.వేణుగోపాల్‌ను సంప్రదించగా.. రేంజ్ పరిధిలో నాలుగు పెద్ద పులులు ఏ1, ఏ2, కె8, ఎస్8 సంచారం ఉందని, అటవీ ప్రాంతంలో కి పశువుల కాపారులు, ప్రజలు వెళ్లరాదని సూ చించారు. లోడ్పల్లి, సల్గుపల్లి అటవీ ప్రాంతంలో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రయాణాలు చేయరాదని సూచించారు. -
హైదరాబాద్‌కు కాంగ్రెస్ ప్రముఖులు
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ కమిటీ సభ్యుడు రణదీప్‌సింగ్ సూర్జేవాలా సోమవారం హైదరాబాద్‌కు వచ్చారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డి.కె.శివకుమార్, ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా విడిగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాయచూర్‌లో జరిగే ఓ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి వెళ్తూ ఈ ముగ్గురు మార్గమధ్యలో హైదరాబాద్‌లో బసచేశారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, కర్ణాటక కాంగ్రెస్ సహ ఇన్చార్జి మధుయాష్కీగౌడ్ నివాసానికి వెళ్లిన వీరు కొంతసేపు అక్కడ విశ్రాంతి తీసుకుని రాయచూర్‌కు వెళ్లారు. వీరిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. -
కొంపముంచిన అత్యవసర స్విచ్!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదానికి కారణాలు, ఆస్తి నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు. సోమవారం ఎట్టకేలకు ప్రమాద స్థలానికి నిపుణుల బృందం చేరుకోగలిగింది. 150 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 6 యూనిట్లు ఉండగా, మంగళవారం వీటికి సంబంధించిన టర్బయిన్లను తెరిచి చూసే అవకాశం ఉంది. అప్పుడే నష్టంపై పూర్తి అంచనా రానుందని జెన్కో ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. టర్బయిన్ల పైన ఉండే జనరేటర్లు, వైన్డింగ్ కాయిల్స్ కాలిపోతే మాత్రం నష్టం రూ.వందల కోట్లలో ఉండే అవకాశం ఉంది. ఆరు యూనిట్లలో తొలి రెండింటి టర్బయిన్లు బాగానే ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. స్విచ్ పని చేయకపోవడంతోనే.. ఆరో యూనిట్‌కు సంబంధించిన ఎక్సైలేషన్ ప్యానెల్లో నిప్పురవ్వలు వచ్చిన వెంటనే.. దీనికి డీసీ కరెంట్ సరఫరా ఆటోమేటిక్‌గా ట్రిప్ కావాల్సి ఉంది. అలా జరిగి ఉంటే మంటలు ఆగిపోయి అగ్ని ప్రమాదం జరిగి ఉండకపోయేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక వేళ ఆటోమేటిక్‌గా పవర్ ట్రిప్ కాకున్నా, స్విచ్ ద్వారా నిలుపుదల చేసే ఏర్పాటు సైతం ఉంటుంది. ఈ స్విచ్ సైతం ఆ కీలక సమయంలో పని చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అంచనాకు వస్తున్నారు. టర్బయిన్లలో ఉండే జనరేటర్లలోని వైన్డింగ్ కాయిల్స్ పరిధిలో అయస్కాంత క్షేత్రం ఏర్పాటు చేయడానికి ఎక్సైలేషన్ ప్యానెల్స్ ద్వారా డీసీ విద్యుత్‌ను వాటికి సరఫరా చేస్తారు. దీనితో జనరేటర్ రోటర్లు తిరిగి విద్యుదుత్పత్తి జరుగుతుంది. ప్రారంభంలో డీసీ విద్యుత్‌ను బ్యాటరీల ద్వారా ఎౖMð్సలేషన్ ప్యానెల్‌కు అక్కడి నుంచి వైన్డింగ్ కాయిల్స్‌కు పంపుతారు. పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరపడానికి బ్యాటరీలతో సరఫరా చేసే విద్యుత్ సరిపోదు. జనరేటర్ల నుంచి ఉత్పత్తి అయిన హైడెల్ పవర్‌నే ఏసీ విద్యుత్‌గా మార్చి మళ్లీ జనరేటర్లకు పంపిస్తే పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుంది. ఇలా పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగేటప్పుడే ఎౖMð్సలేషన్ ప్యానెల్లో స్పార్క్స్ వచ్చాయి. అప్పటికప్పుడు ఎక్సైలేషన్ ప్యానెల్‌కు పెద్ద మొత్తంలో డీసీ విద్యుత్ సరఫరాను నిలుపుదల చేసి ఉంటే ప్రమాదం జరిగి ఉండకపోయేదని చెబుతున్నారు. కీలక సమయంలో డీసీ విద్యుత్ సరఫరాను నిలుపుదల చేసే స్విచ్ పని చేయలేదని నిపుణులు అంటున్నారు. చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో బ్యాటరీలు పని చేయకపోవడంతోనే స్విచ్ పని చేయలేదని తెలుస్తోంది. పునరుద్ధరణ పాక్షికమే! శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. మూడు రోజుల తర్వాత పవర్‌హౌస్‌లో పొగలు అదుపులోకి వచ్చినా పునరుద్ధరణ పనులు ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేలా లేవు. అతికష్టం మీద కేబుల్ పునరుద్ధరణ పనులు చేపట్టడంతో పవర్‌హౌస్‌లోని కొన్ని విద్యుత్ లైట్లు, ఎగ్జిట్స్ ఫ్యాన్లు పనిచేస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద నీరు ఉధృతి అధికంగా ఉండటం వల్ల ఇప్పటికే భూగర్భ పవర్‌హౌస్‌లోకి నీరు వచ్చి చేరుతున్నట్టు భాస్తున్నారు. దీంతో ఒకటి, రెండు యూనిట్లలో ఉత్పత్తి చేపట్టేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. నాలుగో యూనిట్‌లోని ట్రాన్స్ఫార్మర్ పేలడంతోనే 9 మంది మృతి చెందారని భావిస్తున్నారు. -
యూఏఈలో అడుగు పడింది
దుబాయ్: ఐపీఎల్ 13వ సీజన్ ఆడేందుకు మూడు ఫ్రాంచైజీ జట్లు యూఏఈ చేరుకున్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్తాన్ రాయల్స్ జట్లు గురువారం చార్టెడ్ ఫ్లయిట్లలో దుబాయ్ చేరుకోగా... కోల్‌కతా నైట్‌రైడర్స్ అబుదాబీలో అడుగుపెట్టింది. యూఏఈ వచ్చే ముందు ఆటగాళ్లందరికి పలుమార్లు కోవిడ్ టెస్టులు చేశారు. ఇప్పుడు వీరిని ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతారు. మళ్లీ ఈ 6 రోజుల్లోనే మూడు సార్లు కరోనా పరీక్షలు చేస్తారు. క్వారంటైన్ తొలి రోజు, మూడో రోజు, ఆఖరి రోజు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మూడింటిలో నెగెటివ్ ఫలితాలు వచ్చిన వారే జీవ రక్షణ వలయం (బయో బబుల్)లోకి వెళ్తారు. ఈ బుడగలో ఉన్నప్పటికీ టోర్నీ జరిగినంత కాలం ప్రతీ ఐదు రోజులకోసారి పరీక్షల తంతు జరుపుతూనే ఉంటారు. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు శుక్రవారం దుబాయ్‌కి బయల్దేరతాయి. ఇక మిగతా రెండు ఫ్రాంచైజీలు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ వారంతంలోగా యూఏఈ చేరుకునే అవకాశముంది. ఐపీఎల్–13 పోటీలు వచ్చే నెల 19 నుంచి జరగనున్నాయి. మొత్తం 60 మ్యాచ్‌లు 53 రోజుల పాటు దుబాయ్, అబుదాబీ, షార్జా మూడు వేదికల్లో నిర్వహిస్తారు. హర్భజన్ ఆలస్యంగా... ఐపీఎల్ మూడు సార్లు విజేత అయిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) పయనానికి సిద్ధమైంది. శుక్రవారం యూఏఈకి బయల్దేరనుంది. అయితే సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాత్రం జట్టు సభ్యులతో పాటే అక్కడికి వెళ్లడం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల ఆలస్యంగా వెళ్తాడని సీఎస్కే వర్గాలు తెలిపాయి. 40 ఏళ్ల వెటరన్ స్పిన్నర్ రెండో వారాల్లో జట్టుతో కలుస్తాడని సీఎస్కే అధికారి ఒకరు చెప్పారు. నిజానికి భజ్జీ సీఎస్కే శిబిరంలోనూ పాల్గొనలేదు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్ శార్దుల్ ఠాకూర్లు కూడా శిబిరంలో పాల్గొనలేకపోయినా జట్టుతో కలిసారు. ఆటగాళ్లందరికీ మంగళవారం రెండో దశ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ ఫలితాలే వచ్చాయని సీఎస్కే అధికారులు తెలిపారు. బుడగలో ఉన్నవారికి క్వారంటైన్ ఎందుకు? ఐపీఎల్లో ఆడే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లకు యూఏఈలో క్వారంటైన్ కావాల్సిన అవసరం లేదని రాయల్ చాలెంజర్ బెంగళూరు చైర్మన్ సంజీవ్ చురివాలా తెలిపారు. ఇరు జట్ల ఆటగాళ్లు జీవ రక్షణ వలయంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లు ఆడతారని... బుడగలో ఉన్న క్రికెటర్లకు మళ్లీ క్వారంటైన్ అవసరం ఏముంటుందని సంజీవ్ వ్యాఖ్యానించారు. ఆర్సీబీ జట్టులో ఆసీస్ స్టార్ అరోన్ ఫించ్, ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ మొయిన్ అలీ ప్రధాన ఆటగాళ్లు. ఈ నేపథ్యంలో వాళ్లను వచ్చి రాగానే మ్యాచ్‌ల్లో ఆడించాలని ఆలోచనలో ఆర్సీబీ ఉంది. విరాట్ కోహ్లి నేతృత్వంలోని బెంగళూరు జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షే అయ్యింది. అయితే టైటిల్ లేని లోటు జట్టును వేధిస్తుందని సహజంగానే ఈ ఒత్తిడి తమ ఆటగాళ్లపై ఉంటుందని సంజీవ్ అన్నారు. తనతో పాటు టెడ్డీకి మాస్క్ పెట్టి రియాన్ పరాగ్ -
గోవాకు చేరుకున్నా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
-
అధ్యక్షులందరూ గోవాకు వచ్చేశారు!
పనాజీ : నేటి నుంచి గోవాలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఆయా దేశాల అధినేతలందరూ భారత్ కు విచ్చేశారు. భారత్ అధ్యక్షతన శని, ఆది వారాల్లో ఈ సదస్సు జరుగుతోంది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాల అధినేతలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. మొదట ఈ సదస్సుకు హజరయ్యేందుకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకుబ్ జుమా గోవాకు చేరుకోగా, అనంతరం బ్రెజిల్ అధ్యక్షుడు మిచెల్ టెమర్లు దాబోలిమ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా రాత్రి 1 గంటలకు గోవాకు రావాల్సిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆలస్యంగా ఉదయం 10 గంటల ప్రాంతంలో దాబోలిమ్ విమానశ్రయానికి వచ్చారు. అనంతరం చైనా అధ్యక్షుడు క్సి జిన్‌పింగ్ మధ్యాహ్నం 12 గంటల తర్వాత గోవాకు చేరుకున్నారు. కాగ, భారత్ అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతుండటంతో నిన్న రాత్రే ప్రధాని నరేంద్రమోదీ గోవా వెళ్లారు. ఆయా దేశాల అధినేతలకు భారత ప్రతినిధులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఈ సదస్సు కోసం భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లుచేసింది. అనుకున్న మాదిరిగానే బ్రిక్స్ సదస్సు ప్రారంభమయ్యే ముందు భారత ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. డిఫెన్స్, ఎనర్జీ, అగ్రికల్చర్ వంటి వ్యాపార సంబంధాలపై ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఉగ్రవాదాన్ని కూడా ప్రధాన అజెండాగా తీసుకుని పుతిన్‌తో ప్రధాని చర్చించారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అనంతరం చైనా అధ్యక్షుడితో భారత ప్రధాని భేటీ అవుతారు. చైనా అధ్యక్షుడి రాకతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాయని మోదీ ట్వీట్ చేశారు. -
పల్లకిలో కాదు... బుల్లెట్ పై వచ్చింది!
పెళ్లితంతులో అనేక సంప్రదాయాలు కొనసాగడం మనం చూస్తుంటాం. అందులో ముఖ్యంగా వధువును పెళ్ళిమండపంలోకి తీసుకు రావడంలోనూ విభిన్న రీతులు కనిపిస్తాయి. ముత్తైదువులంతా చేతులు పట్టుకొని మండపంలోకి తీసుకొచ్చే సంప్రదాయం కొందరు పాటిస్తే... మరోచోట వధువును బుట్టలో కూర్చోబెట్టి మేనమామలు మోసుకొని తీసుకొస్తారు. అలాగే పల్లకీలోనూ తెస్తారు. ఇవన్నీ మనం ఇంతకు ముందు చూసినవే. అయితే అహ్మదాబాద్ కు చెందిన ఓ వధువు పెళ్లి మండపంలోకి వచ్చిన తీరు అక్కడి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇంతకూ ఆమె మండపంలోకి ఎలా వచ్చిందో ఊహించగలరా? అహ్మదాబాద్ కు చెందిన అయేషా ఉపాధ్యాయ తాను పెళ్లిలో విభిన్నంగా కనిపించాలనుకుంది. అదే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. పెళ్లి మండపంలోకి తాను కొత్త స్టైల్ లో ఎంటర్ అవుతానంటూ వారివద్ద ముందే పర్మిషన్ తీసుకుంది. 26 ఏళ్ళ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ అయిన అయేషా... 13 ఏళ్ళ వయసు నుంచే మోటర్ బైక్ లపై ఎంతో ఇష్టాన్ని పెంచుకుంది. అంతేకాదు ఉమెన్ బైకర్స్ గ్రూప్ లో సభ్యురాలుగా కూడ చేరింది. సాధారణంగా వధువులు పల్లకిలోనో, డోలీలోనో మండపంలోకి వచ్చే ట్రెండ్ ను తన కోసం మార్చుకుంది. తాను స్వయంగా వచ్చేందుకు రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ ను ఎంచుకుంది. తనకు కాబోయే భర్త లౌకిక్ కు బైక్ నడపడం రాదని తెలిసిన ఆమె... బైక్ పై విభిన్నంగా పెళ్లికి ఎంటరవ్వడమే కాక.. త్వరలో భర్తను బుల్లెట్ పై రైడ్ కు తీసుకెడతానంటూ సరదాగా ప్రామిస్ కూడ చేసింది. -
హైదరాబాద్‌లో అడుగుపెట్టిన పార్సల్డ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లాజిస్టిక్స్ రంగంలో ఉన్న పార్సల్డ్ సంస్థ.. విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పుణె, జైపూర్, బెంగళూరులో సేవలందిస్తోంది ఈ సంస్థ. ఆన్లైన్లో కొరియర్ సర్వీసును బుక్ చేసుకుంటే చాలు.. ఏజెంట్ మన ఇంటికొచ్చి మన ముందే సంబంధింత వస్తువులను ప్యాకింగ్ చేసి.. షిప్పింగ్ చేస్తారు. ఈ ప్రత్యేకతే తమను ముందుకు తీసుకెళుతోందని సంస్థ కో-ఫౌండర్, సీఈఓ క్షితిజ్ కోఠి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.